Home తాజా వార్తలుRoja Son Birthday : రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. – RMK NEWS

Roja Son Birthday : రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Roja Son Birthday : ఆ డెకరేషన్ ఓ రేంజ్ లో ఉంది. స్టేజి అదిరిపోయింది. కేక్ అయితే అత్యంత భారీగా ఉంది. బాంబులు పేలాయి. చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మాయి. వారికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ వచ్చింది. ఇక బర్తడే బాయ్ అయితే సినిమా హీరో లాగా ఉన్నాడు. రింగుల జుట్టు.. దానికి తగ్గట్టుగా నలుపు రంగు డ్రెస్.. యంగ్ కౌ బాయ్ లాగా ఉన్నాడు. అతడిని పట్టుకొని సీనియర్ నటి.. మాజీ మంత్రి రోజా […]

Roja Son Birthday : ఆ డెకరేషన్ ఓ రేంజ్ లో ఉంది. స్టేజి అదిరిపోయింది. కేక్ అయితే అత్యంత భారీగా ఉంది. బాంబులు పేలాయి. చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మాయి. వారికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ వచ్చింది. ఇక బర్తడే బాయ్ అయితే సినిమా హీరో లాగా ఉన్నాడు. రింగుల జుట్టు.. దానికి తగ్గట్టుగా నలుపు రంగు డ్రెస్.. యంగ్ కౌ బాయ్ లాగా ఉన్నాడు.

అతడిని పట్టుకొని సీనియర్ నటి.. మాజీ మంత్రి రోజా వేదిక మీదికి వచ్చారు. ఆమె తీసుకొచ్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు ఆమె కొడుకు.. కృష్ణ కౌశిక్. తన కొడుకు 20వ పుట్టినరోజు వేడుకలను రోజా అత్యంత ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను.. కుటుంబ సభ్యులను మాత్రమే రోజా ఆహ్వానించారు. తన కొడుకు కోరిక మేరకు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు రోజా. వచ్చిన వారికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ వచ్చింది. వారంతా కూడా రోజా కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కృష్ణ కౌశిక్ కేక్ కట్ చేసి ముందుగా తన మాతృమూర్తి రోజాకు పెట్టారు. ఆ తర్వాత తండ్రి సెల్వమణికి కేక్ పెట్టారు. అనంతరం వచ్చిన బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వేడుకలను రోజా అత్యంత ఘనంగా నిర్వహించారు. తన పదవిలో పుట్టినరోజు జరగలేదు.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొడుకు వేడుకల విషయంలో మాత్రం తగ్గలేదు. పైగా తన కొడుకుకు ఇష్టమైన వేడుక జరిగింది…

రోజా మంత్రిగా ఉన్నప్పుడు కొడుకు కోరిక మేరకు ఒక విలాసవంతమైన కారును కొనుగోలు చేశారు. అప్పుడు అది కాస్త వివాదస్పదమైంది. కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేక కథనాలను ప్రసారం చేశాయి. ఆ తర్వాత రోజా వాటి మీద క్లారిటీ ఇచ్చారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నగరి నియోజకవర్గంలో రోజా ఓడిపోవాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటికీ నగరి నియోజకవర్గంలో ఆమె తిరుగుతూనే ఉన్నారు. కార్యకర్తలను కలుపుతూనే ఉన్నారు. వేడుకలకు.. ఇతర కార్యక్రమాలకు ఆమె హాజరవుతూనే ఉన్నారు. 2029 లో జరిగే ఎన్నికల్లో మరోసారి నగరి నుంచి పోటీ చేసి గెలుపొందాలని రోజా చూస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

32 minutes ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

32 minutes ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

32 minutes ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

32 minutes ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

32 minutes ago