Home ఆంధ్రప్రదేశ్AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా – RMK NEWS

AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం.. మరోవైపు అదే రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేసిన పిటిషన్లు.. తాజాగా హైకోర్టు తీర్పు.. ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కిన ప్రభుత్వం.. ఇది న్యాయపరమైన వివాదమేనా? లేక స్థానిక ఎన్నికల వెనుక పెద్ద రాజకీయ వ్యూహం నడుస్తోందా?

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

ఆగస్టు 20, 2026న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన GOMs.No.105 ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 1న ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 34 స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరగా గరిష్ఠంగా ఆరు వారాల్లో ప్రారంభించాలని సూచించింది.

ఇక్కడే రాజకీయ అసలు కథ మొదలవుతోంది!

వైసీపీ 34 శాతం బీసీ కోటా నిబంధనలను దాటుతుందని ముందే హెచ్చరించామని చెబుతున్నాయి. వైసీపీ అధికారిక వాదన ప్రకారం.. ప్రభుత్వ నిర్వహణ సమస్యలు వస్తాయని 34 శాతం కోట్లు ప్రకటించిన తర్వాత కోర్టు అడ్డంకిని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో 34 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చామని చెబుతోంది.

అయితే జగన్‌పై వస్తున్న ఆరోపణల సంగతేంటి?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారు, అందుకే బీసీ రిజర్వేషన్ల న్యాయపరమైన వివాదంగా మార్చి ఎన్నికలను ఆలస్యంగా నిర్వహిస్తున్నారని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ లెక్క..

పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామస్థాయిలో అధికార పార్టీ, ప్రతిపక్షాల బలాబలాలు స్పష్టంగా బయటపడతాయి. ఎవరి క్యాడర్ బలంగా ఉంది? ఎవరి నాయకత్వానికి గ్రామాల్లో ఆదరణ ఉందా? ఏ సామాజిక వర్గం ఎటువైపు నిలుస్తోంది? అన్నది ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. అందుకే స్థానిక ఎన్నికలే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు రాజకీయ పరీక్షగా మారాయి.

నిధుల అంశం కూడా ఎందుకు కీలకం?

స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వివిధ గ్రాంట్లు, ఆర్థిక సంఘాల నిధులు, అభివృద్ధి నిధులు అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకారం 2021-26 కాలానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.10,231 కోట్ల కేటాయింపు ఉండగా రూ.10,055.82 కోట్లు విడుదలయ్యాయి. అయితే రూ.12,000 కోట్ల “పే కమీషన్ నిధులు” ఎన్నికలను ఆపడానికి జగన్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఎన్నికలు అడ్డుకునే ప్రక్రియ అనే వాదన వినిపిస్తోంది.

ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే!

బీసీ రిజర్వేషన్లను వైసీపీ ఎందుకు అడ్డుకుంటోంది.? ప్రభుత్వం తీసుకొచ్చిన 34 శాతం కోటా చట్టపరమైన పరీక్షను ఎందుకు మోకాలడ్డుతోంది.? టీడీపీకి ఎన్నికల్లో ప్రయోజనం దక్కకుండా చేసేందుకే ఈ కుట్ర చేస్తోంది.? ఎన్నికలు ఆలస్యం అయితే రాజకీయంగా వైసీపీకి లాభమా? గ్రామీణ స్థాయిలో బలాబలాలు బయటపడకుండా ఎన్నికల ప్రక్రియను సాగదీయడం వైసీపీ వ్యూహమా? ఈ రోజుల్లో ప్రశ్నలకు సమాధానాలు రాబోయే కోర్టు తీర్పులతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఇవ్వనున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 9న ఈ అంశంపై తదుపరి విచారణ జరగనుంది. కాబట్టి.. ఇది కేవలం 34 శాతం బీసీ రిజర్వేషన్ వివాదం కాదు. ఇది గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న మరో పెద్ద పోరాటం.

ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? బీసీలకు చివరకు ఎంత రిజర్వేషన్ దక్కుతుంది? కోర్టు నిర్ణయం ఎటువైపు ఉంటుంది? మరి ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా లాభపడేది ఎవరు? సమాధానం కోసం రాబోయే పరిణామాలను గమనించాల్సిందే!

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

20 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

20 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

20 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

20 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

20 hours ago