Home ఆంధ్రప్రదేశ్Amaravati:అమరావతిలో రోడ్ల నిర్మాణం.. సర్కారు ఆలోచనకు – RMK NEWS

Amaravati:అమరావతిలో రోడ్ల నిర్మాణం.. సర్కారు ఆలోచనకు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన జోరుగా సాగుతోంది. 2019 నుంచి 2024 వరకు ఇక్కడ ముళ్ళ పొదలు కనిపించాయి. నిర్మాణాలు పడావు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కూటమి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని భవనాలు సిద్ధమయ్యాయి. ముళ్ళ పొదలు తొలగించే పని పూర్తయింది. వాస్తవానికి ఏ ప్రాంతానికైనా సరే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి కనెక్టివిటీ […]

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన జోరుగా సాగుతోంది. 2019 నుంచి 2024 వరకు ఇక్కడ ముళ్ళ పొదలు కనిపించాయి. నిర్మాణాలు పడావు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కూటమి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని భవనాలు సిద్ధమయ్యాయి. ముళ్ళ పొదలు తొలగించే పని పూర్తయింది.

వాస్తవానికి ఏ ప్రాంతానికైనా సరే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి కనెక్టివిటీ రోడ్లు ఉండాలి. రాజధాని నగరంలో కూడా రోడ్లు అద్భుతంగా ఉండాలి. ఈ నేపథ్యంలో రోడ్లమీద కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట వేస్తోంది. నిజానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసోపేతం. సాధారణంగా ఇటువంటి ప్రముఖనుపెద్ద నగరాలలో కూడా ఏర్పాటు చేయడానికి వెనుకడుగు వేస్తారు. కానీ అమరావతిలో మాత్రం గ్రీన్ మొబిలిటీని మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నారు. కేవలం వాహనాల మార్గమే కాకుండా.. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నా మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్‌కు అతిపెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు. కారు బైక్ లేకపోయినా సురక్షితంగా ఈ రోడ్డు మీద లేదా రోడ్డు మీద ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు.

ఈ ప్రత్యేక స్మార్ట్ రోడ్లలో మూడు మీటర్ల వరకు ఫుట్‌పాట్ ఉంటుంది. మూడు మీటర్ల వరకు సైకిల్ ట్రాక్ ఉంటుంది. మూడు మీటర్ల గ్రీన్ బెల్ట్ ఏరియా కూడా ఉంటుంది. ఫుట్‌పాత్‌ను సైకిల్ ట్రాక్ అంటే కొంత ఎత్తులో లేదా ఒకే స్థాయిలో ఉంచే విధంగా రెండు రకాల డిజైన్లను పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వీటివల్ల వాహనాల మార్గం.. పాదచారుల మార్గం.. సైక్లిస్టుల మార్గం స్పష్టంగా తెలుస్తాయి. అదనంగా స్మార్ట్ వాటర్ బ్రెయిన్లపైన సైకిల్ ట్రాక్లు.. ఐ సి టి యుటిలిటీ డక్ట్ లు.. సీసర్ లైన్ ల పైన పాదాచారుల మార్గాలను ఏర్పాటు చేయబోతున్నారు. రోడ్డు.. డ్రైనేజీ.. పాదచారులు.. సైకిల్ ట్రాకులు మొత్తం ఒకే డిజైన్ లో రాబోతున్నాయి.

ఏపీ సిఆర్డిఏ ప్రణాళిక ప్రకారం అమరావతిలో సుమారు 3200 మేర పాదచారుల మార్గాలు.. సైకిల్ ట్రాక్‌లు నెట్వర్క్ డెవలప్ అవుతున్నాయి. పార్కులు.. ఓపెన్ స్పేస్‌లు.. గ్రీన్ పార్క్ ఏరియాలో.. ఈ నెట్‌వర్క్‌లో అనుసంధానం. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగే సమయంలో ట్రాఫిక్ ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అందువల్ల భవిష్యత్తు కాలంలో ట్రాఫిక్ ఒత్తిడి.. కాలుష్యాన్ని తగ్గించడానికి నడక.. సైక్లింగ్.. ప్రజా రవాణాను అనుసంధానం చేసి గ్రీన్ మొబిలిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్మార్ట్ రోడ్లలో భాగంగా అందమైన టైల్స్ ఏర్పాటు చేస్తారు.. సెక్యూరిటీ.. వెలుతురు.. వాన నీరు పారే విధానం. ట్రాఫిక్ నియంత్రణ.. వంటి అంశాలకు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అమరావతి మొత్తం ఈ స్మార్ట్ రోడ్లు విస్తరిస్తే రాజధాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

19 hours ago
Good Morning

Good Morning

22 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago