Home ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ హౌసింగ్:పేదలకు పట్టాభిషేకం: కేంద్రం – RMK NEWS

ఆంధ్రప్రదేశ్ హౌసింగ్:పేదలకు పట్టాభిషేకం: కేంద్రం – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఆంధ్రప్రదేశ్ హౌసింగ్: 3 లక్షల గృహాలు.. 7,170 కోట్లు.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం కేంద్రం.. ముఖ్యఅతిథిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ గృహ యోగానికి శ్రీకారం.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పేదలకు కేవలం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు కాకుండా.. మెరక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తున్నారు. అంతటితో ఆగడం లేదు పేదలకు […]

ఆంధ్రప్రదేశ్ హౌసింగ్: 3 లక్షల గృహాలు.. 7,170 కోట్ల ఖర్చు.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం కేంద్రం.. ముఖ్యఅతిథిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ గృహ యోగానికి శ్రీకారం..

హామీ ఇచ్చినట్టుగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పేదలకు కేవలం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు కాకుండా.. మెరక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తున్నారు. అంతటితో ఆగడం లేదు పేదలకు అద్భుతమైన గృహాలు. కేంద్రం సపోర్టు.. రాష్ట్రం వాటర్ కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికోసం 7170 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా 177 గృహాలను నిర్మించబోతున్నారు.

3d కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో మన దేశంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. బుర్రిపాలెం.. ఓబుల నాయుడుపాలెం గ్రామాలలో మొత్తం 14 కోట్ల ఖర్చుతో 177 గృహాలను నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల కాలంలో అక్షరాల 5.5 లక్షల గృహాల నిర్మాణాన్ని చేసి లబ్ధిదారులకు అందజేసింది. వచ్చే మార్చినటుకి 4.2 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తిచేసి.. లబ్ధిదారులకు కేంద్రం అడుగులు వేస్తోంది.. రాష్ట్రానికి మూడు లక్షల గృహాలను ఇచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంది. త్రీ డి టెక్నాలజీతో గృహాలను రాష్ట్రానికి కేటాయించే విషయంలో కేంద్ర సహాయ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేశారు.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రానికి 18 లక్షలకు పైగా గృహాలను అందించింది. అయితే జగనన్న కాలనీల పేరుతో గ్రామాలను నిర్మించామని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. అంతేకాదు పేదల గృహాలను పూర్తి చేయడం దారుణంగా ప్రభుత్వమే లబ్దారులకు గృహాలను నిర్మించి ఇస్తుందని డబ్బాలు కొట్టుకుంది. నాటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించిన 3.5 లక్షల గృహాల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతేకాదు వేల కోట్ల నిధులు మొత్తం దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి ఇటీవల నివేదిక ఇచ్చింది. గతంలో పొరపాట్లకు అవకాశం లేకుండా పూర్తిగా లబ్ధిదారులు కోరుకున్నట్టుగా నాణ్యమైన గృహాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గృహాలు లేని వారిని గుర్తించేందుకు ఇటీవల అవార్డు ప్లస్ పేరుతో సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వేలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల అర్హులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ దశలవారీగా గృహాలను నిర్మించి ఇవ్వబోతోంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

31 minutes ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

53 minutes ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

57 minutes ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

57 minutes ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

57 minutes ago