Home తాజా వార్తలునేపాల్ ప్రకృతి విపత్తు : నేపాల్‌ను వెంటాడుతున్న శాపం.. – RMK NEWS

నేపాల్ ప్రకృతి విపత్తు : నేపాల్‌ను వెంటాడుతున్న శాపం.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


నేపాల్ ప్రకృతి విపత్తు : మన పొరుగు దేశం నేపాల్‌లో ఐదు రోజుల క్రితం ప్రకృతి ప్రకోపించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా.. ఎలాంటి ముందస్తు సూచన లేకుండా బురదతో కూడిన వరద విరుచుకుపడింది. 2014 భూకంపానికి మించిన నష్టం కలిగించింది. వేలాది మందిని కబళించింది. లెక్కలేనంత మంది గల్లంతయ్యారు. ఇక భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ వరదలకు కారణం చైనా అన్న అభిప్రాయం సగటు నేపాలీల్లో వ్యక్తమవుతోంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. […]

నేపాల్ ప్రకృతి విపత్తు : మన పొరుగు దేశం నేపాల్‌లో ఐదు రోజుల క్రితం ప్రకృతి ప్రకోపించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా.. ఎలాంటి ముందస్తు సూచన లేకుండా బురదతో కూడిన వరద విరుచుకుపడింది. 2014 భూకంపానికి మించిన నష్టం కలిగించింది. వేలాది మందిని కబళించింది. లెక్కలేనంత మంది గల్లంతయ్యారు. ఇక భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ వరదలకు కారణం చైనా అన్న అభిప్రాయం సగటు నేపాలీల్లో వ్యక్తమవుతోంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ చైనాకు సంబంధం లేదు అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనేపాల్‌కు సంబంధించిన ఒక కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ శాపమే ఆ దేశంలో ప్రకృతి విధ్వంసానికి కారణంగా చెప్పబడుతోంది.

ఏంట కథ..?
17వ శతాబ్దంలో ఖాట్మండు లోయను పాలించిన మల్ల వంశ రాజుల కాలంలో అధికార పోరాటాలు సర్వసాధారణం. రాజు లక్ష్మీనరసింహ మల్ల సేవలో ఉన్న సేనాపతి భీమ్‌ మల్ల సైనికుడు, పరిపాలనా, వాణిజ్య వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాడు. పెరుగుతున్న ఇతని ప్రభావం ఇతర సామంతుల్లో అసూయకు దారితీసింది. చాడీలు, అపోహలు రాజు మనసులో సందేహాలు నింపాయి. ఫలితంగా ఎలాంటి సరైన విచారణ లేకుండానే భీమ్ మల్లాకు మరణశిక్ష విధించబడింది.

భీమ్‌ మల్లా భార్య ఆత్మాహుతి..
భర్తను అన్యాయంగా ఉరితీయడాన్ని సహించలేక భువనలక్ష్మి నాటి సతి ఆచారం ప్రకారం చితిపై ఆత్మార్పణం చేసుకుంది. ఆ సమయంలో ఆమె రాజ్యం, నేలపై తీవ్ర కోపంతో శాపం పెట్టిందని జానపద కథనం చెబుతుంది. మనశ్శాంతి లేకుండా, విధ్వంసం ఎదురవుతుందని ఆమె అన్నట్లు ప్రచారం. రాజు తర్వాత పశ్చాత్తాపం చెందాడని, ఆ కాలంలోనే కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించాయని కథలు చెప్పుకుంటారు. ఈ సంఘటన నుంచే సతి లే సరాపేకో దేశం’ అనే పదబంధం పుట్టుకొచ్చిందంటారు.

ఇప్పటికీ వెంటాడుతుందా..
రాజరికం అంతమైన తర్వాత, ప్రభుత్వాలు తరచుగా కూలిపోయిన సందర్భాల్లో, రాజకీయ అస్థిరత తీవ్రమైనప్పుడు ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రకృతి ప్రకోపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం, భూకంపాలు సంభవించినప్పుడు కూడా ప్రజలు దీనిని గుర్తుచేసుకుంటారు. ఇది కేవలం చారిత్రక స్మృతి కాదు.. నేటి వ్యంగ్యంగా, ఆవేదనతో వ్యక్తీకరించే సాధనంగా మారింది. తాజాగా జల విపత్తు మళ్లీ ఈ గాథను తెరపైకి తీసుకొచ్చింది.

ఈ కథ నేపాల్‌లో అన్యాయం, కుట్రలు, అధికార దుర్వినియోగంపై ఉన్న సామూహిక జ్ఞాపకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రకృతి విపత్తులు, రాజకీయ సంక్షోభాలు కలిసి వచ్చినప్పుడు ప్రజలు చారిత్రక శాపాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు నేపాల్‌ ప్రజలు ఇలాంటి కష్టాలను అలవాటు చేసుకుని తిరిగి నిలబడగలరని నమ్మకం వ్యక్తం చేశారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
ఇబ్బంది పడకండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు - RMK NEWS

[ad_1] ఇబ్బంది పడకండి: మలయాళం లో ప్రముఖ నటుడు ఫహద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు…

2 hours ago
ప్రోటీన్ పౌడర్లో విషం.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు.. - Jananethram News

[ad_1] AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా…

2 hours ago
Teacher Student Incident : హోంవర్క్ చేయలేదని దండించిన ఉపాధ్యాయురాలు.. ఇంతలోనే గుండె పగిలిన విద్యార్థి.. వీడియో వైరల్* - RMK NEWS

[ad_1] Teacher Student Incident : విశాఖ జిల్లాలో కలకలం రేపింది. ఒకటో తరగతి చదువుతున్న ప్రణయ్ తేజ…

2 hours ago
BRICS సమ్మిట్: ఈ పుతిన్, జిన్ పింగ్ కార్లు కదిలే సైన్యంతో సమానం.. - RMK NEWS

BRICS సమ్మిట్: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ మద్దతు.…

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా - RMK NEWS

ఆంధ్రప్రదేశ్: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో ఐటి విస్తరణకు…

2 hours ago