Home క్రీడలుభోగి టీజర్: తెర నిండా రక్తపాతం.. కనెక్ట్ అయ్యే కథ ఏది సామి – RMK NEWS

భోగి టీజర్: తెర నిండా రక్తపాతం.. కనెక్ట్ అయ్యే కథ ఏది సామి – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


భోగి టీజర్: మన తెలుగు చిత్ర దర్శకులకు ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఒక ఫార్ములా విజయవంతం అయితే దాని వెంట పరుగులు పెడతారు. కొత్త సీసాలో పాత సారా పోసి.. ఆ కాడికి తాము ఏదో కళాఖండాలను తీసిన గొప్పలు పోతుంటారు. నిజంగా ప్రేక్షకులకు కావాల్సిందేంటి.. ఎలాంటి కథలను ఆశిస్తున్నారు.. కొత్తదనం కోరుకుంటున్నారు.. పైగా ఇవి ఓటి రోజులు కాబట్టి.. ఎలాంటి సినిమాలు అంచనా వేస్తున్నారు.. అనే విషయాలను దర్శకులు మర్చిపోతున్నారు. ప్రస్తుతం […]

భోగి టీజర్: మన తెలుగు చిత్ర దర్శకులకు ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఒక ఫార్ములా విజయవంతం అయితే దాని వెంట పరుగులు పెడతారు. కొత్త సీసాలో పాత సారా పోసి.. ఆ కాడికి తాము ఏదో కళాఖండాలను తీసిన గొప్పలు పోతుంటారు. నిజంగా ప్రేక్షకులకు కావాల్సిందేంటి.. ఎలాంటి కథలను ఆశిస్తున్నారు.. కొత్తదనం కోరుకుంటున్నారు.. పైగా ఇవి ఓటి రోజులు కాబట్టి.. ఎలాంటి సినిమాలు అంచనా వేస్తున్నారు.. అనే విషయాలను దర్శకులు మర్చిపోతున్నారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పీరియాడికల్ డ్రామా అనే జబ్బు పట్టుకుంది. దానిని ఆధారంగా కథలు రాసుకుంటున్న దర్శకులు.. తెర నిండా రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. హింస.. ఎలివేషన్లు. భాగాలతో హడావిడి చేస్తున్నారు. నిజానికి ఎలివేషన్లు.. రక్తపాతం.. హింస చుట్టూ తిరుగుతూ కథను కంచిలో వదిలేస్తున్నారు. తాజాగా విడుదలైన శర్వానంద్ భోగి ట్రైలర్ కూడా కేరాఫ్ దసరా, ది ప్యారడైజ్ మాదిరిగానే ఉంది. ట్రైలర్ కట్ నిడివి కొంచెంనే కనిపించింది.. కథలో కనీసం కొంత భాగం కూడా చెప్పలేకపోయింది. పైగా శర్వానంద్ ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో కథానాయక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాలో కీలకంగానే ఉంటుంది.. ట్రైలర్ లో మాత్రం ఆశించిన స్థాయిలో చూపించలేకపోయారు.

నేటి కాలంలో ప్రేక్షకులు ట్రైలర్.. టీజర్ నుంచి చాలా అంచనా వేస్తున్నారు. సినిమా కథలో మలుపులు.. ఉత్కంఠలు ఇందులో చూపిస్తేనే ప్రేక్షకులు స్పందిస్తున్నారు. అలా కాకుండా ఏదో రొడ్డ కొట్టుడు విధంగా ట్రైలర్ వదిలిపెడితే జనం అంతగా చూస్తే రోజులు కావు ఇవి. పైగా శర్వానంద్ ఈ సినిమాలో పూర్తిగా రఫ్ లుక్ లో కనిపించారు. నయా మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భోగి సినిమా విషయంలో ఒకటి మాత్రం క్లారిటీగా మారింది. ఈసారి శర్వానంద్ ను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం గట్టిగానే జరిగింది. కానీ మాస్ హీరో అనిపించుకోవాలని శర్వానంద్ చేసిన ప్రతిసారి కూడా ఎదురు దెబ్బ తగిలింది. అప్పట్లో రణరంగం.. ఆ తర్వాత మహా సముద్రం.. ఇలా అనేక సినిమాలు ఆయనను దెబ్బ కొట్టాయి. సంపత్ నంది దర్శకత్వంలో 1960 నాటి కథ.. మట్టి వాసనతో కూడిన ప్రపంచం.. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్టు టీజర్ లో చూపించారు.

భూ స్వామ్య వ్యవస్థ.. అణచివేత.. గ్రామీణ ప్రజల కష్టాలు.. అధికార బలం.. తిరుగుబాటు వంటి అంశాలు ఈ సినిమాలో ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కేవలం ఒక మాస్ యాక్షన్ సినిమాగా కాకుండా.. ఒక కాలాన్ని.. ఒక ప్రాంతాన్ని.. ఆ కాలంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కథలో భాగంగా చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఎక్కడో తేడా కొట్టినట్టు. ఈ సినిమాలో రంగస్థలం.. వాసనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలో కథబలంగా ఉండి.. నేపథ్యం అద్భుతంగా ఉండి.. పీరియడ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్తుంది. లేకుంటే అస్సాం వెళ్తుంది. ఇక ఇందులో శర్వానంద్ పాత్రకు కమ్మరిగంగ అని పేరు పెట్టారు. చేతిలో ఆయుధాలు.. నరకడానికి తలలు.. కాల్చడానికి బీడీలు.. కొట్టడానికి మనుషులు గట్టిగానే ఆయనకు ఇచ్చారు. శర్వానంద్ చేసిన ఈ పోరాటం విజయవంతం అయితే చాలాకాలం తర్వాత అతనికి ఉపశమనం లభిస్తుంది. లేకుంటే అంతే సంగతులు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

1 hour ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

2 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

3 hours ago