రైజింగ్ రాయలసీమ: కటౌట్ ఉన్నవాడికి కంటెంట్ తో పనిలేదు. అలాంటి వారికి భవిష్యత్తు మీద చాలా క్లిస్టర్ క్లియర్ ఆలోచనలు ఉంటాయి. వాటిని సావధానంగా కాకుండా రాపిడ్ ఫైర్ తో అమలు చేస్తూ ఉంటారు. అటువంటి నాయకులకు భయం ఉండదు. బెదురు ఉండదు. ఇప్పుడు రాయలసీమ విషయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే దూకుడుగా కొనసాగుతున్నారు. మామూలుగా కాదు.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. మదనపల్లిలో కేంద్రమంత్రి […]
రైజింగ్ రాయలసీమ: కటౌట్ ఉన్నవాడికి కంటెంట్ తో పనిలేదు. అలాంటి వారికి భవిష్యత్తు మీద చాలా క్లిస్టర్ క్లియర్ ఆలోచనలు ఉంటాయి. వాటిని సావధానంగా కాకుండా రాపిడ్ ఫైర్ తో అమలు చేస్తూ ఉంటారు. అటువంటి నాయకులకు భయం ఉండదు. బెదురు ఉండదు. ఇప్పుడు రాయలసీమ విషయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే దూకుడుగా కొనసాగుతున్నారు. మామూలుగా కాదు.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నారు.
మదనపల్లిలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి పవన్ కళ్యాణ్.. లోకేష్ సమక్షంలో చంద్రబాబు మదనపల్లి ప్రాంతంలో ప్రపంచ ఉద్యాన కేంద్రాన్ని గుర్తించారు. దీనికి ఏకంగా లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ప్రభుత్వ రంగం నుంచి 40 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు పెడుతున్నారు. ప్రైవేట్ రంగం నుంచి 60 వేల కోట్లు సమీకరిస్తున్నారు. ఏపీ సంకల్పానికి ప్రైవేట్ కంపెనీలు కూడా భారీగా వస్తున్నాయి. ప్రారంభ పెట్టుబడిలో భాగంగా రిలయన్స్ సంస్థ మదనపల్లిలో ఆత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిద్వారా హార్టికల్చర్ పంటల సాగు.. మార్కెటింగ్ ఇతర వ్యవహారాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అమలు చేస్తుంది.
కేంద్ర ప్రారంభోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు తన విజన్ మొత్తం ఆవిష్కరించారు. మదనపల్లిలో టమాట పండుతుందని.. అయితే కేవలం టమాటకు మాత్రమే ఈ ప్రాంతాన్ని పరిమితం చేసే అవకాశం లేదు.. అవకాడో.. బ్లూ ఫీరియా.. బ్లాక్ బెర్రీ.. స్ట్రాబెరీ.. ఇంకా అనేక వినూత్నమైన పంటలను ఇక్కడ పండించడానికి రైతులకు సహాయ సహకారాలు అందజేస్తాయి. కరువు ప్రాంతంగా పేరు పొందిన రాయలసీమకు సాగునీరు అందుతుందని వివరించారు. కేవలం సాగునీరు అందించడానికి వేలకోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే హంద్రీనీవా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాలకు నీరు అందించామని.. భవిష్యత్ కాలంలో సాగునీటిని అన్ని ప్రాంతాలకు ఆధారం గా రూపొందించామని చంద్రబాబు వివరించారు.
విలువైన పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని.. ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో కూడా భారీగా ఆదాయం వస్తుందని చంద్రబాబు వివరించారు. వ్యవసాయం బాగుంటే ప్రపంచం బాగుంటుందని.. ప్రపంచం బాగుండాలి అంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాలని.. రైతును రక్షించుకుంటేనే వ్యవసాయం మనగడలో ఉంటుందని చంద్రబాబు వివరించారు. రైతుల కోసం రుణాలఫీ మా.. పెట్టుబడి సహాయం.. ఇతర కార్యక్రమాలు చేపడుతున్నామని.. వ్యవసాయం పండగ లాగా చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. ఏపీ రాష్ట్రాన్ని హార్టికల్చర్ మార్చడం గ్లోబల్ హబ్ గా మార్చడమే తమ ధ్యేయమని.. తమ ప్రభుత్వానికి ఒక లాంగ్ విజన్ ఉందని చంద్రబాబు వివరించారు. ఇది శాంపిల్ మాత్రమే.. వచ్చే రోజుల్లో ఈ ప్రాంత రూపురేఖలు మార్చడానికి శాయశక్తులా కృషి చేశానని అన్నారు. ప్రభుత్వం ఏం చేసినా సరే కూటమి భూతద్దం పెట్టి చూస్తే వైసిపి.. ప్రపంచ ఉద్యాన కేంద్రం విషయంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. దీనిని బట్టి చంద్రబాబు విజన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.