Home Uncategorizedప్రభుత్వ ఉపాధ్యాయ కుంభకోణం: 12 గ్రామాల ప్రజలు.. పది కోట్లు – Jananethram News

ప్రభుత్వ ఉపాధ్యాయ కుంభకోణం: 12 గ్రామాల ప్రజలు.. పది కోట్లు – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


ప్రభుత్వ ఉపాధ్యాయుల మోసం: గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం ఏంటి.. సమయానికి స్కూల్ కి రావాలి.. విద్యార్థులకు పాఠాలు చెప్పాలి.. వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వం విధించిన విధులు మొత్తం సక్రమంగా నిర్వహించాలి. కానీ ఈయన ఏం చేశాడో తెలుసా.. విధులను పక్కన పెట్టాడు. ఎవరు తనను ఏమీ చేయలేరని అనుకున్నాడు. చివరికి 12 గ్రామాల ప్రజలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. సూర్యాపేట ఏర్పాటు చివ్వెంల మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టీల […]

ప్రభుత్వ ఉపాధ్యాయ కుంభకోణం: గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం ఏంటి.. సమయానికి స్కూల్ కి రావాలి.. విద్యార్థులకు పాఠాలు చెప్పాలి.. వెనుకబడి ఉన్న విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వం విధించిన విధులు మొత్తం సక్రమంగా నిర్వహించాలి. కానీ ఈయన ఏం చేశాడో తెలుసా.. విధులను పక్కన పెట్టాడు. ఎవరు తనను ఏమీ చేయలేరని అనుకున్నాడు. చివరికి 12 గ్రామాల ప్రజలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

సూర్యాపేట ఏర్పాటు చివ్వెంల మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టీల పేరుతో 10 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఏకంగా 12 గ్రామాల ప్రజలకు గుండు సున్నా పెట్టి వెళ్లిపోయాడు. చివరికి కుటుంబంతో పరారయ్యాడు. చివ్వెంల మండలం లక్ష్మణ్ నాయక్ తండాలో ఈ సంఘటన జరిగింది. బాధితులు సూర్యపేట జిల్లా ఎస్పీ నర్సింహకు ఫిర్యాదు చేశారు. చివ్వెంల మండలం ఏనెగండి తండాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు శెట్టి గూడెం పాఠశాలలో పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఇతడు సూర్యాపేట విద్యానగర్ ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటున్నాడు. గడచిన ఆరు సంవత్సరాలుగా చిట్టి వ్యాపారం చేస్తున్నాడు. తన సొంత తండా తో పాటు చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు.. బంధువులు.. ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. లక్ష నుంచి 1.3 వరకు వసూలు చేశాడు. ఆ తర్వాత చిట్టిలు ఇవ్వడం నిలిపివేశాడు. మెచ్యురిటీ ముగిసిన తర్వాత కూడా చిట్టీ డబ్బులు ఇవ్వలేదు.

డబ్బుల కోసం చాలామంది డిమాండ్ చేస్తుంటే తట్టుకోలేక ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు. మరికొందరికి అయితే నెలవారి వాయిదాలలో అధిక లాభాలు వస్తాయన్న నమ్మకం బలికాడు. దాదాపు పది కోట్ల వరకు మళ్ళీ వసూలు చేశాడు. అయితే ఈ డబ్బులను తిరిగి ఇవ్వడంలో అతడు వాయిదా వేస్తున్నాడు. కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా తన పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమిలో.. 13 గుంటల భూమిని మాత్రమే తన పేరు మీద ఉంచుకున్నాడు. మిగిలిన భూమిని ఇతరుల పేరు మీద నమోదు చేయించుకుని.. డామెంట్లు తన వద్ద ఉంచుకున్నాడు.

ఆ తర్వాత ఆ టీచర్ పది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళాడు. ఒక ప్రముఖ వ్యక్తిని కలుస్తానని చెప్పి.. తన తండాకు చెందిన ఇద్దరిని తీసుకొని వెళ్లారు. ఒక హోటల్ కి వారిని తీసుకెళ్లాడు. ఆ తర్వాత తనకు అప్పులు అయ్యాయని.. ఏం చేయాలో తెలియడం లేదని వారు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వేరే వ్యక్తిని కలవాల్సి ఉందని వారితో చెప్పి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి రాకుండా పోయాడు. బాధితులు విషయాని గ్రహించి స్థానికంగా విచారించారు. అయితే సూర్యాపేటలో అతడు ఉంటున్న అద్దె ఇల్లు.. తండాలోని సొంత ఇంటికి సైతం తాళాలు వేసి వెళ్ళిపోయాడు. కోట్లల్లో డబ్బు వసూలు చేసి అతడు ఏం చేశాడు.. అతడు ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాడు.. ఎక్కడికి పారిపోయాడు.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

28 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

29 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

31 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

31 minutes ago
YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

YS Jagan Mohan Reddy: ఇటీవల కాలంలో జగన్ మీడియా ముందుకు తరచుగా వస్తున్నారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు.…

35 minutes ago