Anna Battuni Sivakumar:మాయ.. మంత్రం.. తంత్రం.. ఈ మూడు పదాలను ఆయన పాటించారు. బ్రహ్మాండంగా కోట్లు కొట్టేశారు. లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించారు. మొత్తానికి మాయ చేసారు. కాకపోతే రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా. అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఎలా చేసిన చెల్లుబాటయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటి అవకాశం కూడా లేదు. మొత్తంగా చూస్తే చేసిన మోసం.. సాగించిన వ్యవహారం అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా […]
అన్న బత్తుని శివకుమార్:మాయ.. మంత్రం.. తంత్రం.. ఈ మూడు పదాలను ఆయన పాటించారు. బ్రహ్మాండంగా కోట్లు కొట్టేశారు. లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించారు. మొత్తానికి మాయ చేసారు. కాకపోతే రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా. అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఎలా చేసిన చెల్లుబాటయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటి అవకాశం కూడా లేదు. మొత్తంగా చూస్తే చేసిన మోసం.. సాగించిన వ్యవహారం అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌కు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన మెడకు ఉచ్చు గట్టిగానే బిగిస్తున్నట్టు ఉంది. ఇప్పటికే భూమికి సంబంధించిన వ్యవహారంలో పత్రాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన రుణం తీసుకున్నట్టుగా చెబుతున్న ఏపీజే ఇంపెక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యవహారాల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
విజయవాడ నగరంలో ఐకెఎఫ్ అనే ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో తెనాలి ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కంపెనీకి సంబంధించిన చిరునామాలను పరిశీలించగా అక్కడ కంపెనీ కార్యాలయం బోర్డు.. ఇతర కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఏపీజే ఇంపెక్స్ పేరుతో సుమారు మూడు కోట్ల రుణాన్ని శివకుమార్ 2019లో తీసుకున్నారు. రుణం పొందిన తర్వాత బ్యాంకు ఖాతాలలో జరిగిన లావాదేవీలు.. ఇతర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. లోన్ తర్వాత కంపెనీ పేరుతో శివకుమార్ వ్యాపార కార్యకలాపాలు సాగించలేదా.. కేవలం డబ్బు కోసం మాత్రమే కంపెనీ పేరును ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ అంశాలకు సంబంధించి పూర్తి నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ కంపెనీ ద్వారా ఎటువంటి కార్యకలాపాలు సాగించారు.. రుణం ఎలా తీసుకున్నారు.. దానికి ఎటువంటి పత్రాలు సమర్పించారు.. అనే విషయాలు దర్యాప్తు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది
ఈ కేసులో కంపెనీ నిర్వహణ.. లోన్ సమర్పించిన పత్రాల వంటి వాటి మీద పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో భూమికి సంబంధించిన సర్వే వివరాలు.. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్లు.. వంటి పత్రాల మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎవరు జారీ చేశారు.. ఎటువంటి ఆధారాలతో వాటిని ధ్రువీకరించారు.. సంబంధిత అధికారులు వాటిపై సంతకాలు ఎలా పెట్టారు.. వంటి వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా తెనాలి పురపాలకం.. కొత్తపేట సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అధికారులు రికార్డులు నమోదు చేస్తున్నారు.
ప్రధానంగా ఏపీజే ఇంపెక్స్ కంపెనీ మీదనే ఇక్కడ ప్రశ్నలు వినిపిస్తున్నా. లావాదేవీలు జరిగిన సమయంలో కంపెనీ చిరునామా.. కార్యాలయం చేస్తున్న లావాదేవీలు.. ఆడిట్ వ్యవహారాలు.. లోన్ తీసుకున్నప్పుడు సమర్పించిన ఆస్తి పత్రాలు.. ఇలా అన్ని అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కంపెనీ.. రుణం ఇచ్చిన వాటికి సంబంధించిన పత్రాలు జారీ చేసిన నేపథ్యంలో వాటికి ప్రభుత్వ ధృవీకరణలు ఉన్నాయా.. వాటిని అమలు చేశారు.. వాటి వెనుక ఉన్న రికార్డులు ఏమిటి