Home ఆంధ్రప్రదేశ్టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. – RMK NEWS

టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం చేసింది.. నిండా ముంచింది. రిజర్వేషన్లను తగ్గించింది. పైగా కీలక పదవులను రాయలసీమ రెడ్లకు ఇచ్చింది. కేవలం తిట్టిపోయడానికి.. కేసులు ఎదుర్కోవడానికి.. జైలు పాలు కావడానికి మాత్రమే బీసీలను వాడుకుంది.

ఇది కూడా ఎన్నో రోజులు సాగలేదు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీసీల బతుకు బాగుపడడం మొదలైంది. సమాజంలో సగ భాగంగా ఉన్న బీసీలకు కూటమి ప్రభుత్వం సింహభాగం అవకాశాలు కల్పిస్తోంది. అంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు అందిస్తోంది. చట్టాన్ని అతిక్రమించకుండా.. నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్‌బి), గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్‌ఎల్‌బి) కు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందంటే.. కూటమి ప్రభుత్వం గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్థానిక గ్రామీణ సంస్థల్లో బీసీలకు 34 శాతం.. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 331/3 శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది. ఇక ఎస్సీలకు.. ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. వారికోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిజర్వేషన్లు యధావిధిగా అమలు జరుగుతూ ఉంటాయి. బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డేడికేటెడ్ కమిషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది..

ముమ్మాటికి బీసీల పార్టీ

టిడిపి దేశం లోనే తొలిసారిగా బీసీలకు రాజ్యాధికారం అని మాట్లాడింది. అవకాశాలు కూడా కల్పించింది. నాడు సీనియర్ ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో బీసీలకు అవకాశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు,. ఎంపీ స్థానాల్లో పోటీకి వారికి టికెట్లు ఇచ్చారు. బీసీలను ఒక వర్గంగా గుర్తించి.. వారందరినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చారు. దీంతో దేశంలోనే తొలిసారిగా బీసీల గురించి.. వారి గురించి.. సంక్షేమం గురించి చర్చ మొదలైంది. అందుకే బీసీలు టిడిపిని ఇది నా పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారు. దేశంలో మరే పార్టీ కూడా బీసీలకు ఈ స్థాయిలో దగ్గర కాలేదు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా టిడిపికి… బీసీలకు అవినాభావ సంబంధం ఉంది.

అది మాత్రమే కాదు

రాజకీయ ప్రాధాన్యత అంటే కేవలం పార్టీ పరంగా సీట్లు.. పదవులు ఇవ్వడం మాత్రమే కాదు.. లోకల్ బాడీ ఎలక్షన్‌లో తాత్కాలిక రిజర్వేషన్ కల్పించడం ద్వారా గ్రామస్థాయి నుంచి బీసీలలో నాయకత్వ లక్షణాలు పెంచేలా చేసింది ముమ్మాటికీ సీనియర్ ఎన్టీఆరే. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు హయాంలో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లారు. 1995లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో 34 శాతం పెరిగింది. బీసీలపై టిడిపికి ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ పరిపాలన కాలంలో

టిడిపికి బీసీలు అండగా ఉన్నారని కోపంతో వైసీపీ పరిపాలన కాలంలో వారిని ఇబ్బంది పెట్టారు. బీసీల నాయకత్వంపై హత్యా రాజకీయాలను మోపారు. హింసతో ఇబ్బంది పెట్టారు. వైసీపీ పాపాలు అక్కడితోనే ఆగలేదు. బీసీల మీద ఉన్న కక్షతో.. పగతో గడిచిన 30 ఏళ్ల నుంచి ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతం పడగొట్టారు. దీంతో 16 వేల మంది వందల మంది పదవులు కోల్పోయారు. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమం మళ్లీ మొదలైంది.

బీసీలకు ఈ రెండు సంవత్సరాల్లో అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్.. ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం 32,534 కోట్లు ఖర్చు చేసింది. వడ్డెర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తోంది. గీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ షాపులు కేటాయించింది. నేత కార్మికులకు ఒక్క కుటుంబానికి ఏడాదికి 25వేల వరకు ఇస్తోంది. హ్యాండ్లూమ్ మగ్గాలకు కుటుంబానికి నెలకు 200 యూనిట్లు.. పవర్ లోన్ మగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. సముద్రంలో చేపల వేటను నిషేధించినప్పుడు మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న చంద్రబాబు తీసుకొచ్చారు. మత్స్యకారుల సేవలో పదకం ద్వారా వేట విరామం సమయంలో వారికి 20,000 ఇస్తోంది. రాయితీ మీద బోట్లు.. డీజిల్ కూడా ఇస్తుంది. గడిచిన ప్రభుత్వం ఆ న్యాయంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 ప్రభుత్వం రద్దు చేసింది. మత్స్యకారుల సొసైటీ హక్కులను కూటమి ప్రభుత్వం కాపాడింది. మత్స్యకార మహిళలకు సీ వీడ్ స్కీం ద్వారా శిక్ష నుంచి ఉపాధి కల్పిస్తోంది. నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. స్వర్ణకారులకు ప్రత్యేకంగా అందించింది. దేవాలయాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇచ్చే భృతిని 15 వేల నుండి 25 వేలకు పెంచింది.

ఏపీలో బీసీల జనాభా 2.66 కోట్లు. అంటే మొత్తం జనాభాలో బీసీలు 50.42 శాతం గా ఉన్నారు. 138 బీసీ ఉపకుల న్యాయం జరిగే విధంగా తొలిరోజు నుంచి పనిచేయడం మొదలుపెట్టింది టిడిపి. జనాభాలో గ్రామీణ బీసీలు 48.44%, పట్టణ జనాభాలో బీసీలు 54.36 శాతం గా ఉన్నారు. ఈ స్థాయిలో రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగడం బీసీల కర్తవ్యం. ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మితే చివరికి మోసపోయేది కూడా బీసీలే.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

1 day ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

1 day ago