Home సినిమాహైదరాబాద్‌లో అత్యధిక ధర పలికిన టాప్ 5 గణేష్ లడ్డూలు – RMK NEWS

హైదరాబాద్‌లో అత్యధిక ధర పలికిన టాప్ 5 గణేష్ లడ్డూలు – RMK NEWS

by RMK NEWS
0 comments


హైదరాబాద్‌ మహా నగరంలో గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. పలు ప్రాంతాలలో జరిగిన వేలల్లో గణేష్ లడ్డూలకు ధరలు పలికాయి. అందులో అత్యధిక ధర నమోదైన ఐదు లడ్డూల వివరాలు ఇలా ఉన్నాయి.

బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలంలో 5 కిలోల లడ్డూకు ఏకంగా రూ.1.01 కోట్ల ధర పలికింది. దీంతో ఈ లడ్డూ అత్యధిక ధర నమోదైన వాటిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్‌ గణేషుడి 21 కిలోల లడ్డూను సామ ప్రణీత్ రూ.39 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూ వేలం పాటపై ఆసక్తి నెలకొని ఉంటుంది. ప్రతి ఏడాది రికార్డ్ ధరకు బాలాపూర్ లడ్డూ అమ్ముడవుతూ ఉంటుంది. ఇకపోతే కోహినూర్ బై ఆర్రో రియాల్టీలో నిర్వహించిన వేలంలో లడ్డూ రూ.30.50 లక్షలకు అమ్ముడుపోయింది.

మై హోమ్ భూజాలో నిర్వహించిన వేలంలో గణేశ్ లడ్డూకు రూ.25 లక్షల ధర లభించింది. కొండాపూర్‌లోని మై హోంలో నిర్వహించిన వేలంలో రూ.21.11 లక్షల ధర నమోదైంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు కూడా గణేష్ లడ్డూ వేలంపాటలు ఆసక్తికరంగా సాగాయి. వేలం పాటలో లడ్డూ తీసుకుంటే మీకు మంచి జరుగుతుందనే నమ్మకంతో చాలా మంది భారీ మొత్తంలో చెల్లించి లడ్డూను సొంతం చేసుకుంటూ ఉంటారు.

రచయిత అవతార్

సయ్యద్ నాగ్ పాషా

నా పేరు సయ్యద్‌ నాగ్‌పాషా. iDreamPost.comలో చీఫ్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ డెస్క్ వర్క్‌తో పాటు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, హెల్త్, లైఫ్ స్టైల్, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ కంటెంట్ కూడా రాస్తుంటాను. జర్నలిజం వృతిలోకి 2018లో వచ్చాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి జర్నలిజం స్కూల్ నుంచి ఈ జర్నీ మొదలైంది. ఆ తర్వాత సాక్షి వెబ్‌సైట్‌, ఖమ్మం యూనిట్‌ ఆఫీస్‌, సుమన్‌ టీవీ, టీవీ9 డిజిటల్‌లో సేవలు అందించాను.

You may also like

Leave a Comment