Home తాజా వార్తలుMadhavi Latha : మద్యం ఆడాళ్లు ఎందుకు తాగొద్దు.. – RMK NEWS

Madhavi Latha : మద్యం ఆడాళ్లు ఎందుకు తాగొద్దు.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Madhavi Latha : మగాళ్లు మందు తాగితే ఈ సమాజం పెద్దగా పట్టించుకోదు. ఆడవాళ్ళు తాగితే వింతగా చూస్తుంది. ఘోరం అన్నట్టుగా ముద్ర వేస్తుంది. ఆమెను చెడుగా చూస్తుంది. ఇంటి పని విషయంలో ఆడవాళ్లు చేస్తే ఈ సమాజం ఒక విధంగా చూస్తుంది. అదే మగవాళ్ళు చేస్తే ప్రపంచానికి ఏదో అరిష్టం పట్టినట్టు.. అదేదో ఘోరం జరిగిపోయినట్టు చూస్తుంది.. ఇంటి పని ఆడవాళ్లకు మాత్రమే సొంతమా.. మగవాళ్ళు చేయకూడదా.. మగవాళ్ళు చేస్తే ఏమైనా కిరీటాలు రాలిపోతాయా.. ఇదిగో […]

Madhavi Latha : మగాళ్లు మందు తాగితే ఈ సమాజం పెద్దగా పట్టించుకోదు. ఆడవాళ్ళు తాగితే వింతగా చూస్తుంది. ఘోరం అన్నట్టుగా ముద్ర వేస్తుంది. ఆమెను చెడుగా చూస్తుంది. ఇంటి పని విషయంలో ఆడవాళ్లు చేస్తే ఈ సమాజం ఒక విధంగా చూస్తుంది. అదే మగవాళ్ళు చేస్తే ప్రపంచానికి ఏదో అరిష్టం పట్టినట్టు.. అదేదో ఘోరం జరిగిపోయినట్టు చూస్తుంది.. ఇంటి పని ఆడవాళ్లకు మాత్రమే సొంతమా.. మగవాళ్ళు చేయకూడదా.. మగవాళ్ళు చేస్తే ఏమైనా కిరీటాలు రాలిపోతాయా.. ఇదిగో ఇలా ప్రశ్నించింది. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా అవుతోంది.

ఇంతలా ప్రశ్నించిన ఆమె పేరు మాధవి లత. గతంలో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాయకురాలుగా కొనసాగుతోంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా పోస్టులు పెడుతూ.. ఏదో ఒక విధంగా వీడియో చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది మాధవి లత. స్త్రీవాదం గురించి మాధవి లత గొప్పగా చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో కట్టు తప్పుతుంటారు. అయినప్పటికీ ఆమెను కొందరు సమర్థిస్తారు. మరికొంతమంది విమర్శిస్తారు. ఎవరు ఎలా ఉన్నా సరే మాధవి లత మాత్రం తన ధోరణి మార్చుకోరు. అందుకే ఆమె బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఎదిగారు.. తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెబుతూనే ఉంటారు.

మాధవి లత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ముఖ్యంగా మద్యం తాగే విషయంలో మగవాళ్ళను ఒక విధంగా.. ఆడవాళ్లను మరొక విధంగా ఈ సమాజం చూస్తుందని.. అది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇంటి పని విషయంలో కూడా మగవాళ్ళు చేస్తే ఒక విధంగా.. ఆడవాళ్లు చేస్తే మరొక విధంగా ఈ సమాజం చూస్తుందని.. అది సరైనది కాదు అంటూ ఆమె పేర్కొంది. సోషల్ మీడియాలో ఆమె ఈ పోస్ట్ చేసిన తర్వాత చర్చ మొదలైంది. కొంతమంది ఆమెకు అనుకూలంగా.. మరి కొందరు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరు ఎలా అనుకున్న సరే మాధవి లత తన అభిప్రాయాన్ని మాత్రం చెబుతూనే ఉంటారు. ఏ మాత్రం వెనకడుగు వేయరు.

బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్లలో మాధవి లత ఒకరుగా ఉన్నారు. గతంలో ఆమె కొన్ని సినిమాలలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆడవాళ్ళ విషయంలో మొహమాటం లేకుండా తన స్వరాన్ని వినిపిస్తున్నారు. ఒకవేళ ఆడవాళ్లు తప్పులు చేస్తే ఎటువంటి వెనుకంజ వేయకుండా గట్టిగా మాట్లాడుతున్నారు. తాజాగా మద్యం తాగే విషయంలో సరికొత్త తెరపైకి తెచ్చి.. చర్చ మొదలైంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

21 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago