Home సినిమాస్వర్గం: కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య నిప్పు రగిలింది – RMK NEWS

స్వర్గం: కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య నిప్పు రగిలింది – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


The paradise: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. భారత రాష్ట్ర సమితి మధ్య పోరు ఈనాటిది కాదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారో.. అప్పటినుంచే ఉప్పు నిప్పు వ్యవహారం లాగా మారిపోయింది. గులాబీ పార్టీ సవాళ్లు విసరడం.. దానికి రేవంత్ రెడ్డి ప్రతి సవాళ్లు విసరడం ఇలా సాగిపోతోంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా కెసిఆర్ కామారెడ్డిలో తెలంగాణ బాబుగా ప్రచారం చేసుకుంటున్నారు […]

స్వర్గం: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. భారత రాష్ట్ర సమితి మధ్య పోరు ఈనాటిది కాదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారో.. అప్పటినుంచే ఉప్పు నిప్పు వ్యవహారం లాగా మారిపోయింది. గులాబీ పార్టీ సవాళ్లు విసరడం.. దానికి రేవంత్ రెడ్డి ప్రతి సవాళ్లు విసరడం ఇలా సాగిపోతోంది.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణ బాబుగా ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఓటమి పాలు కావడంతో.. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని స్థాయిలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను.. ఇతర వ్యవహారాలను రేవంత్ తవ్వుతున్నాడు. అయితే ఇందులో అరెస్టుల వంటి వ్యవహారం జరగడం లేదు. నిజంగా గులాబీ పార్టీ అదే కోరుకుంటున్నప్పటికీ.. గులాబీ పార్టీ నాయకులు జైలుకు వెళ్తే మైలేజ్ వస్తుందని భావించిన రేవంత్.. అలా చేయడం లేదు. తెలంగాణ రాజకీయాలలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవి ఎక్కడిదాకా వెళ్తాయి అంటే పక్కన పెడితే.. ప్రతిరోజు నాయకుల మధ్య వాదనలు.. సంవాదాలు జరిగిపోతూనే ఉన్నాయి.

ఇటీవల విడుదలైన ది ప్యారడైజ్ సినిమా సరికొత్త పరిశీలన తెరపైకి తీసుకువచ్చింది. ఈ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రను అచ్చం కెసిఆర్ మాదిరిగానే రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్. ఈ పాత్రలో ప్రియదర్శి నటించాడు. ఆ తర్వాత గులాబీ పార్టీ కెసిఆర్ పాత్రను తెగ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. చివరికి ఈ సినిమా తమ సొంత సినిమా అన్నట్టుగా గులాబీ పార్టీ భుజాల మీద మోయడం కనిపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో కాలడం. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్యారడైజ్ సినిమా మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు ఈ సినిమాకి ఏం సంబంధం అని.. అసలు ఆ పాత్రకు కెసిఆర్ అని పేరు పెట్టారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రెండుసార్లు కేసీఆర్ బయోపిక్ మీద చిత్రాలు వచ్చాయని.. రెండు ఫ్లాప్ అయ్యాయని.. ఇప్పుడు కేసీఆర్ పాత్రను హైలెట్ చేయడం ఎలా ఉద్దేశించి ఏంటని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

దేశ్ కీ నేత అనే స్థాయి నుంచి చివరికి సినిమాల్లో ఒక క్యామియో రోల్ వరకు కెసిఆర్ స్థాయిని దిగజార్చారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ది ప్యారడైజ్ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఒప్పుకుంది. ఆ సినిమా ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో చూస్తానని నాని చెబితే.. సంబంధిత అధికారుల అనుమతులు సూచించింది. స్వయంగా ముఖ్యమంత్రి స్పందించి ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఒప్పందం నాని ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఆయన మైత్రి విమల్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశారు. ఆ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కేటీఆర్ కూడా ఇటీవల ఆర్టీసీ రోడ్ ఎక్స్‌లో ఈ సినిమాను చూశారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభలో ప్రియదర్శి మాట్లాడారు. అక్కడ ఆయన కాలేశ్వరం.. ఇతర విషయాలను ప్రస్తావించారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. ప్రియదర్శిని ఏమీ అనకుండానే.. ఆ వీడియో క్లిప్పింగ్ లతో గులాబీ పార్టీ నాయకులను విమర్శించడం మొదలుపెట్టారు. అటు గులాబీ పార్టీ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు.. సోషల్ మీడియా వారితో తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమా ద్వారా నాని రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టాడని.. అది ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి ఈ మంటను ఎవరు చల్లార్చుతారు.. ఈ సినిమా గులాబీ పార్టీ ఏ విధంగా ఉపయోగపడుతుంది.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటర్ ప్రోడక్ట్ రెడీ చేస్తుంది.. అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అప్పటిదాకా రెండు పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసి ఎంజాయ్ చేయాల్సిందే.



You may also like

Leave a Comment