VRK Diet: వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె డైట్ పై వివాదం. ఈ వ్యవహారం ఏకంగా పోలీస్ కేసు దాక వెళ్లిపోయింది. వీరమాచినేని రామకృష్ణ డైట్ వివాదం పై రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ మొదలైంది. వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె తన డైట్ ద్వారా విశేషమైన ప్రసిద్ధి పొందారు. గుండెపోటు సమయంలో ఈయన వీడియోలు.. ఈయన చెప్పిన డైట్ సంచలనంగా మారింది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈయన డైట్ […]
VRK డైట్: వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె డైట్ పై వివాదం. ఈ వ్యవహారం ఏకంగా పోలీస్ కేసు దాక వెళ్లిపోయింది. వీరమాచినేని రామకృష్ణ డైట్ వివాదం పై రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ మొదలైంది. వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె తన డైట్ ద్వారా విశేషమైన ప్రసిద్ధి పొందారు. గుండెపోటు సమయంలో ఈయన వీడియోలు.. ఈయన చెప్పిన డైట్ సంచలనంగా మారింది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈయన డైట్ ఫాలో అయ్యేవారు. అయితే ఇప్పుడు ఈయన డైట్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
సైబరాబాద్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. 30 ఏళ్ల వయసు ఉన్న కన్నడ సాయి కృష్ణ అనే ఎల్.ఎల్.బి విద్యార్థి 2018 నుంచి టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నాడు. అతడు డయాబెటిస్ ను కంట్రోల్ ఇన్సులిన్ వాడుతున్నాడు. వి ఆర్ కే డైట్ కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను.. వీడియోలను అతడు చూశాడు. గత ఎడాది హైదరాబాదులో వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ ను అతడు సంప్రదించాడు. అక్కడ అతడికి ఇన్సులిన్ కొనసాగకుండా విఆర్కే డైట్ పాటించాలని సూచించారు. డైట్ సేవలు.. సప్లిమెంట్ల కోసం దాదాపు 26,000 అతడు చెల్లించాడు. ఆ తర్వాత అతడు ఇన్సులిన్ ఆపివేశాడు. రెండుకే తీవ్రమైన అస్వస్థతకు కారణమైంది. ఆ తర్వాత తీవ్రమైన డీహైడ్రేషన్ తో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో ఖర్చులు సుమారు 58,219 రూపాయల వరకు ఉన్నాయి.
ఎందుకు ఈ వివాదం
వి ఆర్ కే డైట్ విషయంలో అసలు సమస్య .. తక్కువ కార్బోహైడ్రేట్.. ఎక్కువగా ఉన్న డైట్.. ఇదే వివాదంగా మారింది. టైప్ 1 డయాబెటిస్ సూచనకు ఇన్సులిన్ ఆపాలని సూచించారా.. ఇలాంటి వైద్యం ఇవ్వడానికి సంబంధిత వ్యక్తులకు అవసరమైన అర్హతలు ఉన్నాయా.. డైట్ ద్వారా డయాబెటీస్.. క్యాన్సర్.. సంబంధిత వ్యాధులు నయం చేయవచ్చనే ప్రచారానికి శాస్త్ర ఆధారాలు ఏమిటి. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్‌ఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఇటీవల వీఆర్కే డైట్‌కు సంబంధించి విస్తృత ఆరోగ్య వాదనలపై కోర్టు వరకు వెళ్ళింది..
ఇక ఈ వ్యవహారం ఆధారంగా రాయదుర్గం పోలీసులు.. డాక్టర్ కోటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ కేసులో మోసం.. ప్రమాదకరమైన.. అనధికారిక వైద్య సలహాకు సంబంధించిన నిబంధనలతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్.. ఆబ్జెనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ కింద సెక్షన్లు కూడా నమోదు చేయబడ్డాయి. ఇప్పటివరకు కేసు నమోదు అయింది. ఎల్ఎల్బీ విద్యార్థి ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.. దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే అతని అనారోగ్యానికి విఆర్కే డైట్/ ఇన్సులిన్ ఆపడం నేరుగా కారణమా.. దీనికి ఎవరు సలహా ఇచ్చారు.. ఆ సలహా ఇచ్చిన వారి అర్హతలు ఏమిటి అన్నది ఒక ముఖ్యమైన విషయం. టైప్ 1 మధుమేహం లో శరీరం ఇన్సులిన్ చాలా తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అసలు ఉత్పత్తి చేయదు. అందుకే ఇన్సులిన్ చికిత్స సాధారణంగా. ఇన్సులిన్ తీవ్రంగా తగ్గిపోవడం లేదా ఆగిపోవడం తీవ్రమైన అనారోగ్య సమస్యకు దారి తీయవచ్చు.