Home అంతర్ జాతీయDonald Trump : అమెరికన్ డాలర్ పై ట్రంప్.. పీక్స్ కు వెళ్లిన పబ్లిసిటీ పిచ్చి.. -RMK NEWS

Donald Trump : అమెరికన్ డాలర్ పై ట్రంప్.. పీక్స్ కు వెళ్లిన పబ్లిసిటీ పిచ్చి.. -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

డోనాల్డ్ ట్రంప్ : ఈ ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రచారాన్ని కోరుకుంటారు. కాకపోతే ఆ ప్రచారం జనాలు ఆమోదించే స్థాయిలో ఉండాలి. అది మరింత పెరిగిపోతే జనాలు ఆ రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్నారు. వాస్తవానికి ట్రంప్ ట్రోల్ అవడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ.. ఈసారి ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం […]

డోనాల్డ్ ట్రంప్ : ఈ ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రచారాన్ని కోరుకుంటారు. కాకపోతే ఆ ప్రచారం జనాలు ఆమోదించే స్థాయిలో ఉండాలి. అది మరింత పెరిగిపోతే జనాలు ఆ రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తూ ఉంటారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్నారు. వాస్తవానికి ట్రంప్ ట్రోల్ అవడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ.. ఈసారి ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం.

అమెరికాలో అక్కడి నాణేలు ముద్రించే టంక శాల 250 వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖం కల్పించే విధంగా ఒక డాలర్ కాయిన్ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు యూఎస్ మింట్ కాంపౌండ్ ప్రకటించింది. కాయిన్ మీద ఒకవైపు ట్రంప్ ముక్క చిత్రం.. లిబర్టీ.. 1776 అని ప్రింట్ చేశారు. ఇంకొక వైపు అమెరికా సంయుక్త అధికారిక రాష్ట్రముద్రం ఉండే విధంగా చిత్రాన్ని రూపొందించారు. దీనికి అమెరికా కమీషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తన ఆమోదాన్ని నివేదిస్తుంది.

ఈ నాణేల తయారీకి సంబంధించి కమీషన్ సభ్యులను ట్రంప్ స్వయంగా నియమించడం విశేషం. అయితే తన ముఖచిత్రాన్ని నానెం మీద ముద్రించాలి అనే కోరిక రావడం చాలా అసాధారణమైనదని.. ట్రంప్ ఆ మధ్య వ్యాఖ్యానించడం విశేషం. అమెరికన్ చట్టాల ప్రకారం అధ్యక్షుడు జీవించి ఉండగానే అమెరికన్ కరెన్సీ మీద ముద్రించడం నిషేధం. ఆదేశాలు జారీ చేయడానికి అక్కడి ట్రెజరీ సెక్రటరీకి అధికారం ఉంటుంది. 20 కాయిన్స్ ఉన్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. అలాగే 100 కైన్స్ ఉన్న ఒక బ్యాగ్ ధర 154.50 డాలర్లుగా ప్రచురితమైంది.

ట్రంప్ ముఖ కాయిన్స్ మీద ముద్రించడాన్ని అక్కడి విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కు ప్రచార పిచ్చి పీక్స్ లోకి వెళ్లిందని కామెంట్స్ చేస్తున్నారు. అధ్యక్షుడు బతికి ఉండగానే ఇలాంటి పిచ్చి చేష్టలకు ట్రంప్ లో ఉన్న మరో కోణానికి నిదర్శనమని అక్కడికి విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చర్యను ట్రంప్ సమర్థించడం విశేషం. గ్లోబల్ మీడియా మాత్రం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తున్నది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

3 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

3 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

3 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

3 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

3 hours ago