రకుల్ ప్రీత్ సింగ్ : సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు ప్రారంభించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొత్తం 12 ప్రాంతాల అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఐటీ అధికారులు ఒక్కసారిగా బృందాలుగా విడిపోయి 12 ప్రాంతాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు. అందువల్లే సోదాలు సినిమా ఫైనాన్సింగ్ పేరుతో నిధులను మళ్లించారని సూచిస్తుంది. ఇలా నిధులు మళ్లింపు విషయంలో కొన్ని కీలక విషయాలు దాచిపెట్టడం ఐటి […]
రకుల్ ప్రీత్ సింగ్: సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు ప్రారంభించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొత్తం 12 ప్రాంతాల అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఐటీ అధికారులు ఒక్కసారిగా బృందాలుగా విడిపోయి 12 ప్రాంతాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు.
అందువల్లే సోదాలు
సినిమా ఫైనాన్సింగ్ పేరుతో నిధులను మళ్లించారని. ఇలా నిధులు మళ్లింపు విషయంలో కొన్ని విషయాలు దాచిపెట్టడం ఐటి అధికారులకు అనుమానం కలిగించింది. దీనితో కొద్దిరోజులుగా వారు లోతుగా ఈ వ్యవహారాన్ని తవ్వుతున్నారు. దీంట్లో అనుమానాస్పద లావాదేవీలు కనిపించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. రకుల్ మామ వషూ భగ్నాని కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. రకుల్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కీలకమైన పత్రాలు.. రికార్డులను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
రకుల్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో అంతగా అవకాశాలు రావడం లేదు. దీనితో ఆమె బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన సినిమాలు కూడా అంతగా ఆడటం లేదు. అయినా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పైగా రియాల్టీ షోలలో.. టాక్ షోలలో ఆమె పాల్గొంటుంది. పైగా అప్పట్లో రకుల్ సోదరుడు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నాడని ఆరోపణలొచ్చాయి. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అయితే ప్రస్తుతం రకుల్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్..లో సరికొత్త చర్చ మొదలైంది.
రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ఆమె నటించిన సినిమాలు విజయవంతం అయ్యాయి. దీంతో టాలీవుడ్లో చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాఫ్ కావడంతో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయింది. ఇదే అనే పద్యంలో ఆమె కొన్ని వ్యాపారాలు కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా బాలీవుడ్ కు ఆమె షిఫ్ట్ అయిపోయింది. అక్కడ కొన్ని సినిమాలలో నటించింది. బలమైన పిఆర్ ద్వారా కొన్ని సినిమాల్లో అవకాశాలు పొందింది. అయితే ఆమె నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. కెరియర్ డోలాయమానంలో ఉన్న ఆమెపై ఈ స్థాయిలో విమర్శలు రావడం.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
రకుల్ ప్రీత్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో ఆమె సోదరుడి మీద రకరకాల విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని వ్యవహారాలు ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి. అయినా ఆమె వాటిని తట్టుకొని నిలబడింది. కానీ చివరికి ఇప్పుడు ఏకంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేయడం చర్చకు దారి తీసింది. మరి ఈ దాడుల్లో అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.