Apple Samsung: మన దేశానికి వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది గుర్తుందా.. నిజానికి అప్పటివరకు మన దేశ ప్రజలకు చాయ్ తాగే అలవాటు లేదు. కాకపోతే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండేది కాబట్టి.. జనాలు పాలను తాగేవారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ దేశాల నుంచి టీ పౌడర్ తీసుకొచ్చేవాళ్ళు. అందులో పంచదార.. పాలను కలుపుకొని టీ తయారు చేసేవాళ్ళు. మొదట్లో కొంతమంది భారతీయులకు టీ పోసేవాళ్ళు. ఆ తదుపరి అది అలవాటుగా […]
Apple Samsung: మన దేశానికి వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది గుర్తుందా.. వాస్తవానికి అప్పటివరకు మన దేశ ప్రజలకు చాయ్ తాగే అలవాటు లేదు. కాకపోతే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండేది కాబట్టి.. జనాలు పాలను తాగేవారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ దేశాల నుంచి టీ పౌడర్ తీసుకొచ్చేవాళ్ళు. అందులో పంచదార.. పాలను కలుపుకొని టీ తయారు చేసేవాళ్ళు. మొదట్లో కొంతమంది భారతీయులకు టీ పోసేవాళ్ళు. ఆ తదుపరి అది అలవాటుగా మారింది. కేవలం టీ అలవాటు ద్వారానే మనదేశంలో అనేక సంస్థలను ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని బట్టి వెస్ట్రన్ కంట్రీస్ వ్యాపారుల మోసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆధునిక కాలంలో వెస్ట్రన్ కంట్రీస్ వ్యాపారులు టెక్నాలజీతో మనల్ని దోచుకుంటున్నారు. ఉదాహరణకు ఇప్పుడు మనం వాడుతున్న సామాజిక మాధ్యమాలు.. స్మార్ట్ ఫోన్లు.. ఇతర ఉత్పత్తులు మొత్తం వాళ్ళు తయారుచేసినవే. మొదట్లో శాంపిల్ గా మన మీదికి వదిలారు. ఆ తర్వాత వ్యసనంగా మార్చేశారు. ఇప్పుడు అవి లేకుండా క్షణం కూడా గడవలేని పరిస్థితికి తీసుకొచ్చారు. చివరికి దైనందిన కార్యకలాపాలనుంచి మొదలు పెడితే నిద్రవరకు కూడా తమ ఆధీనంలో ఉండేలా చూసుకున్నారు. దీనిని బట్టి వెస్ట్రన్ కంపెనీ వ్యాపారుల మోసం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం వెస్ట్రన్ కంపెనీలు టెక్నాలజీ పేరుతో మనల్ని దోచుకుంటున్నారు. తాజాగా గ్లోబల్ మార్కెట్‌లోకి ఆపిల్ కంపెనీ ఐఫోన్ సిరీస్‌లను విడుదల చేసింది. ఈసారి ఫోల్డ బుల్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ పని చేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉత్పత్తిని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆపిల్.. సాంసంగ్ మధ్య మాటల యుద్ధం. వాస్తవానికి ఈ రెండు కంపెనీల మధ్య పోటీ ఉంది. అన్నిటికీ మించి వస్తువుల వ్యవహారంలో ఒకరి మీద ఒకరికి అక్కసు ఉంది. కాకపోతే దోచుకునే విషయంలో ఈ రెండు కూడా తోడు దొంగలే.
ఆపిల్ కంపెనీ కోసం సాంసంగ్ కలిసి పనిచేస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం. ఐఫోన్ తీసుకొచ్చిన డ్యూయో ఫోన్ల డిస్ ప్లే కు సంబంధించిన కీలకమైన స్క్రీన్ నిభాగాన్ని శాంసంగ్ అందిస్తోంది. ఈ మూడు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కొక్క ఇన్నర్ ఫోల్డింగ్ డిస్ప్లే ప్యానెల్ మన కరెన్సీలో దాదాపు 24 వేల వరకు వసూలు చేస్తోంది. అందువల్లే ఆపిల్ కంపెనీ టీవీకి ప్రవేశించిందని వార్తలు వస్తున్నాయి.
ఆపిల్ కంపెనీ తాజాగా తీసుకొచ్చిన ఐఫోన్లలో డిస్ప్లే సాంకేతికంగా అత్యంత కీలకమైనది. పదేపదే ఫోన్ మడిచినా సరే.. రంగు చెదిరిపోదు. ఎక్కువ కాలం క్వాలిటీతో ఉంటుంది. ఆపిల్కి డిస్ప్లేను సరఫరా చేసే కంపెనీల ప్రస్తుత అవసరాలు తగ్గట్టుగా ఉత్పత్తి చేయడం లేదు. అందువల్లే సాంసంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఆపిల్ కంపెనీ ఈసారి తన ఫోన్ల ధరలను విపరీతంగా పెంచింది. ఇతర దేశాల మార్కెట్లతో పోల్చి చూస్తే మనదేశంలోనే ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయి.. దీన్నిబట్టి అటు ఆపిల్.. ఇటు సాంసంగ్ తోడుదొంగల అవతారం ఎత్తి మనల్ని దోచుకుంటున్నాయి.