Home ఆంధ్రప్రదేశ్Pawan Kalyan: కూటమి నుంచి పవన్ బయటికి.. అంతేనా ఇంకా – RMK NEWS

Pawan Kalyan: కూటమి నుంచి పవన్ బయటికి.. అంతేనా ఇంకా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

పవన్ కళ్యాణ్ పొలిటికల్ వార్తలు రాస్తున్నప్పుడు జర్నలిస్టులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా అంతర్గత సమాచారం తెలిసినప్పుడు దానిని సరైన స్థాయిలో వాస్తవాలను తెలుసుకొని ప్రచురించాలి. అలాకాకుండా పెన్నుండి.. చేతిలో ఫోన్ ఉంది.. రాసేస్తాం.. అడ్డగోలుగా టైప్ చేస్తాం.. పేపర్ లేదా సోషల్ మీడియాలోకి ఎక్కిస్తాం.. కావలసినంత బురద చల్లేస్తాం అంటే.. ఎవరూ ఊరుకోరు. పైగా నేటి కాలంలో వాస్తవాలు.. పాలకు పాల మాదిరిగానే.. నీళ్లకు నీళ్ల మాదిరిగానే తెలిసిపోతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు […]

పవన్ కళ్యాణ్: పొలిటికల్ వార్తలు రాస్తున్నప్పుడు జర్నలిస్టులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా అంతర్గత సమాచారం తెలిసినప్పుడు దానిని సరైన స్థాయిలో వాస్తవాలను తెలుసుకొని ప్రచురించాలి. అలాకాకుండా పెన్నుండి.. చేతిలో ఫోన్ ఉంది.. రాసేస్తాం.. అడ్డగోలుగా టైప్ చేస్తాం.. పేపర్ లేదా సోషల్ మీడియాలోకి ఎక్కిస్తాం.. కావలసినంత బురద చల్లేస్తాం అంటే.. ఎవరూ ఊరుకోరు. పైగా నేటి కాలంలో వాస్తవాలు.. పాలకు పాల మాదిరిగానే.. నీళ్లకు నీళ్ల మాదిరిగానే తెలిసిపోతున్నాయి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఉన్న పార్టీలు ఒక అవగాహన కూటమికి వచ్చాయి. వాస్తవానికి వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని కూటమిలో ఉన్న పార్టీలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఏపీలో ఎటువంటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఉన్న పార్టీలకు మరింత గట్టిగా కూటమి తెలుసు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా చంద్రబాబునే అరెస్టు చేశారు. లేని కుంభకోణాన్ని తెరమీదకి తీసుకొచ్చి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ ను అయితే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి వీలు లేదు అన్నట్టుగా వ్యవహరించారు. అన్నీ కూడా సజీవ సాక్షాలు. సోషల్ మీడియాలో.. యూట్యూబ్‌లో టైప్ చేస్తే కనిపిస్తుంది.

వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాకూడదని.. జగన్ అరాచకం మళ్లీ కనిపించకూడదని ఉన్న పార్టీలు కూటమిగా నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే అడుగులు కూడా బలంగా వేస్తున్నాయి. జగన్ ఎట్టి పరిస్థితులలో బలోపేతం కాకూడదని నిర్ణయించుకున్నారు. కానీ స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు చేస్తారట. కూటమి నుంచి బయటికి వచ్చేస్తారట. ఇప్పటికే టిడిపి అధినేత వ్యవహార శైలితో ఆయన ఇబ్బంది పడుతున్నారట. బిజెపితో కూడా దూరం జరగాలని గట్టిగా అనుకున్నరట. నిజానికి ఇలాంటి వార్తలు రాస్తున్నప్పుడు రాసే పాత్రికేయులకు కాస్త సిగ్గు ఉండాలి. ఏం రాస్తున్నామో కాస్త సోయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావించారు. పైగా ఇటీవల జరిగిన ప్రతి సభలోనూ లోకేష్ తన అన్న పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. ఇటీవల పవన్ ఆపరేషన్ చేయించుకుంటే.. ముంబై వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. ఇంత గొప్ప బ్యాండింగ్ కొనసాగుతున్న కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తారని.. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారని.. అని రాస్తున్న తీరు చూస్తే.. ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ లకి నిజంగా దండేసి దండం పెట్టాలి అని జనసేన నాయకులు అంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలిచే స్థానాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాదు కార్యకర్తల కష్టాన్ని గుర్తుంచుకుంటామని.. కార్యకర్తలకు న్యాయం చేశారు.. ఎట్టి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టనీయబోమని ప్రకటించారు. గెలిచే స్థానాలను వదులుకునే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పారు. అదేవిధంగా కార్యకర్తలకు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇంత చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంకా ఏం క్లారిటీ ఇవ్వాలి.. ఇంకా ఏం చెప్పాలి.. ఏం చెబితే ఈ వైసీపీ అనుకూల జర్నలిస్టులు మారుతారు.. ఏం చెప్తే వారు నిశ్శబ్దంగా ఉండిపోతారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

29 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

30 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

31 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

32 minutes ago
YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

YS Jagan Mohan Reddy: ఇటీవల కాలంలో జగన్ మీడియా ముందుకు తరచుగా వస్తున్నారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు.…

36 minutes ago