Home ఆంధ్రప్రదేశ్Vijayawada Politics: పొలిటికల్ గుసగుస: విజయవాడ మీద – RMK NEWS

Vijayawada Politics: పొలిటికల్ గుసగుస: విజయవాడ మీద – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Vijayawada Politics: అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన పోటీ. అందరూ తాడేపల్లికి వెళ్లేవారు. జగన్ దర్శన భాగ్యం కోసం ఎదురుచూసేవారు. జగన్ కలిసే అవకాశాలు లేకపోవడంతో సజ్జలను కలిసి తమ విన్నపాలను విన్నవించుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారం లేదు. మిగిలిన వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దాచుకున్న వాళ్ళు.. బ్రహ్మాండంగా వెనకేసుకున్నవాళ్లు.. మాకెందుకులే అన్నట్టుగా ఉండిపోతున్నారు. దీనితో అసలు పోటీ చేస్తారా.. పోటీ చేసే అవకాశం ఉందా.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. […]

విజయవాడ రాజకీయాలు: అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన పోటీ. అందరూ తాడేపల్లికి వెళ్లేవారు. జగన్ దర్శన భాగ్యం కోసం ఎదురుచూసేవారు. జగన్ కలిసే అవకాశాలు లేకపోవడంతో సజ్జలను కలిసి తమ విన్నపాలను విన్నవించుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారం లేదు. మిగిలిన వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దాచుకున్న వాళ్ళు.. బ్రహ్మాండంగా వెనకేసుకున్నవాళ్లు.. మాకెందుకులే అన్నట్టుగా ఉండిపోతున్నారు. దీనితో అసలు పోటీ చేస్తారా.. పోటీ చేసే అవకాశం ఉందా.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి దృష్టి ముఖ్యంగా విజయవాడ మేయర్ స్థానం మీద ఉంది. కూటమిలో అయితే పోటీ విపరీతంగా ఉంది. జనసేన కూడా తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక టిడిపి నుంచి అయితే చాంతాడంత జాబితా ఉంది. ఇప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టిడిపి నుంచి విపరీతంగా పోటీ ఉండేది. నాడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో 64 డివిజన్లు ఉంటే.. ఇందులో వైసిపి 49 గెలుచుకుంది. అంటే ఎక్కడ కూడా వైసిపికి వైట్ వాష్ చేసే అవకాశం టిడిపి ఇవ్వలేదు. పైగా నాడు జరిగిన అన్ని స్థానాల్లో గెలవాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కానీ టిడిపి నాయకులు ఆయన అంచనాలను తలకిందులు చేశారు.

నాడు వైసిపి ఆ స్థాయిలో చేస్తేనే విజయవాడలో 49 డివిజన్లు దక్కాయి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా.. పైగా కూటమి బలంగా ఉంది. విజయవాడ అభివృద్ధి విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అలాంటప్పుడు విజయవాడలో వైసీపీ పోటీ చేస్తుందా.. ఒకవేళ పోటీ చేస్తే మేయర్ అభ్యర్థి ఎవరు.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వైసిపి నుంచి పోటీ విషయంలో ఇంతవరకు ఆ పార్టీ అధినాయకత్వం స్పందించలేదు. ఈ వ్యవహారంలో కొంతమంది కీలక నాయకులు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నారు.

ఒకవేళ అభ్యర్థిని కలిసి ఆర్థిక మూలాలు దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి.. తాము చెప్పడం లేదని వైసీపీ నాయకులు సరికొత్త పల్లవి అందుకుంటున్నారు.. కానీ, వాస్తవం మాత్రం అలా లేదు. పార్టీ అధినాయకత్వం నుంచి ఆర్థికంగా భరోసా లభించడం లేదు. పైగానేతలను ఎదుర్కొని నిలబడాలి అంటే అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో ఒక రకమైన నిరాశ ఉంది. అలాంటప్పుడు అందరినీ కలుపుకొని పోవాలంటే అంత ఈజీ కాదు. ఇదంతా ఎందుకు అని చాలామంది మేయర్ వద్దు.. పోటీ కూడా వద్దు అన్నట్టుగా దూరంగా ఉంటున్నారు. అందువల్లే విజయవాడ మేయర్ విషయంలో వైసిపి ఎటువంటి లీకులు బయటికి ఇవ్వడం లేదని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇక విజయవాడ మేయర్ విషయంలో టిడిపి ఇప్పటికే ఒక అంచనాకొచ్చింది. మరో కీలకమైన కార్పొరేషన్ పార్టీకి కేటాయించి.. విజయవాడ మీద పాగా వేయాలని ఆ పార్టీ బలంగా కోరుకుంటున్నది జనసేన నుంచి పోటీ. టిడిపి తో పోల్చి చూస్తే విజయవాడలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు విజయవాడ విషయంలో టిడిపి తో తగువులు పెట్టుకోకుండా.. బలం ఉన్నచోట మాత్రమే పోటీ చేయాలని.. అక్కడ మాత్రమే సత్తా చూపించాలని.. అదే జనసేనకు శిరోధార్యం అని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

4 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

4 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

4 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

5 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

5 hours ago