Home ఆంధ్రప్రదేశ్వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: పొలిటికల్ గుసగుస: విశాఖ, గుంటూరు – RMK NEWS

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: పొలిటికల్ గుసగుస: విశాఖ, గుంటూరు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

YS Jagan Mohan Reddy: వైసీపీలో వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. జగన్ కూడా వైయస్ వారసుడే కాబట్టి.. పైగా ఆయన పేరు చెప్పుకునే పార్టీకి పేరు పెట్టారు. వైయస్ పేరు లేకుంటే జగన్ కు ఈరోజుకు కూడా గుర్తింపు లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వేసిన రాజకీయ పునాదులు అటువంటివి. జగన్ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. అందుకే ఆ పార్టీలో ఉన్న నాయకులు తమ వారసులను లేదా బంధువులను.. ఇతర […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: వైసీపీలో వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. జగన్ కూడా వైయస్ వారసుడే కాబట్టి.. పైగా ఆయన పేరు చెప్పుకునే పార్టీకి పేరు పెట్టారు. వైయస్ పేరు లేకుంటే జగన్ కు ఈరోజుకు కూడా గుర్తింపు లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వేసిన రాజకీయ పునాదులు అటువంటివి. జగన్ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. అందుకే ఆ పార్టీలో ఉన్న నాయకులు తమ వారసులను లేదా బంధువులను.. ఇతర అనుచరులను రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఏపీలో పురపాలక ఎన్నికలు జరగబోతున్నాయి. వైసిపి ఇప్పుడు అధికారం లేదు. అలాగని పూర్తిగా హ్యాండ్‌సప్ అవ్వకుండా.. గట్టి పోరాటం చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. అందుకే కీలకమైన నగర పాలకమండలిలో పోటీకి సై అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నాడు విశాఖపట్నం.. గుంటూరు.. నెల్లూరు నగర పాలకాలను వైసిపి దక్కించుకుంది. అయితే ఈసారి కూడా ఆ మూడు స్థానాల మీద గట్టిగా దృష్టి సారించినట్లు సమాచారం.. అందుకే ఈ మూడు సంస్థల్లో కొత్త పేర్లు తెరమీదకి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.

విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష.. గుంటూరు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక.. నెల్లూరు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం వైసిపికి కీలకమైన రాజకీయ కేంద్రం. ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పొలిటికల్గా యాక్టివ్ గా ఉన్న అనూషకు ఇటీవల భీమిలి సెగ్మెంట్ బాధితులు అప్పగించిన పార్టీ. వాస్తవానికి ఆమె జిల్లా పరిషత్ కు పోటీ చేసే ఆలోచనలో బొత్స ఉన్నారని చర్చ కూడా నడిచింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేరే విధంగా మారిపోయాయి. దీంతో భీమిలి అనూష చేతికి సొంతమైంది. భీమిలిలో పార్టీని బలోపేతం చేస్తూనే.. విశాఖ మేయర్ పీఠం రేసులో అనూషను నిలబడితే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీకి వస్తుంది.

ఇక గుంటూరు కార్పొరేషన్ విషయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పేరు పరిశీలనలో ఉన్న సమాచారం. ఈమె తండ్రికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆమధ్య రాంబాబుకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చర్చకు దారితీసినప్పుడు మౌనిక పొలిటికల్ స్క్రీన్ మీదకి వచ్చారు. నాడు ఆమె తండ్రికి సపోర్ట్ గా నిలిచారు. ఇక అధికార పక్షానికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. నాడు రాంబాబుకు వారసురాలు దొరికిందని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. రాంబాబు ఆ మధ్య జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత మౌనిక అంతగా కనిపించలేదు. అయినా సరే ఆమెనే గుంటూరుకు దించితే బాగుంటుంది అని చర్చ నడుస్తోంది.

నెల్లూరు కార్పొరేషన్ విషయానికొస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పేరు వినిపిస్తోంది. గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో పూజిత తండ్రికి సపోర్ట్ గా నిలిచారు. రాజకీయంగా స్పందించారు. ప్రస్తుతం ఆమె వైసీపీ మహిళా విభాగానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. అనూష, మౌనికతో పోల్చి చూస్తే పూజిత పార్టీ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా.. పరోక్షంగా పాత్రలు పోషిస్తున్నారు. రాజకీయంగా యాక్టివ్‌గా కొనసాగుతున్నారు.. కాబట్టి ఈ 3 ముఖ్యమైన కార్పొరేషన్లలో ముగ్గురు వారసురాళ్లను రంగంలోకి దింపితే.. క్యాడర్లలో కూడా ఉత్సాహం పెరుగుతుందని వైసీపీ పెద్దలు. అయితే ఇంతవరకు రిజర్వేషన్లు తేలలేదు కాబట్టి.. రాజకీయ సమీకరణలు.. కేడర్ అభిప్రాయాలు.. ఇతర విషయాలను పరిశీలించిన తర్వాత వీరి ముగ్గురి పోటీ గురించి అసలు విషయాలు తెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

5 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

5 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

5 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

6 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

6 hours ago