Home తాజా వార్తలుఅల్లూరి సీతారామరాజు జిల్లా : ‘రాను ముంబయికి రాను’.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! – RMK NEWS

అల్లూరి సీతారామరాజు జిల్లా : ‘రాను ముంబయికి రాను’.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ తరుణంలో కొన్నిచోట్ల వింత పరిస్థితులు, అపశృతులు చోటుచేసుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విశాఖశాఖ సిబ్బంది సినిమా పాటలకు, జానపదాలకు డాన్సులు వేయడం సోషల్ మీడియాలో వెలుగు చూసింది. విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే భిన్న స్వరాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నెటిజన్లు తలో రకంగా కనిపిస్తున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు […]

అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ తరుణంలో కొన్నిచోట్ల వింత పరిస్థితులు, అపశృతులు చోటుచేసుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విశాఖశాఖ సిబ్బంది సినిమా పాటలకు, జానపదాలకు డాన్సులు వేయడం సోషల్ మీడియాలో వెలుగు చూసింది. విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే భిన్న స్వరాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నెటిజన్లు తలో రకంగా కనిపిస్తున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పుపడుతున్న వారు ఉన్నారు. తప్పేముందని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.

* అల్లూరి జిల్లాలో..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో తాజా అభివృద్ధి శాఖ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం.. స్వాతంత్ర విశిష్టతను తెలిపారు. అయితే తర్వాత సిబ్బంది డాన్సుల్లో మునిగిపోయారు. జాతీయ గీతాలతో పాటు దేశభక్తి గీతాలు.. ‘రాను బొంబాయి కి రాను’ అనే పాటతో సిబ్బంది డాన్సులతో హోరెత్తించారు. మహిళలతో పాటు పురుషులు జతకట్టడం కనిపించింది. అయితే ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అటు ప్రధాన మీడియాలో సైతం కథనాలు మొదలయ్యాయి. అయితే భిన్న స్పందన వస్తోంది. అందులో తప్పేముందని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటేనే సంబరాల వేడుకని గుర్తు చేస్తున్నారు. అనవసరంగా వివాదం చేయకూడదని కూడా కోరుతున్నారు.

* ఇంతకు ముందు కూడా…
అయితే గతంలో కూడా మన్యం జిల్లాలో ఇటువంటి వివాదాలు వెలుగులోకి వచ్చాయి. ఓ పాఠశాల వేడుకల్లో విద్యార్థులతో జానపదాలకు డాన్స్ చేయించినట్లు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. చాలా వివాదం అయింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకోవడం విశేషం. చాలామంది వివాదస్పదం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా సరే అధికారులు జాగ్రత్త పడడం లేదు. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయిన తర్వాత.. ఆటవిడుపుగా డాన్సులు చేశారే తప్ప.. జాతీయ గీతాలు, భక్తి గీతాలు చేయడం లేదు. ఏది ఏమైనా స్వాతంత్ర వేడుకల వేడుకల వేళ ఇటువంటివి జరుపుకునే సమయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నది ఈ ఘటన ద్వారా తెలుసుకుంటుంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

56 minutes ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

56 minutes ago
BRICS summit: కారులో పుతిన్ తో.. మోడీతో దౌత్యం అలా ఉంటుంది - RMK NEWS

BRICS summit: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఓ సినిమాలో డైలాగ్…

56 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

4 hours ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

4 hours ago