Home తాజా వార్తలుఅమర్నాథ్ శివలింగం : పౌర్ణమికి పెరుగుతుంది.. అమావాస్యకు తగ్గుతుంది.. – RMK NEWS

అమర్నాథ్ శివలింగం : పౌర్ణమికి పెరుగుతుంది.. అమావాస్యకు తగ్గుతుంది.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

అమర్‌నాథ్ శివలింగ్ : మనదేశంలో స్వయంభు శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ శివుడిని రకరకాల పేర్లతో భక్తులు పిలుస్తారు. ఇక్కడ ఏర్పడిన శివలింగాల వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీటి స్థల పురాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రతి స్థల పురాణానికి బలమైన నేపథ్యం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి.. ఆయా క్షేత్రాలలో కైలాస వాసుడికి ఘనమైన పూజలు జరుగుతాయి. శైవ క్షేత్రాలలో శివుడు స్థిరమైన రూపంతో కలిగి ఉంటాడు. కానీ మనదేశంలో […]

అమర్‌నాథ్ శివలింగ్ : మనదేశంలో స్వయంభు శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ శివుడిని రకరకాల పేర్లతో భక్తులు పిలుస్తారు. ఇక్కడ ఏర్పడిన శివలింగాల వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీటి స్థల పురాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రతి స్థల పురాణానికి బలమైన నేపథ్యం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి.. ఆయా క్షేత్రాలలో కైలాస వాసుడికి ఘనమైన పూజలు జరుగుతాయి.

శైవ క్షేత్రాలలో శివుడు స్థిరమైన రూపంతో కలిగి ఉంటాడు. కానీ మనదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని అమర్నాథ్ ప్రాంతంలో మాత్రం శివుడి రూపం కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. వర్షాకాలం సీజన్ సంబంధిత తర్వాత అమర్నాథ్ ప్రాంతంలో శివుడి లింగం ఏర్పడుతుంది. అది కూడా అత్యంత సహజంగా ఉంటుందని.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కైలాస క్షేత్రం.. అక్కడ శివుడు ధ్యానముద్రలో ఉంటాడని.. ఆ క్షేత్రానికి వెళ్లడం సాధ్యం కాదని.. ఇప్పటికే అనేక పర్యాయాలు చాలా ప్రయత్నించినప్పటికీ కఠినమైన వాతావరణం వల్ల వెనక్కి తిరిగి వచ్చారని వార్తలు వచ్చాయి.

ఇప్పటికీ మంచు రూపంలో శివలింగం ఏర్పడే విధానం మిస్టరీగానే ఉంటుంది. జమ్ము కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ ప్రాంతంలో ఈ శివలింగం ఏర్పడుతుంది. ఇక్కడి అమర్నాథ్ గుహ సముద్రమట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏ గుహ పైకప్పు భాగం దృఢంగా ఉంటుంది. ఈ భాగంలో సున్నపురాయి.. లోపలి భాగం వంటి శిలలు ఉంటాయి. హిమాలయ ప్రాంతాలు ప్రవహించే నదులు.. కొండల ప్రాంతంలో ఉన్న మంచు కరిగిపోతున్నప్పుడు.. ఆ నీరు మొత్తం బండరాళ్ల పగుళ్ల మీదుగా గుహలోకి వెళ్తుంది. అధి కాస్త చుక్కలు చుక్కలుగా కారి.. శివుడి లింగం లాగా ఏర్పడుతుంది.

అమర్నాథ్ గుహలో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఉంటాయి.. ఇవి మైనస్ స్థాయిలలో ఉంటాయి. అక్కడ నీటి బిందువులు పడగానే.. మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రత వల్ల వెంటనే గడ్డ మాదిరిగా మారిపోతాయి.

ఇలా చుక్కలు చుక్కలుగా పడిన మంచు బిందువులు ఒకదానిపై ఒకటి వేరుకొని పోతూ ఉంటాయి. అలా పైకి లింగం మాదిరిగా ఎదుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజులపాటు జరుగుతూ ఉంటుంది. ఫలితంగా అది ఒక మంచు స్తంభంలా మారిపోతుంది. అది చూసేందుకు శివలింగంలాగా కనిపిస్తూ ఉంటుంది.

శివలింగం కాలాలకు అనుగుణంగా పెరుగుతుంది. అదే సమయంలో తగ్గిపోతూ ఉంటుంది. సరిగ్గా మే నెల నుంచి ఆగస్టు వరకు శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. పౌర్ణమి రోజుకు మరింత పెద్దదిగా మారుతుంది. అమావాస్య సమయంలో ఆ పరిమాణం తగ్గుతూ ఉంటుంది. అయితే ఆ మంచు శివలింగం పక్కనే చిన్న చిన్న రూపాలు కూడా ఏర్పడుతూనే ఉంటాయి. వాటిని పార్వతి, వినాయకుడు, భైరవుడు అని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆగస్టు నెల తర్వాత అమర్నాథ్ యాత్ర ముగిసిపోతుంది. అప్పటికి శివలింగం క్రమంగా మాయమవుతుంది. అయితే వేలాదిమంది భక్తులు ఒకేసారి గుహలోకి వచ్చినప్పుడు వారి శరీరాల నుంచి వేడి వస్తుంది. ఫలితంగా మంచు కరిగిపోతుంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

2 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

2 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

3 hours ago