చంద్రబాబు నాయుడు: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తిరుమల పేరుగాంచింది. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తుల కోసం వసతి.. రవాణా.. ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా అడుగేసింది. ప్రాథమిక వసతుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతోంది. తిరుపతి నగర అభివృద్ధితో పాటు.. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల లేఔట్లో సౌకర్యాల కల్పనకు రంగం సిద్ధం చేసింది. కీలక విస్తరణకు కలిపి మొత్తం 3200 కోట్లతో పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తిరుపతిలో భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపడతాయి. నగరంలో రవాణా వ్యవస్థకు ఊరట లభించే అవకాశం ఉంది.
భక్తుల కోసం 2,750 కోట్లతో..
తిరుమల కొనిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. రోజుకు 80 వేల నుంచి 90 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పార్కింగ్.. రవాణా సౌకర్యాల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ కోరికనే అలిపిరి సమీపంలో ఉన్న ఎస్వీ జూ పార్క్ వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో 2,750 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రీం టౌన్షిప్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒకేసారి 26,000 మంది భక్తులకు వసతి కల్పించబోతున్నారు. ఇందులో జి ప్లస్ నైన్ అంతస్తులతో నాలుగు బ్లాకులు నిర్మించారు. పదివేల మందికి వసతి కల్పిస్తారు. జిప్లస్ ఫోర్ అంతస్థలంతో మరో నాలుగు పిలిగ్రీమ్ ఎనిమిటి కాంప్లెక్స్లను నిర్మించి.. 16,000 మందికి వసతి కల్పిస్తారు.
సొంత వాహనాల్లో వచ్చే వారికి
సొంత వాహనాల్లో తిరుపతికి వచ్చే వారికి జిప్లస్ ఫైవ్ అంతస్తులో మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఏకంగా 4500 వాహనాలు నిలిపే అవకాశం ఉంటుంది. భక్తులకు అన్న ప్రసాదం జిప్లస్ త్రీ అంతస్తులలో సెంట్రలైజ్డ్ వంటశాలను నిర్మించబోతున్నారు. ఒకేసారి 6000 మందికి భోజనం అందజేస్తున్నారు. తిరుపతి వెళ్లే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి జిప్లస్ 2 విధానంలో 30 బస్సు బేలను ఏర్పాటు చేయబోతున్నారు. శ్రీవారి వైభవం.. తిరుమల ఆధ్యాత్మిక ప్రాశస్యాన్ని తెలియజేయడానికి డిజిటల్ మ్యూజియం.. థియేటర్.. గ్యాలరీలను ఇందులో ఏర్పాటు చేయబోతున్నారు.
టిటిడి ఉద్యోగుల కోసం
టీటీడీలో పనిచేసే ఉద్యోగుల కోసం కేటాయించిన స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తిరుపతి వడమాల పేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద 432 ఎకరాల పరిధిలో 5,192 మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే ఆస్థానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. డ్రైనేజీ.. తాగునీరు వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 230 కోట్లతో లేఅవుట్లో మౌలిక వసతులు చేపట్టబోతున్నారు. ఇందులో బీటీ రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ.. వర్షపు నీటి కాల్వలు.. తదుపరి పైప్ లైన్లు.. భూగర్భ మురుగునీటి వ్యవస్థ.. విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ పనులు పూర్తయితే స్థలాలు పొందిన ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
250 కోట్లతో మాస్టర్ ప్లాన్
తిరుపతి నగరంలో వాహనాలు పెరుగుతున్నాయి.. విస్తరణ పై కూడా దృష్టి పెట్టారు. తిరుచానూరు ఆలయానికి మార్గాలతో పాటు వెళ్లేందుకు కీలక ప్రణాళికను అభివృద్ధి చేసేందుకు తుడా ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు 250 కోట్ల ఖర్చుతో చేపట్టబోతున్న మాస్టర్ ప్లాన్ పనులు నగరంలో రాకపోకలను మరింత మెరుగుపర్చడానికి ఉపయోగపడతాయి. తిరుపతిలో వాహనాల సంఖ్య పెరుగుతున్న సూచికను పెంచడం.. కీలక మార్గాలలో ట్రాఫిక్ ఒత్తిడిని పూర్తిగా తగ్గించడం.. ఆలయానికి భక్తులు త్వరగా చేరుకోవడానికి మార్గాన్ని సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా.
అభివృద్ధికి కొత్త దిశ
భక్తుల వసతి కోసం 2750 కోట్ల టౌన్షిప్.. టిటిడి ఉద్యోగుల లేఅవుట్ కోసం 230 కోట్ల మౌలిక వసతుల పనులు.. మాస్టర్ ప్లాన్కు 250 కోట్లు.. ఇలా మూడు కార్యక్రమాలు తిరుపతి అభివృద్ధికి దోహదం చేయబోతున్నాయి.