Home ఆంధ్రప్రదేశ్AP DSC 2026: నారా లోకేష్ 2,721..ఇంకోసారి దగా డీఎస్సీ – RMK NEWS

AP DSC 2026: నారా లోకేష్ 2,721..ఇంకోసారి దగా డీఎస్సీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారిపోయాయి. డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో.. మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు.. నియామక ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలు మరొకవైపు.. ఇలా ఏపీలో డీఎస్సీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విద్యాశాఖ నారా లోకేష్ పాత్ర.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. వైసిపి వ్యక్తం చేస్తున్నారు […]

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారిపోయాయి. డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో.. మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు.. నియామక ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలు మరొకవైపు.. ఇలా ఏపీలో డీఎస్సీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విద్యాశాఖ నారా లోకేష్ పాత్ర.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. వైసిపి చేస్తున్న అభ్యంతరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి.

2721 పోస్టులు

ఏపీ రాజకీయాలలో డీఎస్సీ వ్యవహారం మరోసారి చర్చకు దారితీస్తోంది. గత మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏకంగా దానికి దగా డీఎస్సీ అని పేరు పెట్టింది. కానీ ప్రభుత్వం ఈ విమర్శలను ఏమాత్రం లెక్క చేయలేదు. మరో డీఎస్సీ ప్రకటనతో ముందుకు వచ్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ 2026 షాట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ మూడులోగా విడుదల పూర్తి స్థాయి నోటిఫికేషన్.

గతంలో నిర్వహించిన డీఎస్సీలో అక్రమాల జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది. ప్రశ్న పత్రం లీకేజీ.. స్పోర్ట్స్ కూడా నియామకాలు.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం అనే అంశాలు లేవనెత్తింది ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని. మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇన్ని రకాలుగా ఆరోపణలు చేసినప్పటికీ వాటికి ఆధారాలు చూపించడంలో వైసిపి విఫలమైంది మరలా నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించామని.. వైసిపి ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని కొనసాగించాలని లోకేష్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన అభ్యంతరాలు వాస్తవ దూరమని లోకేష్ కొట్టిపారేశారు.

ఇప్పుడు 2721 పోస్టులతో కొత్త డీఎస్సీ ప్రకటన రావడంతో రాజకీయంగా చర్చ మరో మలుపు తిరిగింది. గత నియామకాలపై వైసీపీ విమర్శలు చేస్తుంటే.. కొత్త ఉద్యోగాల భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేయడం సహజం. కానీ డీఎస్సీ కోసం ఏలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం ఉద్యోగాల భర్తీ.. నియామకాలలో పారదర్శకత.. న్యాయమైన ఎంపిక ప్రధానం. 2721 పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో రాజకీయపరమైన ఆందోళనలు చేసి.. కోర్టుకు.. ఇలాంటి నియామక ప్రక్రియను అడ్డుకుంటే మాత్రం.. నిరుద్యోగుల నుంచి వైసిపి వెళ్లి మరోసారి నిరసన ప్రదర్శన తప్పదు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

1 day ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

1 day ago