Home UncategorizedNandyal Missing Girl: తుని చిన్నారి తరహాలోనే ఏపీలో మరో బాలిక మిస్సింగ్.. చివరికి ట్విస్ట్ –

Nandyal Missing Girl: తుని చిన్నారి తరహాలోనే ఏపీలో మరో బాలిక మిస్సింగ్.. చివరికి ట్విస్ట్ –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

నంద్యాల మిస్సింగ్ గర్ల్: కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంతవరకు వీడలేదు. చిన్నారి ఆచూకీ ఇంతవరకు దొరికింది. ఇలాంటి నేపథ్యంలో నంద్యాల జిల్లాలో జరిగిన ఓ పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు తీయించింది. నంద్యాల శివారు ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు వందల మంది పోలీసులు. మొత్తం జల్లెడ పట్టేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో […]

నంద్యాల మిస్సింగ్ గర్ల్: కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంతవరకు వీడలేదు. చిన్నారి ఆచూకీ ఇంతవరకు దొరికింది. ఇలాంటి నేపథ్యంలో నంద్యాల జిల్లాలో జరిగిన ఓ పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు తీయించింది. నంద్యాల శివారు ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు వందల మంది పోలీసులు. మొత్తం జల్లెడ పట్టేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి బయటకు వెళ్లినట్లు పోలీసులు ఆ దిశగా.. వెతుకులాట ప్రారంభించిన తర్వాత అసలు విషయం తెలిసింది.

* డయల్ 100కు ఫిర్యాదు..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారి బయటకు వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత తల్లి కుమార్తె కనిపించిన తర్వాత గుర్తించింది. అన్ని చోట్ల వెతికింది. జాడ తెలియక పోవడంతో ఆదివారం రాత్రి 9 గంటలకు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. తుని ఘటన నంద్యాల ఎస్పీ సునీల్ సోరాన్ అప్రమత్తం అయ్యారు. పాప ఆచూకీ కోసం రాత్రంతా 200 మంది పోలీసులు గాలించారు. డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాల సాయంతో గాలింపు చర్యలు. ఈ చిన్నారి వీధిలో తిరుగుతున్న సిసి ఫుటేజీ కనిపించింది. అయినా సరే జాడ తెలియలేదు.

* జొన్న చేనులో నిద్రపోతూ..
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు పోలీసులు జల్లెడ పట్టారు. అయితే ఇంటి సమీపంలోని ఓ జొన్న చేనులో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. జొన్న చేనులో చిన్నారి నిద్రపోతూ కనిపించడంతో.. పోలీస్ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాపను తల్లి చెంతకు చేర్చాయి. ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పాపను పోలీసులు గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుని చిన్నారి జ్ఞానేశ్వరి కి సంబంధించి నెలలు గడుస్తున్న ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో నంద్యాల ఘటన జరగడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా షాక్ కు గురైంది. చిన్నారి ఆచూకీ వెనువెంటనే దొరకడంతో ఉపశమనం పొందింది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

2 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

2 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

3 hours ago