Home తాజా వార్తలుPawan Kalyan Amit Shah : అమిత్ షాతో ఢిల్లీలో పవన్ , నాదెండ్ల భేటీ.. – RMK NEWS

Pawan Kalyan Amit Shah : అమిత్ షాతో ఢిల్లీలో పవన్ , నాదెండ్ల భేటీ.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

పవన్ కళ్యాణ్ – అమిత్ షా : కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ తర్వాత.. స్థానంలో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏపీలో కూడా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో పవన్ కళ్యాణ్.. అమిత్ షా ఇద్దరు కూడా అత్యంత శక్తివంతమైన నాయకులు. వీరిద్దరికీ బలమైన నేపథ్యం ఉంది. అన్నింటికి మించి జాతీయ భావాలు పుష్కలంగా ఉన్నాయి. వీరిద్దరిది ఒకే మనస్తత్వం. శైలికూడా ఒకే […]

పవన్ కళ్యాణ్ – అమిత్ షా : కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ తర్వాత.. స్థానంలో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏపీలో కూడా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో పవన్ కళ్యాణ్.. అమిత్ షా ఇద్దరు కూడా అత్యంత శక్తివంతమైన నాయకులు. వీరిద్దరికీ బలమైన నేపథ్యం ఉంది. అన్నింటికి మించి జాతీయ భావాలు పుష్కలంగా ఉన్నాయి. వీరిద్దరిది ఒకే మనస్తత్వం. శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. దేశం ముఖ్యమా.. ప్రాణాలు ముఖ్యమా అంటే వీరిద్దరూ మొదటి దానికి ఓటు వేస్తారు.

అంతటి జాతీయత భావాలు ఉన్న వీరిద్దరూ కలవడం ఏపీ రాజకీయాలలోనే కాదు, దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షా పెద్దగా ఎవరితోటం లేదు. పశ్చిమ బెంగాల్లో సిలిగురి కారిడార్ లో చేపడుతున్న పనులపై నిత్యం సమీక్షలు జరుగుతున్నాయి.. ఈశాన్య రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అలాంటి అమిత్ షా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఏకంగా 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. అనేక ఈ సమావేశంలో మాట్లాడారని. అమిత్ షా తో సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. అధ్యంతం మీటింగ్ అద్భుతంగా సాగిందని.

ఇప్పటికిప్పుడు అమిత్ షా, పవన్ కళ్యాణ్ భేటీ వెనుక అసలు ఉద్దేశం 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి, జనసేన, టిడిపి కలిసి ఏపీ పోటీ చేయడమేనని లీకులు ఇచ్చారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2024లో బంపర్ మెజారిటీతో విజయం సాధించాయి. వైసిపిని 11 స్థానాలకు పరిమితం చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అభివృద్ధి.. సంక్షేమం.. ప్రజల.. రాజకీయంగా స్థిరత్వం స్థిరత్వం కొనసాగాలంటే ఈ మూడు పార్టీలు 2029 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అమిత్ షాకు సూచనలు చేశారు.. దీనికి అమిత్ షా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.

2024 లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు.. దానికంటే ముందు జనసేన, టిడిపి, బిజెపి పార్టీలు కలిసి పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపించారు. బిజెపి పెద్దలతో మాట్లాడారు. పొత్తు కుదిరేలా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అందువల్ల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు ఏపీలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. వైసిపిని అధికారానికి దూరంగా ఉంచాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉంటుంది బిజెపి పెద్దలతో అసలు విషయం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటను బిజెపి పెద్దలు కూడా కాదనలేకపోతున్నారు. ఆయన చెప్పిన దానికి ఓకే అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గురువారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని కీలక మంత్రులను.. ఇంకా కొంతమంది పెద్దలను కలిసే అవకాశం ఉంది.

– కుహాన మేధావుల వాదన ఇది..

అయితే అమిత్ షాతో పవన్ భేటీ వెనుక బీజేపీ, జనసేన లీకులు అన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. మూడు పార్టీలు కలిసినడిచేటట్టుగానే ఉన్నాయి. అయితే మన తెలుగులో ప్రొఫెసర్ నాగేశ్వర్ వారు లాంటి సీరియస్ కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా కొత్త లాజిక్ వెతుకుతున్నారు.. జగన్ ను బీజేపీ అరెస్ట్ చేస్తే ఖాళీ అయ్యే ఆ స్థానంలో జనసేనను ప్రతిపక్షంగా పెట్టొచ్చని.. లేదంటే బీజేపీతో కలిసి జనసేన సపరేట్ గా పోటీచేసినా గెలుపొందండి..

అయితే లోగొట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు.. కేంద్ర హోంమంత్రి బీజేపీలో నంబర్ 2 అయిన అమిత్ షా ఆ గుట్టు విప్పారు.. జనసేనాని పవన్ బయటకు చెప్పారు… ఏం జరిగింది? భవిష్యత్తులో ఏం జరుగబోతోందన్నది వారిద్దరికే తెలుసు. కానీ బయట మాత్రం కొందరు కూటమిలో ఈ భేటీ ద్వారా బాగానే పుల్లలు పెట్టే ప్లాన్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ భేటీ ప్రభావం ఎంతనేది భవిష్యత్తులోనే తేలనుంది..

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

20 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago