Home తాజా వార్తలుHargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా – RMK NEWS

Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి. అడవులు తగ్గిపోతే.. వాటి ఆధారంగా బతికే పక్షులు కూడా మనుగడ కోల్పోతాయి. చివరికి విలుప్త జాబితాలో చేరిపోతాయి. అందులో ఈ పక్షి కూడా చేరింది. కాకపోతే ఆ పక్షిని కాపాడేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. మహిళలు నడుం బిగించి ముందుకు వచ్చారు. నుండి ఆ పక్షి మనుగడ మొదలైంది. సంతతి పెరిగింది. వారు చేసిన ఆ […]

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి. అడవులు తగ్గిపోతే.. వాటి ఆధారంగా బతికే పక్షులు కూడా మనుగడ కోల్పోతాయి. చివరికి విలుప్త జాబితాలో చేరిపోతాయి. అందులో ఈ పక్షి కూడా చేరింది. కాకపోతే ఆ పక్షిని కాపాడేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. మహిళలు నడుం బిగించి ముందుకు వచ్చారు. నుండి ఆ పక్షి మనుగడ మొదలైంది. సంతతి పెరిగింది. వారు చేసిన ఆ పని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఫిదా చేసింది.

మనదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత కీలకమైన అస్సాం రాష్ట్రంలో హార్గిలా పక్షులు ఒకప్పుడు విపరీతంగా ఉండేవి. వీటి రూపం విచిత్రంగా ఉండేది. అయితే వీటిని అక్కడి ప్రజలు దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. అందువల్ల వీటిని వేటాడేవారు. ఇవి ఎదురుగా వస్తే కీడు జరుగుతుందని భయపడేవారు. ఈ పక్షులు కదంబం చెట్ల మీద ఎక్కువగా ఉండేవి. ఈ సంతతి పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రజలు కదంబం చెట్లను నరికి వేయడం ప్రారంభించారు. ఫలితంగా హర్గిలా పక్షుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. వాస్తవానికి ఈ పక్షులు పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. పైగా ఇవి పారిశుద్ధ్య కార్మికుల పాత్ర పోషిస్తూ ఉంటాయి.

చనిపోయిన జంతువుల కళేబరాల మీద ఇవి వాలిపోతూ ఉంటాయి. కళేబరాల మాంసాన్ని తింటుంటాయి. ఈ విధంగా పర్యావరణానికి మేలు చేకూర్చుతాయి. వీటి సంఖ్య తగ్గిపోవడంతో ప్రముఖ జీవ శాస్త్రవేత్త పూర్ణిమ దేవి ఒక ఉద్యమాన్ని అస్సాంలో ప్రారంభించారు.. 2007లో ఆమె దీనిని ప్రారంభించారు. హర్గిలా సంతతి పక్షులను వేటాడకుండా అస్సాం రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రచారం చేశారు. కొంతమంది మహిళలను ఎంచుకొని హర్గిలా ఆర్మీ ఏర్పాటు చేశారు. వారికి ఈ పక్షుల గొప్పతనం గురించి వివరించారు. గ్రామస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాదు కదంబం మొక్కలను విరివిగా నాటేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. కాలగర్భంలో కలిసిపోతున్న హర్గిల సంతతి పెరగడం మొదలైంది. ఇప్పుడు ఆ పక్షులు అక్కడ వేల సంఖ్యకు చేరుకున్నాయి. అంతేకాదు చనిపోయిన జంతువుల కళేబరాలు లేకుండా చేస్తున్నాయి. అస్సాం రాష్ట్రంగా తయారైంది.

పూర్ణిమ దేవి చేసిన సాహసం.. అస్సాం రాష్ట్రంలో హర్గిలా పక్షుల సంతతి పెరగడం వంటి పరిణామాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు. అస్సాంలో ఈ మహిళలు చేసిన పని దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి వారి వల్లే ప్రకృతి గొప్పగా ఉంటుందని.. పర్యావరణం సకల జంతువులతో వర్ధిల్లుతూ ఉంటుందని తెలుస్తోంది..

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

35 minutes ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

58 minutes ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

1 hour ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

1 hour ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

1 hour ago