Home ఆంధ్రప్రదేశ్Vijayawada Dasara: మైసూరు దసరాను విజయవాడ ఢీకొట్టగలదా – RMK NEWS

Vijayawada Dasara: మైసూరు దసరాను విజయవాడ ఢీకొట్టగలదా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Vijayawada Dasara: దసరా అంటే మైసూర్ పేరు రావడం అత్యంత సహజం. రాజవంశ సంప్రదాయం ప్రకారం మైసూర్ ప్యాలెస్ లో విద్యుత్ దీపాలను అందంగా అలంకరిస్తారు. జంబు సవారి నిర్వహించారు. ఏనుగుల ఊరేగింపు జరుపుతారు. ఇలా దశాబ్దాలుగా మైసూర్ ప్రాంతంలో దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు విజయవాడని కూడా దసరా టూరిజం డెస్టినేషన్ గా నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 11 నుంచి 20 […]

విజయవాడ దసరా: దసరా అంటే మైసూర్ పేరు గుర్తుకు రావడం అత్యంత సహజం. రాజవంశ సంప్రదాయం ప్రకారం మైసూర్ ప్యాలెస్ లో విద్యుత్ దీపాలను అందంగా అలంకరిస్తారు. జంబు సవారి నిర్వహించారు. ఏనుగుల ఊరేగింపు జరుపుతారు. ఇలా దశాబ్దాలుగా మైసూర్ ప్రాంతంలో దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు విజయవాడని కూడా దసరా టూరిజం డెస్టినేషన్ గా నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ 2026 నిర్వహించబోతున్నారు. పున్నమి ఘాట్ కేంద్రంగా 10 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు.. జానపద కళలు.. సంగీతం.. ఫుడ్ ఫెస్టివల్.. దాండియా.. మెగా కార్నివాల్.. ఎగ్జిబిషన్లు.. వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా వేడుకల మీద ప్రముఖంగా దృష్టి సారించారు. ఒకే నగరం ఒక వేడుక కాన్సెప్ట్ తో విజయవాడను సాంస్కృతిక టూరిజం నగర బ్రాండ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

కనకదుర్గమ్మ దర్శనం.. విజయవాడ ఉత్సవ్.. నేషనల్ సరస్ మేళా.. ఇలా ఈ మూడింటిని కలిపి ఒకే టూరిజం ప్యాకేజ్ లాగా మార్చి.. బయటి రాష్ట్రాల పర్యటకులను ఆకట్టుకునేలా ఉంది. పున్నమి ఘాట్ లో అక్టోబర్ 8 నుంచి 23 వరకు నేషనల్ సరస్ మేళా నిర్వహించబోతున్నారు.. మైసూర్ నుంచి ఏనుగులను విజయవాడకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక రకంగా ఇది మైసూరు దసరా వాతావరణాన్ని గుర్తుచేసే అంశం. ఇప్పుడంటే ఇప్పుడు కాకపోయినా.. విజయవాడ మైసూర్ ను అధిగమించే అవకాశం ఉంది. మైసూర్ 1610 సంవత్సరం నుంచి దసరా ఉత్సవాల చారిత్రక సంప్రదాయం ఉంది. అయితే విజయవాడకు కనకదుర్గమ్మ ఆలయం.. కృష్ణానది.. ఆధ్యాత్మికత.. తెలుగు సంస్కృతి అదనపు ఆకర్షణగా ఉంది.

దసరా ఉత్సవాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హాజరవుతున్నారు.. దసరా ఉత్సవాల ద్వారా విజయవాడ బ్రాండ్‌కు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రదర్శనపరంగా ఏపీకి సరికొత్త గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

టూరిజం ద్వారా ఆదాయం భారీగా వస్తూ ఉంటుంది. కేరళ నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకు టూరిజం ద్వారా భారీగా ఆదాయాన్ని అక్కడ ప్రభుత్వాలు ఆర్జిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పర్యాటకపరంగా అనేక అనుకూలతలు ఉన్నాయి. అందువల్లే కూటమి ప్రభుత్వం పర్యాటకపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గుర్తింపు తీసుకురావడానికి.. మరింత ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. తద్వారా టూరిజం ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

2 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

2 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

3 hours ago