తెలుగు సినిమా: సినిమా అనేది వందల మంది కష్టం. ఆ సినిమా విడుదలవుతున్న రోజు నిర్మాత నుంచి పెడితే టెక్నీషియన్ ల వరకు అందరికీ టెన్షన్ ఉంటుంది. సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఆదరణ పొందితే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. కానీ విడుదలకు ముందే సినిమా మొత్తం పైరసీ సైట్లలో కనిపిస్తే.. ఆ బాధ నిర్మాతకు మామూలుగా ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఒక నిర్మాత పరిస్థితి ఇలాగే మారిపోయింది. వచ్చేనెల 2న ప్రేక్షకుల ముందుకు తెల్ల […]
తెలుగు సినిమా: సినిమా అనేది వందల మంది కష్టం. ఆ సినిమా విడుదలవుతున్న రోజు నిర్మాత నుంచి పెడితే టెక్నీషియన్ ల వరకు అందరికీ టెన్షన్ ఉంటుంది. సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఆదరణ పొందితే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. కానీ విడుదలకు ముందే సినిమా మొత్తం పైరసీ సైట్లలో కనిపిస్తే.. ఆ బాధ నిర్మాతకు మామూలుగా ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఒక నిర్మాత పరిస్థితి ఇలాగే మారిపోయింది.
వచ్చేనెల 2న ప్రేక్షకుల ముందుకు తెల్ల కాగితం అనే సినిమా రాబోతోంది. ఈ సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాల్లో దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేకంగా చూపించారు. వరద కూడా పాజిటివ్ గా స్పందించారు. వ్యాపార పరంగా కూడా ఈ మంచి బిజినెస్ ఉన్నట్లుగా ఉంది.
ఇన్ని అనుకూలమైన వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తెల్ల కాగితం అనే చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలు సోమవారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో కనిపించాయి. నార్మల్ సీన్స్ మాత్రమే కాకుండా.. ఈ స్టోరీలో కీలకమైన ఎపిసోడ్లకు సంబంధించిన విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. దీనితో ఈ సినిమాపై ఏర్పడిన పాజిటివ్ బజ్ లీక్ సన్నివేశాల వల్ల దెబ్బతిన్నది. దీంతో చిత్ర బృందం ఆందోళనలో పడింది. తెల్ల కాగితం సినిమా మొత్తం టెలిగ్రామ్ లోకి లీక్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ సినిమా మొత్తం లీక్ అయిందా.. కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేశారా.. అనే క్లారిటీ రావాల్సింది.
సంబంధిత బృందం ప్రస్తుతం లీక్ అయిన కంటెంట్.. ఇతర దృశ్యాలను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తోంది. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఇటువంటి కీలకమైన కంటెంట్ బయటికి రావడం ఒక రకంగా నిర్మాతకు ఆత్మహత్య సాదృశ్యమే. నిజానికి ఈ సినిమాలు నీకు కేవలం థియేటర్ల వరకే పరిమితం కాకపోవచ్చు.. దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఒక సినిమాకు సంబంధించిన వ్యాపారంలో ముందుగా డిజిటల్ హక్కులు.. ఓటిటిల్స్ వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ఒకవేళ సినిమా కంటెంట్ కనుక విస్తృతంగా ఆన్లైన్లోకి వెళ్లిపోతే.. ఓ టిటి సంస్థలతో కుదిరిన ఒప్పందాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. కొన్ని సమయాల్లో కంటెంట్ పైరసీ వల్ల డిజిటల్ డీల్స్ పై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే తెల్ల సినిమా విషయంలో ఎంత కంటెంట్ లీక్ అయింది అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాకి సంబంధించి లీకైన సన్నివేశాల విషయంలో సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ నడుస్తోంది. సినిమాని తీసుకురావడానికి చిత్ర బృందం హైలైట్ సన్నివేశాలను లీక్ చేసి ఒక వర్గం వాదిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు బయటికి రాలేదు. ఒక సినిమా మీద కోట్ల పెట్టుబడి పెట్టి.. చాలా రోజులు కష్టపడి పనిచేసి.. చివరికి ఆన్ లైన్ లో ఎందుకు లీక్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి రిస్క్ నిర్మాత ఎందుకు తీసుకుంటారని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.. విడుదలకు మూడు ముందే సినిమాలోని కీలక సన్నివేశాలు ఎందుకు లీక్ అయ్యాయి. దీని వెనక ఉన్నది ఎవరు.. ఇందులో ఎవరి ప్రమేయం ఎంత అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.
ఒక సినిమా విడుదలకు ముందు వ్యక్తుల వద్ద మాత్రమే ఆ కంటెంట్ ఉంటుంది. ప్రమోషనల్ స్క్రీనింగ్.. సెన్సార్ ప్రక్రియ.. డిజిటల్ కాపీలు.. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ వంటి అనేక దశల్లో కంటెంట్ వివిధ మార్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందువల్లే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఎలా బయటికి వచ్చాయో.. అనే విషయం చిత్ర బృందం దర్యాప్తులో తేలాల్సి ఉంది. లీక్ అయిన వీడియోలు.. వాటి మూలాలు గుర్తించడానికి చిత్ర బృందం చర్యలు తీసుకుంటోంది.