Home తాజా వార్తలుToddy Tree CCTV : తాటిచెట్లు ఎక్కిన సీసీ కెమెరాలు..! – RMK NEWS

Toddy Tree CCTV : తాటిచెట్లు ఎక్కిన సీసీ కెమెరాలు..! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Toddy Tree CCTV : దొంగతనానికి కాదేది అర్హం.. అని అంటుంటారు. ఏది వీలైతే దానినే దొంగతనం చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా మంది దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంటి సముదాయాల్లో.. వ్యాపార స్థలాల్లో దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు తాటి చెట్లెక్కాయి. దీనిని చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు […]

Toddy Tree CCTV : దొంగతనానికి కాదేది అర్హం.. అని అంటుంటారు. కొందరు వీలైతే దానినే దొంగతనం చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా మంది దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంటి సముదాయాల్లో.. వ్యాపార స్థలాల్లో దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు తాటి చెట్లెక్కాయి. దీనిని చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు సీసీ కెమెరాలు తాటి చెట్లు ఎందుకు ఎక్కాయి? వీటిని గీత కార్మికులు ఎందుకు ఏర్పాటు చేశారు?

తెలంగాణ రాష్ట్రంలో ఓ తాటి చెట్టుపై ఉన్న సీసీ కెమెరాల గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు అనే గ్రామంలో అన్నెపు శ్రవణ్ గౌడ్ అనే గీత కార్మికుడు తన తాటి చెట్టుకు సీసీ కెమెరాలను అమర్చాడు. సాధారణంగా తాటిచెట్టుపై కల్లు ఉంటుంది.. లేదా తాటి ముంజలు ఉంటాయి. కానీ ఈ సీసీ కెమెరాలు ఉండడమేంటి? అని అనుకుంటుండగా.. అసలు ఆ గీత కార్మికుడు వివరించాడు.

గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో కొందరు కల్లును ఎత్తుకెళ్తున్నారట. ఎంతో కష్టపడి కల్లు గీసి వెళ్తే.. మరుసటి రోజు చూస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి. ఇది కచ్చితంగా పనే అని భావించిన అతను తన చెట్టుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. దీనితో తన కల్లును ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకోవచ్చని అయన చెబుతున్నాడు. అయితే చాలా మంది ఈ సమస్యలు ఎదుర్కొన్నా.. పరిష్కారం దొరికింది. శ్రవణ్ చేసిన ఈ పనికి తోటి గీత కార్మికులు మెచ్చుకుంటున్నారు. అలాగే తాము కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు.

అయితే ఈ సీసీ కెమెరాలను సైతం సరిగ్గా అమర్చుకోవాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే కొందరు ముసుగు వేసుకొని సీసీ కెమెరాలను ద్వంసం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల వీటిని ఏర్పాటు చేయడమే కాకుండా వీటి వినియోగంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అంటున్నారు. ఏది ఏమైనా శ్రవణ్ ఏర్పాటు చేసుకొన్న ఈ సీసీ కెమెరాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

21 hours ago
Good Morning

Good Morning

24 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago