Home ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా – RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఆంధ్రప్రదేశ్: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో ఐటి విస్తరణకు ఆయన కృషి చేశారు. పెద్ద పెద్ద సంస్థలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారు. ఆయన చూపించిన చొరవ వల్ల హైదరాబాద్ నగరం దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ రాజధానిగా ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా […]

ఆంధ్రప్రదేశ్: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో ఐటి విస్తరణకు ఆయన కృషి చేశారు. పెద్ద పెద్ద సంస్థలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారు. ఆయన చూపించిన చొరవ వల్ల హైదరాబాద్ నగరం దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ రాజధానిగా ఆవిర్భవించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతారు. 2024లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా గాడిలో పెడుతున్నారు. ప్రత్యేకించి మౌలిక వసతులు.. సౌకర్యాల కల్పన.. పెట్టుబడులు.. సంక్షేమం వంటి వాటిని సమాన విధాలుగా నడిపిస్తూ ఏపీ రాష్ట్రంలో ఆయన సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.

ఐటీ వినియోగంలో.. టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా. ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజాప్రతినిధుల కోసం ఉపయోగించుకునే దిశగా చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రజా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా పాలసీ ప్రకటించింది. ఏకంగా జీవో కూడా విడుదలచేసింది.

డిజిటల్ మీడియా అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల సమాచారం ప్రతి కుటుంబానికి చేరాలి అంటే సంప్రదాయ ప్రచారంతో పాటు సోషల్ మీడియాను కూడా సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం చంద్రబాబు వద్ద ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను భాగస్వాములుగా చేసుకునే విధంగా ప్రభావం చూపుతుంది.

  • ఒక లక్ష కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారికి 15000
  • 50000 నుండి 99,000 ఫాలోవర్లు ఉన్నవారికి 7,500
  • 25 వేల నుంచి 50 వేల ఫాలోవర్లు ఉన్నవారికి 5,000
  • పదివేల నుంచి 25 వేల ఫాలోవర్లు ఉన్నవారికి నెలకు 2,500 వరకు ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.

అయితే ఇది కేవలం ఫాలోవల్ల సంఖ్యను బట్టి డబ్బులు చెల్లించే విధానం మాత్రమే కాకుండా.. ప్రభుత్వం నిర్దేశించే ప్రజా ప్రయోజన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎంత సమర్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారనేది కూడా కీలకంగా మారుతుంది.

ప్రస్తుతం యూట్యూబ్.. ఫేస్బుక్.. ఇన్ స్టా గ్రామ్..ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యువత.. గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సంక్షేమ పథకాలు.. అభివృద్ధి పనులు.. ప్రజల కోసం ఉపయోగపడే సేవలు.. ఆరోగ్యం.. విద్య.. పర్యావరణం.. కార్యక్రమాలపై అవగాహన వంటి అంశాల డిజిటల్ వేదికల ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం చేయడమే ఈ విధానాన్ని ప్రధాన ఉద్దేశం లాగా రూపొందించారు.

ఇప్పటివరకు సోషల్ మీడియాను ప్రధానంగా వ్యక్తిగత కంటెంట్.. వినోదం…. వివిధ రకాల ఉత్పత్తుల ప్రచారం కోసం అనేక మంది క్రియేటర్లకు ఈ పాలసీ కొత్త అవకాశాలను కల్పించనుంది. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాలు అత్యంత సులభంగా.. ఆకర్షణీయంగా.. స్థానిక భాషలో అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఫ్లూయెన్సర్లను ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఒకవైపు వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే అవకాశం ఏర్పడుతుంది.

మొత్తంగా చూస్తే ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లడానికి డిజిటల్ శక్తిని ఉపయోగించుకోవడంతో పాటు.. ప్రజల్లో కలవకుండా సోషల్ మీడియా క్రియేటర్లకు అవకాశాలు కల్పించే ప్రయత్నంగా ఈ కొత్తపాలసీని చూడవచ్చు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
ఇబ్బంది పడకండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు - RMK NEWS

[ad_1] ఇబ్బంది పడకండి: మలయాళం లో ప్రముఖ నటుడు ఫహద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు…

2 hours ago
ప్రోటీన్ పౌడర్లో విషం.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు.. - Jananethram News

[ad_1] AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా…

2 hours ago
Teacher Student Incident : హోంవర్క్ చేయలేదని దండించిన ఉపాధ్యాయురాలు.. ఇంతలోనే గుండె పగిలిన విద్యార్థి.. వీడియో వైరల్* - RMK NEWS

[ad_1] Teacher Student Incident : విశాఖ జిల్లాలో కలకలం రేపింది. ఒకటో తరగతి చదువుతున్న ప్రణయ్ తేజ…

2 hours ago
BRICS సమ్మిట్: ఈ పుతిన్, జిన్ పింగ్ కార్లు కదిలే సైన్యంతో సమానం.. - RMK NEWS

BRICS సమ్మిట్: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ మద్దతు.…

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా - RMK NEWS

ఆంధ్రప్రదేశ్: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో ఐటి విస్తరణకు…

2 hours ago