Home జాతీయVande Bharat Sleeper : పట్టాలపై నడిచే ఫైవ్ స్టార్ హోటల్.. – RMK NEWS

Vande Bharat Sleeper : పట్టాలపై నడిచే ఫైవ్ స్టార్ హోటల్.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

వందే భారత్ స్లీపర్ : మనదేశంలో అత్యంత చవకైన రవాణా వ్యవస్థగా రైల్వే శాఖకు పేరు ఉంది. ఆంగ్లేయుల కాలం నుంచి మనదేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటు అయింది. అప్పటినుంచి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ప్రతి ఏడాది ప్రయాణికులు పెరుగుతూ ఉండటం.. ప్రయాణికులు ప్రీమియం సౌకర్యాలు కోరుకుంటున్న నేపథ్యంలో.. రైల్వే శాఖ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది.

మొన్నటిదాకా వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్ లు ఉండేవి కాదు. ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు పెరిగిపోవడంతో రైల్వే శాఖ భారీగా వెచ్చించింది.. సుదూర రాత్రి ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త వెర్షన్‌లో ప్రయాణికులకు అత్యద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఒక రకంగా స్లీపర్ కోచ్ లను పట్టాల మీద నడిచే ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పవచ్చు.

వందే భారత్ స్లీపర్ కోచ్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. అందులో ఉన్న సౌకర్యాలు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక లగ్జరీ హోటల్ లాగా ఉందని.. అద్భుతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు . ఆ వీడియోలో ఉన్న దృశ్యాలను చూస్తుంటే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ క్యాబిన్ ఉంది. అందులో లైటింగ్.. ప్రీమియం ఫినిషింగ్.. విశాలవంతమైన స్థలం అద్భుతంగా ఉంది.

ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో చైర్ కార్ ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా స్లీపర్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులకు ఈ కోచ్ అత్యంత సుఖవంతమైన నిద్ర వసతి అందిస్తుంది. అంతేకాదు ఫస్ట్ ఏసీ కోచ్ లలో విశాలవంతమైన ప్రదర్శన ఏర్పాటు చేశారు. క్యాబిన్ క్రమబద్ధంగా.. వాస్తవం ఉంది.

అదిరిపోయే స్థాయిలో సౌకర్యాలు

ఇందులో విలాసవంతమైన క్యాబిన్ సీట్లు. రాత్రి ప్రయాణం కోసం విలాసవంతమైన నిద్రపోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి.

దుర్వాసనతో కూడిన టాయిలెట్లు కాకుండా.. హోటల్ తరహాలోనే టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇవి బయో విధానంలో పనిచేస్తూ ఉంటాయి.

ప్రయాణికుల కోసం అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ప్రయాణానికి సంబంధించిన ప్రదర్శించడానికి అత్యంత ఆధునిక డిస్ప్లే స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది వందే భారత్ స్లీపర్ సర్వీస్ జనవరి నెలలో హౌరా నుంచి కామాఖ్య మధ్య మొదలైంది. ప్రస్తుతం ఇందులో 16 కోచ్ లు ఉన్నాయి. వాటిలో 11 ఏసి త్రీ టైర్.. 4 ఏసి టూ టైర్.. ఒకటి ఏసీ ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. 823 మంది సరిపోయే సామర్థ్యం ఈ రైలు సొంతం. అయితే భవిష్యత్తు కాలంలో కోచ్ ల సంఖ్యను 24కు పెంచే అవకాశం ఉంది. ఈ రైలు గంటకు 160 నుండి 108 వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి కవచ్ అనే పేరుతో యాంటీ కొలిజెంట్ టెక్నాలజీ వాడారు. ఇందులో ఆటోమెటిక్ డోర్లు.. బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు.. సెన్సార్ ట్యాప్ లు.. రీడింగ్ లైట్లు.. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్.. ఫస్ట్ ఏసీలో అయితే హాట్ వాటర్ షవర్ సౌకర్యం కూడా ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు - RMK NEWS

ఏపీ రాజకీయాలు: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల…

21 hours ago
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

24 hours ago
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

24 hours ago
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

1 day ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

1 day ago