Home క్రీడలుAadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శం – RMK NEWS

Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శం – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సినిమా అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. ముఖ్యంగా అభిమాన తారలు నటించే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు గ్లోబల్ స్టాండర్డ్స్ తో నిర్మాణం అవుతున్నాయి. పైగా సినిమా నిర్మాణ సమయంలోనే అభిమానులు ఎగిరి గంతులు వేసే విధంగా మేకర్స్ అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇది మంచి పరిణామం.. కాకపోతే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి […]

ఆదర్శ కుటుంబం: మిగిలిన ప్రజల పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే విపరీతమైన పిచ్చి. ముఖ్యంగా అభిమాన తారలు నటించే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు గ్లోబల్ స్టాండర్డ్స్ తో నిర్మాణం అవుతున్నాయి. పైగా సినిమా నిర్మాణ సమయంలోనే అభిమానులు ఎగిరి గంతులు వేసే విధంగా మేకర్స్ అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

ఇది మంచి పరిణామం.. కాకపోతే ప్రేక్షకులను అందుకోవడానికి హీరోలు.. నిర్మాణ సంస్థలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇది మంచిదే అయినప్పటికీ.. విడుదల విషయంలో ప్రేక్షకుల సహనానికి మేకర్స్ పరీక్ష పెడుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద సినిమాలు విడుదల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ది ప్యారడైజ్ సినిమా విషయంలో అనేక రకాలుగా తేదీలు మారిపోయాయి. చివరికి ఇటీవల ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడేందుకు ప్రధాన కారణం రీ రికార్డింగ్.. ఇంకా కొన్ని రకాల చిత్రీకరణలు. నిజానికి ఒక సినిమా సెట్స్ మీదికి వెళ్ళినప్పుడు కచ్చితంగా విడుదల విషయంలో నిర్మాతకు ఒక అంచనా ఉంటుంది. పైగా దర్శకుడు కూడా క్లారిటీతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అదే లోపించింది. ఏదో ఒక పాయింట్ అనుకోవడం.. దాని చుట్టూ సినిమా తీయడం తెలుగు పరిశ్రమలో పరిపాటిగా మారిపోయింది. బౌండెడ్ స్క్రిప్ట్ తో సినిమాలు తీయడం నేటి కాలంలో తగ్గిపోయిందని పేరుపొందిన నిర్మాతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉదాహరణకు బాలీవుడ్ లో ఒక సినిమా సెక్స్ మీదికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంచనాతో ఉంటారు. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదల చేస్తూ ఉంటారు. పైగా మార్కెటింగ్ విషయంలో కూడా బాలీవుడ్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ ఉంటుంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో అది పూర్తిగా లోపించింది. హీరో అన్ని విభాగాల్లో వేలు పెట్టడం.. కొన్ని సందర్భాల్లో డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం.. నిర్మాతకు ఇబ్బంది పెట్టడం.. పైగా క్రియేటివ్ క్లాసెస్ పేరుతో సినిమా నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తరచుగా చోటు చేసుకుంటూనే ఉంటాయి. అంతటి చిరంజీవి నటించిన విశ్వంభ సినిమా అనేక పర్యాయాలుగా వాయిదా పడుతూ వస్తోంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమా విషయంలో కూడా వాయిదాల పర్వం మరోసారి సాగింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల 2 తేదీలను మేకర్స్ ప్రకటించారు. పైగా సోషల్ మీడియా వేదికగా ఆ ప్రకటన చేశారు. కానీ మరోసారి వాయిదా వేస్తున్నామని చెప్పి ప్రేక్షకులను ఇబ్బందుల్లోకి నెట్టారు. ఈ సినిమా విడుదల వాయిదా పడేందుకు ప్రధాన కారణం రీ రికార్డింగ్.. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయట.. అలాంటప్పుడు నిర్మాతలలో ఒకరైన నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం ఎందుకు.. అభిమానులలో ఆశలు పెంచడం ఎందుకు.. ఆ తర్వాత సినిమాను వాయిదా వేస్తున్నామని చెప్పడానికి.. ఇది కూడా అభిమానుల సహనాన్ని పరీక్షించడం కాకపోతే మరొకటి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నిజానికి సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశం గనుక ఉండి ఉంటే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎందుకు చేపడతారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు..



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

19 hours ago
Good Morning

Good Morning

22 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago