Home తాజా వార్తలుjournalism : బండ బూతులు.. దీన్ని జర్నలిజం అంటారా.. – RMK NEWS

journalism : బండ బూతులు.. దీన్ని జర్నలిజం అంటారా.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


journalism : సమాజానికి టార్చి బేరర్ లాగా పనిచేసే మీడియా ఎప్పుడు కూడా సొంత ఒత్తిడికి గురి కాకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా స్వీయ విచక్షణ మర్చిపో. కానీ నేటి కాలంలో మీడియా ఇది పట్టించుకోవడం లేదు. తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇందులో పని చేసే వారంతా యాజమాన్యం లైన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈ సీనియర్ జర్నలిస్టు మాత్రం ఒక రకమైన టెంపో కంటిన్యూ చేస్తాడు. ప్రైమ్ టైం లో […]

journalism : సమాజానికి టార్చి బేరర్ లాగా పనిచేసే మీడియా ఎప్పుడు కూడా సొంత ఒత్తిడికి గురి కాకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా స్వీయ విచక్షణ మర్చిపో. కానీ నేటి కాలంలో మీడియా ఇది పట్టించుకోవడం లేదు.

తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇందులో పని చేసే వారంతా యాజమాన్యం లైన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈ సీనియర్ జర్నలిస్టు మాత్రం ఒక రకమైన టెంపో కంటిన్యూ చేస్తాడు. ప్రైమ్ టైం లో రావడమే ఆలస్యం తను ఏదైతే అనుకుంటాడో.. అది మాత్రమే చెప్తాడు. కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ కూడా అవుతుంది. బండ బూతులు వస్తుంటాయి. అయినా ఆయన.. పైగా తనకు అలా మాట్లాడే అధికారం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు.

జర్నలిస్టులు కూడా మనుషులే. వాళ్లకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి. వాళ్లకు కూడా కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. వాటిని నియంత్రించుకొని పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ జర్నలిస్టు మాత్రం వాటిని కంట్రోల్ చేసుకోలేదు. ఒక్కసారి ప్రైమ్ టైంలో వార్తలు చెప్పడం మొదలుపెడితే మనోడి దూకుడుకు అడ్డుండదు. చెప్తానే ఉంటాడు. చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. తనకు ఇష్టమైన రాజకీయ నాయకుల ప్రస్తావన వస్తే వారిని ఆకాశమంత ఎత్తుకు ఎత్తేస్తూ ఉంటాడు. తనకు రాజకీయ నాయకుల ప్రస్తావన వస్తే తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడు. అసలు దీనిని జర్నలిజం అని ఎలా అంటారు.. అలాంటి వ్యక్తిని జర్నలిస్టు అని ఎలా చెప్తారు అని విశ్లేషకులు అంటున్నారు.

ఆయన ప్రతి సందర్భంలో ఇలా మాట్లాడటం అలవాటుగా మారిపోయింది. అందువల్లే ఆయన సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్ అవుతూ ఉంటారు. గిట్టని పార్టీ నాయకులు ఆయనను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ జర్నలిస్ట్ వీటిని పట్టించుకోడు. ముందుగానే చెప్పినట్టు తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటాడు. బూతులు గాని.. అంతకు మించిన పదాలు గాని మాట్లాడకుండా అతడు ఏమాత్రం అపరాధ భావాన్ని ప్రదర్శించాడు. అందుకే ఆయన కామెడీ పీస్ అయిపోతున్నాడు. గిట్టని పార్టీ నాయకులు ఆయన మీద వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ ఆ జర్నలిస్ట్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా బూతులు మాట్లాడటంలో.. ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో అంతకుమించి అనే స్థాయిని చూపిస్తున్నాడు.

అసలు ఇలాంటి వ్యక్తి జర్నలిస్ట్ ఎలా అవుతాడు.. అతడు సాగించేది జర్నలిజం ఎలా అవుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి ఢిల్లీ ఆందోళనలో ఓ యువతి ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగించింది. ఇంకేముంది ఆ జర్నలిస్ట్ దీని మీద ఒక ప్రైమ్ టైం బులిటెన్ జరిగింది. అందులో సగం సమయం ఆయనే తీసుకున్నారు. ఏకపక్షంగా బూతులు మాట్లాడుతూ.. ఆ అమ్మాయిని ఏమైనా చేయొచ్చని. పైగా అదే మాటను పదేపదే చెప్పారు. అసలు అలాంటి వ్యాఖ్యలు చేయడం.. పైగా వాటిని సమర్థించడం ఈయనకు మాత్రమే చెల్లింది. అయినా మేనేజ్మెంట్ కు సమ్మగా ఉన్నప్పుడు.. చూసేవాళ్ళకు మాత్రం ఏమి ఇబ్బంది..



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

21 hours ago
Good Morning

Good Morning

24 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago