Home సినిమాNaga Vamsi: నాగ వంశీ మరో అల్లు అరవింద్ అయ్యేలా ఉన్నాడు – RMK NEWS

Naga Vamsi: నాగ వంశీ మరో అల్లు అరవింద్ అయ్యేలా ఉన్నాడు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


నాగ వంశీ: నాగ వంశీ మరో అల్లు అరవింద్ అయ్యేలా ఉన్నాడుగాఇటీవల కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ డిఫరెంట్ జానర్ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ బంపర్ హిట్ గా నిలిచింది. వందల కోట్లు వసూలు చేసింది. ఎపిక్ కూడా టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది.. ఇక ఈయన నిర్మాణంలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ధనుష్ హీరోగా ఒక కొత్త అనౌన్స్ చేశారు. నాగ వంశీ అప్పట్లో […]

నాగ వంశీ: నాగ వంశీ మరో అల్లు అరవింద్ అయ్యేలా ఉన్నాడుగాఇటీవల కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ డిఫరెంట్ జానర్ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ బంపర్ హిట్ గా నిలిచింది. వందల కోట్లు వసూలు చేసింది. ఎపిక్ కూడా టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది.. ఇక ఈయన నిర్మాణంలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ధనుష్ హీరోగా ఒక కొత్త అనౌన్స్ చేశారు.

నాగ వంశీ అప్పట్లో వార్ 2 సినిమా ను తెలుగులో విడుదల చేశారు. కాకపోతే ఆయన అంచనాలు తప్పాయి. ఇప్పుడు నాగ వంశీ రజినీకాంత్ ను నమ్ముకున్నారు. రజనీకాంత్ హీరోగా జైలర్ 2 సినిమా రూపొందించబడింది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ నిర్మించబడింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగ వంశీ విడుదల చేస్తున్నారు. దీనికోసం ఏకంగా 45 కోట్లు+ జీఎస్టీ చెల్లించారని వార్తలు వస్తున్నాయి.

గతంలో తమిళ సినిమాల మీద అల్లు అరవింద్ కు గట్టి పట్టు ఉండేది. గజిని చిత్రం ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత కాంతారా.. ఇంకా కొన్ని సినిమాలను అల్లు అరవింద్ గ‌న్ షాట్‌గా ఎంచుకొని విడుదల చేశారు. గట్టిగా లాభాలు పొందారు. ఇప్పుడు నాగ వంశీ కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు బంపర్ తమిళ సినిమాలను నిర్మిస్తూనే.. ఇండస్ట్రీ వైపు కూడా ఆయన కన్ను వేశారు. వార్ 2 సినిమా ఫలితం ఆయన అంచనాలను అందుకోలేకపోయింది.. విశ్వనాధ్ అండ్ సన్స్.. ఎపిక్ లాంటి సినిమాలు ఆయనకు తిరుగులేని బూస్ట్ ఇచ్చాయి. గల్లా అశోక్ హీరోగా నిర్మించిన వీసా.. హీరో శ్రీకాంత్ తనయుడు రోహన్ హీరోగా.. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇది కాకుండా ఇంకా మరెన్నో సినిమాలను ఆయన లైన్‌లో పెట్టారు.

జైలర్ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చాలామందికి లాభాలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జైలర్ పార్ట్ 2 కూడా బంపర్ హిట్ అవుతుందని నాగ వంశీ నమ్ముతున్నారు. అందుకే ఇంత డబ్బు పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఒకవేళ గనుక నాగ వంశీ అనుకున్న ఫలితం జైలర్ సినిమా ఇస్తే ఇక ఆయనకు తిరుగు ఉండదు. అంతేకాదు ఇంకా మరెన్నో సినిమాలు ఆయన బ్యానర్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిర్మాత పచ్చగా ఉంటేనే పరిశ్రమ బాగుంటుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది.



You may also like

Leave a Comment