Home తాజా వార్తలుహనీమూన్ కోచ్ : రైలులో ‘హనీమూన్ కోచ్’.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ – RMK NEWS

హనీమూన్ కోచ్ : రైలులో ‘హనీమూన్ కోచ్’.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ కొత్త జంటల కోసం హనీమూన్ ప్యాకేజీలు ఉంటాయి. ఈ భాగంగా హనీమూన్ వారి జీవితంలో గొప్ప జ్ఞాపకం లాగా ఉండిపోవాలని నిర్వాహకులు రకరకాలుగా ఏర్పాటు చేస్తారు. సముద్రాన్ని ఆస్వాదిస్తూ.. నీటి మీద ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన హ్యాట్స్‌లో నూతన దంపతులు ఏకాతాన్ని ఆస్వాదించే విధంగా అక్కడ వాతావరణాన్ని కల్పిస్తారు. అందువల్లే నూతన దంపతులు హనీమూన్ కోసం బాలి లేదా కేరళ వెళ్తూ ఉంటారు.

రోజురోజుకు పర్యాటకం మీద ప్రభుత్వాలు దృష్టిపెడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే పర్యాటకంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. అందులో కాలుష్యం కూడా ఉండదు. కేవలం పర్యాటకులను ఆకర్షించే విధంగా రకరకాల మార్పులను.. కొత్తకొత్త విధానాలను రూపొందించినట్లయితే సరిపోతుంది. సరిగ్గా ఇదే విధానాలను మన భారతీయ రైల్వే శాఖ అమలు చేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు రకరకాల ప్రణాళికలను తెరమీదకు తీసుకొచ్చింది. ముఖ్యంగా నూతన జంటలకు అనుకూలంగా సరికొత్త ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఈ ప్యాకేజీలు ఎలా ఉన్నాయంటే…. విదేశాలు కాదు ఇండియాలోనే ఏకాంతాన్ని గడిపే విధంగా..

తాజాగా రైల్వే శాఖ హనీమూన్ కపుల్స్ కోసం ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ ప్యాకేజీ ప్రకారం రైల్లోనే హనీమూన్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా పడక గదులను సిద్ధం చేసింది. దానిమీద లవ్ సింబల్ లో రేకులను పరిచింది. బెలూన్లు ఏర్పాటు చేసింది. ఐ లవ్ యు అనే నేపథ్యంతో దీనిని రూపొందించారు.. శుభ్రతకు.. స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్ లాగా దీనిని రూపొందించారు. హనీమూన్ కపుల్స్ ఇటువంటి వెదర్ చూడగానే వెంటనే ఇక్కడ గడిపేయాలన్నట్టుగా ఇండియన్ రైల్వే శాఖ మార్చింది. ఈ ఫోటోలు.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ప్యాకేజీలు ఇండియన్ రైల్వే శాఖ మరిన్ని అమలు చేస్తే కపుల్స్ రెచ్చిపోతారని.. విహారయాత్ర ప్రాంతాల్లో కాకుండా రైళ్లలోనే హనీమూన్ చేసుకుంటారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

17 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

17 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

17 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

17 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

17 hours ago