Home ఆంధ్రప్రదేశ్Rayalaseema Rising: రైతు పొలం నుంచి విదేశీ మార్కెట్ వరకు.. – RMK NEWS

Rayalaseema Rising: రైతు పొలం నుంచి విదేశీ మార్కెట్ వరకు.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Rayalaseema Rising: రాయలసీమ అంటే కరువు కాటకాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కక్షలు కొట్లాటలు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తాయి. నిజానికి రాయలసీమకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. విస్తారంగా భూములున్నాయి. సాగునీటి వనరులున్నాయి. కానీ, వీటిని ఇప్పటివరకు వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడి ప్రజల ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగపడే వ్యక్తులుగానే చూశారు. అయితే ఇప్పుడు దీనికి చరమగీతం పాడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తన ముందు చూపుతో.. తన దీర్ఘ దృష్టితో […]

రాయలసీమ ఎదుగుదల: రాయలసీమ అంటే కరువు కాటకాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కక్షలు కొట్లాటలు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తాయి. నిజానికి రాయలసీమకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. విస్తారంగా భూములున్నాయి. సాగునీటి వనరులున్నాయి. కానీ, వీటిని ఇప్పటివరకు వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడి ప్రజల ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగపడే వ్యక్తులుగానే చూశారు. అయితే ఇప్పుడు దీనికి చరమగీతం పాడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తన ముందు చూపుతో.. తన దీర్ఘ దృష్టితో రాయలసీమకు కొత్త దిశను చూపించబోతున్నారు. చంద్రబాబు ప్లాన్.. పవన్ కళ్యాణ్ ప్లాన్.. లోకేష్ దీర్ఘ దృష్టి ఇవన్నీ కలిసి ఇప్పుడు రాయలసీమకు కొత్త మార్గాన్ని నిర్దేశించబోతున్నాయి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కూటమి పేరుతో ప్రభుత్వం ఈ సందర్భంగా చేపతోంది.. గాంధీ జయంతి రోజు మదనపల్లె వేదికగా శ్రీకారం చుడుతోంది.

దీంతో ఏం చేస్తారంటే

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైసింగ్ నినాదంతో వచ్చే మూడేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు పెడతారు. రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఇందులో ప్రభుత్వ రంగం నుంచి దాదాపు 40 వేల కోట్లకు పైగా.. ప్రైవేట్ రంగం నుంచి 60 వేల కోట్లకు పైగా పెట్టుబడులు సమకూరుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం.. అన్నమయ్య.. చిత్తూరు.. కర్నూలు.. నంద్యాల.. సత్యసాయి.. తిరుపతి.. వైయస్ఆర్ కడప జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను కలుపుకొని మొత్తం పది జిల్లాల్లో 201 క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. క్లాస్టర్ల పరిధిలో ఉద్యాన పంటల సాగు

సాగు పెంచబోతున్నారు

ప్రస్తుతం ఉన్న ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని పెంచుతారు. దీనిని మొత్తంగా 14.41 లక్షల హెక్టర్లకు తీసుకెళ్తారు. అదే సమయంలో ఉద్యాన పంటల ఉత్పత్తిని కూడా పెంచుతారు. దీనిద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించబోతున్నారు. మామిడి.. అరటి.. టమాట.. దానిమ్మ.. బత్తాయి.. నిమ్మ వంటి సంప్రదాయ పంటలు మాత్రమే కాకుండా డ్రాగన్ ఫ్రూట్.. అవకాడో.. బెర్రీస్ వంటి అధిక విలువ కలిగిన పంటలను కూడా ప్రోత్సహిస్తారు.

నీటిపారుదలకి భారీగా కేటాయింపులు

రాయలసీమ ప్రాంతంలో కీలకమైన అంశం సాగునీరు. అందువల్లే ఈ ప్రాజెక్టులో నీటిపారుదల రంగానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది. తాజా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ పెట్టుబడిలో నీటిపారుదల రంగానికి సుమారు 20,884 కోట్లు.. ఉద్యాన రంగానికి 15 వేల కోట్లు.. భవనాలు, మౌలిక వసతులకు 4,562 కోట్లు కేటాయిస్తారు. తొమ్మిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టిస్తారు. మరో 4.3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు..

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

మదనపల్లిలో నిర్వహించే ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటును ప్రభుత్వం చేయబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామితో మదనపల్లిలో ఈ సంస్థకు శంకుస్థాపన చేయబోతున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత.. పరిశోధన.. నైపుణ్యం.. విలువ ఆధారిత వ్యవసాయం వంటి అంశాలకు ఇది ఉపయోగపడుతుంది. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా మార్చబోతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

సీమ రూపరేఖలు మారతాయి

మొత్తంగా రాయలసీమ రైసింగ్ అనేది కేవలం మరో అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు. రాయలసీమ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చాలి అనే భారీ ప్రణాళిక. దీని ద్వారా సీమ ప్రాంతం కాస్త బంగారు పంటలు పండే ప్రాంతంగా మారబోతుంది. రాయలవారి పరిపాలన కాలంలో రాయలసీమలో ముత్యాలను రాశులుగా పోసి అమ్మారని మనం చదువుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన కాలంలో అది వాస్తవ రూపం దాల్చబోతోంది. అంటే నాటి రాయలవారి పరిపాలన.. నేటి చంద్రబాబు పరిపాలన ఒకే విధంగా ఉంది. సీమ ప్రజలు నేటి కార్యక్రమంతో అదృష్టాన్ని తమ గుమ్మంలోకి తీసుకెళ్తున్నట్టు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

1 hour ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

1 hour ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

2 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

2 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

2 hours ago