Home ఆంధ్రప్రదేశ్Botsa Satyanarayana: 13 గ్రామాల నాయకులు.. బొత్స ను జగన్ మళ్లీ – RMK NEWS

Botsa Satyanarayana: 13 గ్రామాల నాయకులు.. బొత్స ను జగన్ మళ్లీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

బొత్స సత్యనారాయణ: ఇప్పటివరకు వివిధ అక్రమాలు.. అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారు.. జైలుకు వెళ్లిన వైసీపీ నాయకులకు జగన్ పరామర్శ. ఓదార్పు అందించారు. కానీ ఇప్పుడు తొలిసారిగా జైలుకు వెళ్లని.. ఇంకా ఎటువంటి కేసులు నమోదు కానీ నాయకుడిని మరోసారి పరామర్శించాల్సి వస్తోంది. ఒకరకంగా ఓదార్పు ఇవ్వాల్సి వస్తోంది. స్థానిక ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నారా లోకేష్ వేసిన ఎత్తులకు వైసీపీ చిత్తయిపోయింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే […]

బొత్స సత్యనారాయణ: ఇప్పటివరకు వివిధ అక్రమాలు.. అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. జైలుకు వెళ్లిన వైసీపీ నాయకులకు జగన్ పరామర్శ. ఓదార్పు అందించారు. కానీ ఇప్పుడు తొలిసారిగా జైలుకు వెళ్లని.. ఇంకా ఎటువంటి కేసులు నమోదు కానీ నాయకుడిని మరోసారి పరామర్శించాల్సి వస్తోంది. ఒకరకంగా ఓదార్పు ఇవ్వాల్సి వస్తోంది. ఇంతకీ ఆ నాయకుడెవరు.. ఆ కథ కోసం..

స్థానిక ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నారా లోకేష్ వేసిన ఎత్తులకు వైసీపీ చిత్తయిపోయింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ కూటమి విజయ గర్వాన్ని ప్రదర్శించింది. చరిత్ర ఎన్నడూ లేనివిధంగా స్థానాలు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు స్థానికంగా కూడా అదే స్థాయి చూపించాలని కూటమి అనుకుంటున్నారు. ఈ కోరికనే నారా లోకేష్ వేసిన ఎత్తులకు ఉత్తరాంధ్రలో కీలక నాయకులు టిడిపిలోకి వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు వైసిపికి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనల్లుడు.. విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీను టిడిపిలో చేరారు. అంతే ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అంతేకాదు ఇక్కడ వైసిపి కూసాలు కదిలిపోతున్నాయి.

ఈ పరిణామంతో బొత్స ఆ మధ్య కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాలలో విలువలు లేవంటూ వాపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. జగన్ నుంచి పరామర్శ లభించింది. అంతేకాదు.. బొత్స సత్యనారాయణ కుమార్తెకు భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా లభించింది. అయితే ఇక్కడితోనే బొత్సకు బాధలు తప్పలేదు. ఆయనను మరింత ఇబ్బంది పెట్టే విధంగా టిడిపి పావులు కదిపింది. విజయనగరం జిల్లాలో ఏకంగా దాదాపు 13 గ్రామాలకు సంబంధించిన వైసీపీ నాయకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అది కూడా బొత్స సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.. చీపురుపల్లి పరిధిలోని మెరక ముడిదాం మండలంలో దాదాపు 13 గ్రామాల వైసిపి నాయకులు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిలో మాజీ సర్పంచులు.. మాజీ ఎంపీటీసీలు ఉన్నారు. ఈ పరిణమంతో వైసిపికి ఈ ప్రాంతంలో మరింత షాక్ తగిలింది. అయితే ఇది ఇక్కడితోనే అయిపోతుందా.. రాజీనామాల పర్వం మరింత జోరుగా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ పరిణామంతో బొత్సకు మరోసారి జగన్ పరామర్శ కావాలని.. ఆయన ఓదార్పు అవసరమని రాజకీయ విశ్లేషకులు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తన కంటి చూపుతో శాసించిన బొత్స.. ఇప్పుడు అదే కంటితో విలపించడం విశేషం.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో తలపండిన రాజకీయ నాయకుడిగా బొత్స సత్యనారాయణకు పేరుంది. పైగా ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయాలను అనేక దశాబ్దాలుగా శాసిస్తూ వస్తున్నారు. అటువంటి నాయకుడికి ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు. వైసిపిలో అధికారంలో ఉన్నప్పుడు బొత్స సానుకూలంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే నారా లోకేష్ ఈ స్థాయిలో దూకుడు చూపిస్తున్నారని.. వైసీపీని నామరూపాలు లేకుండానే.. స్థానిక ఎన్నికల్లో ఇదే సీన్ కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

You may also like

Leave a Comment