Home అంతర్ జాతీయనెదర్లాండ్స్: అమెరికాపై సడలుతున్న నమ్మకం.. బంగారం తరలిస్తున్న నెదర్లాండ్స్‌! -RMK NEWS

నెదర్లాండ్స్: అమెరికాపై సడలుతున్న నమ్మకం.. బంగారం తరలిస్తున్న నెదర్లాండ్స్‌! -RMK NEWS

by RMK NEWS
0 comments
నెదర్లాండ్స్

నెదర్లాండ్స్

నెదర్లాండ్స్: రష్యా, ఉక్రెయిన్‌ వార్‌ కారణంగా యూరప్, అమెరికా, ఇరాన్‌ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అనిశ్చితి పెరుగుతున్న సమయంలో అమెరికాపై విశ్వాసం కూడా సన్నగిల్లుతోంది. నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంకు (డీఎన్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని సంపదలో బంగార నిల్వ సురక్షిత ప్రదేశానికి మార్చబడింది. అమెరికా, కెనడా నుంచి సుమారు 86 టన్నుల బంగారాన్ని లండన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాల్ట్‌లో ఉంచింది. సంక్షోభ సమయంలో తక్షణ లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది.

దశలవారీగా తరలింపు..

ఈ మార్చి ఏడాది ఆగస్టు నుంచి మధ్య కాలంలో తరలింపు ఆపరేషన్ జరిగింది. మొదటి దశలో సుమారు 27 టన్నులు అమెరికా, కెనడా బ్యాంకుల నుంచి నేరుగా తీసుకొచ్చి నెదర్లాండ్స్‌ మీదుగా లండన్‌కు చేర్చారు. మిగిలిన వాటిని న్యూయార్క్‌లో విక్రయించి, లండన్‌లో తిరిగి కొనుగోలు చేసే పద్ధతిని అవలంబించారు. రవాణా సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని వివిధ దశల్లో, ఈ ప్రక్రియను పూర్తి చేశామని డచ్ కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల ఏకమొత్తంలో తరలించే రిస్క్ తగ్గిందని.

అంతర్జాతీయ అస్థిరతే ప్రధాన కారణం

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులే బంగారం తరలింపునకు ప్రధాన కారణం.. అమెరికా, కెనడా మధ్య పరస్పర సుంకాలు విధించుకుంటున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్‌తో సంబంధించిన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా అశాంతి రాష్ట్ర ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అటువంటి అనిశ్చిత వాతావరణంలో బంగారం వంటి ఆస్తిని సులభంగా యాక్సెస్ చేసుకునే, వ్యాపారం చేసే ప్రదేశంలో ఉంచాలనే ఆలోచనతోనే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

లండన్‌లో సురక్షితమేనా?

లండన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బంగార మార్కెట్‌గా నిలుస్తోంది. అక్కడ కొనుగోలు, విక్రయం, తాకట్టు వంటి లావాదేవీలు చాలా సులభం, వేగవంతం. బ్యాంక్‌ ఆఫ్‌ వాల్ట్‌లు అత్యంత ఉన్నత స్థాయి భద్రతా వ్యవస్థతో కూడి ఉన్నాయి. బాంబు దాడులను కూడా తట్టుకునేలా నిర్మించారు, అనధికార ప్రవేశం దాదాపు అసాధ్యం. ప్రపంచంలోని మొత్తం బంగార నిల్వల్లో సుమారు ఐదో వంతు ఇక్కడ ఉంది. వీటిలో 90 పైగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్ద సంస్థలకు చెందినవి. కేవలం చిన్న భాగమే స్థానికం. అదనంగా, వాల్ట్ లోపల ఒక దేశం నిల్వ నుంచి మరొక దేశం నిల్వకు మార్చడం ద్వారా తరలింపు పూర్తవుతుంది. భౌతిక రవాణా అవసరం లేకుండానే దేశాల మధ్య బదిలీ సాధ్యమవుతుంది. ఇది సంక్షోభ కాలంలో కీలక ప్రయోజనం.

అనేక దేశాలు తమ బంగార నిల్వలను ఎక్కువ భద్రతా, లిక్విడిటీ ఉన్న ప్రాంతాలకు మార్చుకుంటున్న ధోరణిని ప్రారంభించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భౌగోళిక రాజకీయ రిస్కులు పెరిగే కొద్దీ, బంగారం వంటి సంప్రదాయ ఆస్తులపై ఆధారపడటం పెరుగుతుంది. అయితే, ఇటువంటి తరలింపులు ఖర్చు, సమయం, సమన్వయం అవసరమైన క్లిష్టమైన ప్రక్రియలు. భవిష్యత్తులో మరిన్ని కేంద్ర బ్యాంకులు ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

2 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

2 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

2 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

2 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

2 hours ago