AP DSC 2026: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. లోకేష్ దూకుడు వైసీపీ ఆప తరమాఏపీలో ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగుల కలలను సాకారం చేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి.. జీవితాలలో కొత్త వెలుగులు నింపింది. కానీ ఈ పరిశీలన ఓర్చుకోలేక వైసీపీ నిప్పులు చిమ్మడం మొదలు పెట్టింది. ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం ప్రారంభించింది. అనేక విధాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. కానీ ఇవేవీ కూడా నిలబడలేకపోయాయి. […]
AP DSC 2026: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. లోకేష్ దూకుడు వైసీపీ ఆప తరమాఏపీలో ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగుల కలలను సాకారం చేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి.. జీవితాలలో కొత్త వెలుగులు నింపింది. కానీ ఈ పరిశీలన ఓర్చుకోలేక వైసీపీ నిప్పులు చిమ్మడం మొదలు పెట్టింది. ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం ప్రారంభించింది. అనేక విధాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. కానీ ఇవేవీ కూడా నిలబడలేకపోయాయి. వాస్తవానికి పకడ్బందీగా ఆధారాలు కనుక వైసిపి దగ్గర ఉంటే కచ్చితంగా న్యాయస్థానం దగ్గరికి వెళ్ళేది. అలా చేయకుండా ప్రజలలో లేనిపోని భయాలు సృష్టించే విధంగా.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించింది. కానీ చివరికి న్యాయం గెలిచింది. వైసిపి విష ప్రచారం ఓడిపోయింది.
వైసిపి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ నిరుద్యోగుల విషయంలో దూకుడుగా వ్యవహరించారు. డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ తర్వాత లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు ఆయన పచ్చ జెండా ఊపారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా డీఎస్సీ ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
ఈ విడత నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2721 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో జెడ్పీ.. ఎంపీపీ.. మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన ఎస్ ఏ, జిటి పోస్టులతో పాటు.. స్పెషల్ ఎడ్యుకేషన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు వివిధ గురుకుల విద్యాలయాల పరిధిలో ఉన్న సొసైటీలలోని ప్రిన్సిపాల్.. పిజిటి.. టీజీటీ. పిడి.. పీఈటికి కూడా భర్తీ చేయబోతున్నారు. దరఖాస్తుకు సంబంధించిన ప్రక్రియ.. షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ప్రక్రియలో భాగంగా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు.. అత్యంత పారదర్శకంగా.. వేగవంతంగా పూర్తి చేయడానికి నారా లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అభ్యర్థుల కోసం పరీక్ష.. సిలబస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో కంప్యూటర్ ఆధారంగా అర్హత పరీక్షలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం వరస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా.. టైం ప్రకారం నియామకాలు పూర్తి చేయడానికి ఇప్పటికే నారా లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగపూట వెలువడిన టీచర్ల ఉద్యోగుల ప్రకటన లక్షలాదిమంది డీఎస్సీ అభ్యర్థులకు నిజమైన కానుకగా నిలిచింది.