Home ఆంధ్రప్రదేశ్Botsa Satyanarayana : వైసీపీ నుంచి ‘బొత్స’ సస్పెండ్!? – RMK NEWS

Botsa Satyanarayana : వైసీపీ నుంచి ‘బొత్స’ సస్పెండ్!? – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

బొత్స సత్యనారాయణ : స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం వైసీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడటంతో జిల్లాలో రాజకీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఇప్పుడు నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేయడం ఆ చర్చకు మరింత ఊతమిచ్చింది.

అప్పలనాయుడిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే సస్పెన్షన్‌కు కొద్ది గంటల్లోనే ఆయన పార్టీకి రాజీనామా ప్రకటించారు. దీంతో విజయనగరం వైసీపీలో అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో మొదలైంది.

‘గౌరవం లేని చోట ఉండలేం’..

పార్టీకి రాజీనామా సందర్భంగా అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ.. పార్టీని ‘లిమిటెడ్ కంపెనీ’తో పోల్చారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగానే వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొందని. అదనంగా పార్టీలో క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపైనా ప్రశ్నలు సంధించారు.

అసలు టార్గెట్ ఎవరు?

అప్పలనాయుడు వ్యాఖ్యల్లో రాజకీయంగా ఆసక్తికరమైన అంశం మాత్రం బొత్స కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. మజ్జి శ్రీనివాసరావు తన బావ అవుతారని, ఆ కారణంగానే తనపై ఎలాంటి కారణం లేకుండా సస్పెన్షన్ వేటు వేశారని ఆయన చెప్పారు.

ఇక్కడే ఆయన మరో ప్రశ్నను తెరపైకి తెచ్చారు. “చిన్న శ్రీనుకు బావ బొత్స సత్యనారాయణ. మరి ఆయనను కూడా సస్పెండ్ చేయగలరా?” అంటూ వైసీపీ నాయకత్వానికి సవాల్ విసిరారు.

ఈ వ్యాఖ్యలతో ఇప్పటివరకు పార్టీ అంతర్గత వ్యవహారంగా కనిపించిన పరిణామం ఒక్కసారిగా బొత్స కుటుంబ రాజకీయ సమీకరణలపై చర్చగా మారింది. అయితే బొత్స సత్యనారాయణను పార్టీ సస్పెండ్ చేసే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలుగానే చూడాల్సి ఉంటుంది.

మజ్జి శ్రీను తర్వాత మారిన లెక్కలు

మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గంలో పార్టీ ఇన్ చార్జ్ మార్పు. అప్పలనాయుడిని బాధ్యతల నుంచి తప్పించి జడ్పీటీసీ సన్యాసి నాయుడుకు బాధ్యతలు అప్పగించారు.

ఆ తర్వాత స్థానిక సంస్థల నేపథ్యంలో వైఎస్ జగన్ జిల్లాల వారిగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడం, విజయనగరం సత్యనారాయణ రాజకీయ పరిస్థితులపై బొత్స సహా కీలక నేతలతో చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదే సమయంలో జడ్పీటీసీలు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడుతున్నారనే వార్తలు రావడం వైసీపీ జిల్లా నాయకత్వానికి కొత్త సవాలుగా మారింది.

స్థానిక పోరుకు ముందే ‘లీకేజీ’?

విజయనగరం వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ఈ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన సమయంలోనే వరుసగా రాజీనామాలు, సస్పెన్షన్లు చేయడం వల్ల పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారుతోంది.

ముఖ్యంగా బొత్స కుటుంబానికి సంబంధించిన రాజకీయాలలోనే విభేదాల సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది నిజంగా కుటుంబ రాజకీయ విభేదాల రూపం దాల్చిందా? లేక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ మాత్రమేనా? అనేది తేలాల్సి ఉంది.

‘బొత్సా వర్సెస్ అప్పలనాయుడు’గా మారుతుందా?

అప్పలనాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు విజయనగరం వైసీపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. వ్యక్తిగత రాజకీయ అసంతృప్తి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్పు, పార్టీ సస్పెన్షన్.. ఇవన్నీ కలిపి చూస్తే జిల్లాలో వైసీపీ అంతర్గత సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ అసంతృప్తిని వైసీపీ నాయకత్వం ఎలా చల్లారు? పార్టీని వీడుతున్న నేతలను ఎలా నిలబెడుతుంది? బొత్స కుటుంబం చుట్టూ మొదలైన ఈ కొత్త రాజకీయ చర్చకు పార్టీ అధిష్ఠానం ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా చూస్తే.. మజ్జి శ్రీను రాజీనామాతో మొదలైన విజయనగరం వైసీపీ అంతర్గత కలకలం.. అప్పలనాయుడు సస్పెన్షన్, రాజీనామా, వ్యాఖ్యలతో మరో దశకు చేరినట్లు సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ అంతర్గత రాజకీయాల ప్రభావం ఎంతవరకు ప్రతిబింబిస్తాయో చూడాలి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

20 hours ago
Good Morning

Good Morning

23 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago