Home ఆంధ్రప్రదేశ్Tollywood Heroine: సినిమాల్లో “పెద్ద” అవకాశాలు లేవ్.. సైడ్ ఇన్కమ్ – RMK NEWS

Tollywood Heroine: సినిమాల్లో “పెద్ద” అవకాశాలు లేవ్.. సైడ్ ఇన్కమ్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

టాలీవుడ్ హీరోయిన్: ఆమె అందంగా ఉంటుంది. అంతకుమించిన ఎత్తు ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఎల్లోరా శిల్పం అనొచ్చు. డ్యాన్స్ చేస్తే తోటి హీరోలు కూడా భయపడిపోతారు. ఆమెతో స్టెప్పులు వేయాలంటే ఇబ్బంది పడతారు. ఈ తర్వాత పెద్ద హీరోలు అనేక సందర్భాల్లో బయటపెట్టారు. నిజానికి ఆమె నటన.. అందం.. డ్యాన్స్ ప్లస్ పాయింట్లే. కాకపోతే సినిమా సెలక్షన్ల విషయంలో ఆమె చూపించిన దూకుడు కెరియర్ కలిగి దెబ్బ కొట్టింది. వరుసగా ప్లాప్ లు వచ్చాయి. అయినప్పటికీ మేనేజ్ […]

టాలీవుడ్ హీరోయిన్: ఆమె అందంగా ఉంటుంది. అంతకుమించిన ఎత్తు ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఎల్లోరా శిల్పం అనొచ్చు. డ్యాన్స్ చేస్తే తోటి హీరోలు కూడా భయపడిపోతారు. ఆమెతో స్టెప్పులు వేయాలంటే ఇబ్బంది పడతారు. ఈ తర్వాత పెద్ద హీరోలు అనేక సందర్భాల్లో బయటపెట్టారు. నిజానికి ఆమె నటన.. అందం.. డ్యాన్స్ ప్లస్ పాయింట్లే. కాకపోతే సినిమా సెలక్షన్ల విషయంలో ఆమె చూపించిన దూకుడు కెరియర్ కలిగి దెబ్బ కొట్టింది. వరుసగా ప్లాప్ లు వచ్చాయి. అయినా మేనేజ్ చేయగలిగింది. అప్పట్లో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఉపయోగం లేకుండా పోయింది.

టాలీవుడ్ లో అవకాశాలు లేవు. కోలీవుడ్లో కూడా అవకాశాలు లేవు. బాలీవుడ్ లో కూడా అవకాశాలు లేవు. వుడ్ ఎలాంటిదైనా సరే.. అవకాశాలు లేకపోవడం ఆమెకు పెద్ద అవరోధం లాగా మారింది. ఆమె అందంగా ఉంటుందని ముందుగానే చెప్పాం కదా.. ఆ అందాన్ని ఇప్పుడు ఆమె పెట్టుబడిగా మార్చుకుంది. సోషల్ మీడియాలో తనకున్న పాపులారిటీని మరో విధంగా వాడుకుంటున్నారు. సినిమాల్లో పెద్ద అవకాశాలు తక్కువైనప్పటికీ.. అదనపు ఆదాయంతో తన జీవితాన్ని భద్రంగా మార్చుకుంటున్నది. గ్లామర్ ఫోటోషూట్లతో అదరగొడుతోంది. షాపు ఓపెనింగ్‌లతో.. ఓవర్సీస్ ఈవెంట్‌లతో.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా సినిమాల కంటే ఎక్కువగా సంపాదిస్తుంది.. పైగా సంపాదనను అత్యంత తెలివిగా ఆమె ఇన్‌వెస్ట్ చేస్తోంది.

ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన నేపథ్యం ఉంది. బంధువులు కూడా ఉన్నారు. కర్ణాటకలో కూడా ఆమెకు అత్యంత సన్నిహితులు ఉన్నారు. వీరందరి ద్వారా తాను సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగానే భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వాటిల్లో డెవలప్మెంట్ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. మరి కొద్దిరోజులు ఇలాగే చూసి.. అప్పటికి అవకాశాలు లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి రావాలని ఆ నటి అనిపిస్తుందట. పైగా తన తల్లి డాక్టర్ అయిన.. ఆమె ద్వారా కూడా ఆ వ్యాపార రంగంలో ఉన్నవారితో మాట్లాడుతున్నాడట.

గతంలో ఆమె ఉన్నప్పుడు ప్రతి పైసాను నిర్మాతల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. ఇప్పుడు ఆ నిర్మాతలు ఆమెను పెద్దగా దేకడం లేదు. పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకే ఎవరి మీద ఆధారపడకుండా.. తన అందాన్ని పెట్టుబడిగా మార్చుకొని.. తనకు తానే ఈ స్థాయిలో డెవలప్ అవుతుంది. సాధారణంగా హీరోయిన్లు తమ కెరియర్ ను కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. కానీ ఈమె మాత్రం ఆ కొన్ని సంవత్సరాలలో గట్టిగానే సంపాదిస్తూ.. జీవితాన్ని సెటిల్ చేసుకుంటున్నది. ఎంతైనా బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదాన్ని సార్థకం చేసుకుంటున్నది.. ఈమె చూపించిన తొవ్వ చాలామంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతైనా సినిమా అంటే సమాజసేవ కాదు కదా.. వ్యాపారం కదా.. అందులో ఈమె ఏకంగా పిహెచ్డి చేసింది మరి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

1 day ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

1 day ago