Home క్రీడలుతెలుగు సినిమా: పైరసీ కాదు.. రివ్యూయర్లూ కాదు.. తెలుగు సినిమా – RMK NEWS

తెలుగు సినిమా: పైరసీ కాదు.. రివ్యూయర్లూ కాదు.. తెలుగు సినిమా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


తెలుగు సినిమా: తెలుగు సినిమాను చంపేస్తున్నది ఎవరు.. పైరసీనా.. కథలేని దర్శకుల.. నిర్మాతల నేల నాకే వ్యవహారమా.. హీరోల మూర్ఖత్వమా.. హీరోయిన్లకు తెలియని తనమా.. ఈ ప్రశ్నకు సమాధానం పైవేవీ కావు. ఎందుకంటే తెలుగు సినిమాను చంపేస్తున్నది పై కారణాలు కావు. ముమ్మాటికీ ఒక వ్యవస్థ. దాన్ని వ్యవస్థ అంటే దానికంటే మాఫియా అనవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఈ వ్యవస్థ ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. […]

తెలుగు సినిమా: తెలుగు సినిమాను చంపేస్తున్నది ఎవరు.. పైరసీనా.. కథలేని దర్శకుల.. నిర్మాతల నేల నాకే వ్యవహారమా.. హీరోల మూర్ఖత్వమా.. హీరోయిన్లకు తెలియని తనమా.. ఈ ప్రశ్నకు సమాధానం పైవేవీ కావు. ఎందుకంటే తెలుగు సినిమాను చంపేస్తున్నది పై కారణాలు కావు. ముమ్మాటికీ ఒక వ్యవస్థ. దాన్ని వ్యవస్థ అంటే దానికంటే మాఫియా అనవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఈ వ్యవస్థ ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్లు గీసింది గీత. వాళ్లు రాసిందే రాత. అడ్డు చెప్పడానికి నిర్మాతలకు ధైర్యం సరిపోదు. హీరోలకు ఖలేజా ఉండదు. ఇక దర్శకులు అంటారా జస్ట్ వాళ్లకు సరెండర్ అయిపోతారు.

ఒకప్పుడు సినిమాల షూటింగ్స్ నుంచి మొదలు పెడితే రిలీజ్ వరకు అన్ని నిర్మాతలు లేదా దర్శకులు చూసుకునేవారు. హీరోలు కూడా కొన్ని సందర్భాల్లో వేలు పెట్టేవారు. ఆ తర్వాత వాటికి సంబంధించిన విషయాలు బయటికి చెప్పడంలో నిర్మాణ సంస్థలు ఆసక్తిని చూపించేవి. ఇది ఒక బిజినెస్ లాగా ఉంటుందని భావించి ప్రేక్షకులకు సరికొత్త లీక్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేవి. క్రమక్రమంగా ఈ విషయాలు చేరవేయడానికి వీఆర్వోలు అవసరం ఉండరు. అప్పట్లో బిఎ రాజు.. పసుపులేటి రామారావు.. వినాయకరావు.. ఇంకా కొంతమంది దిగ్గజ సినిమా జర్నలిస్టులు ఉండేవారు. వీళ్ళు పిఆర్వోలుగా కూడా పనిచేసేవారు ప్రతి వారి కోసం తమ కోణంలో బయటపెట్టేవారు. కొన్ని సందర్భాల్లో సినిమా బాగా లేకుండా లేకపోతే కూడా మొహమాటం రాసేవారు.

ఇప్పుడు పిఆర్వోలు ఎలా మారిపోయారు అంటే ఒక ముఠా లాగా మారిపోయారు. వ్యవస్థలను మొత్తం చేతిలో పట్టుకున్నారు. సినిమాకు పబ్లిసిటీ పక్కన పెడితే.. కొన్ని సైట్లకు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు. అందులో వీరు కూడా కమీషన్లు తీసుకుంటున్నారు. పోనీ వీరు ప్రకటనలు ఇస్తున్న సైట్లు ఆ సినిమాల గురించి గొప్పగా రాస్తున్నాయా అంటే అది లేదు. ఇటీవల ఒక సినిమా విడుదలైంది. కనివిని ఎరుగని స్థాయిలో రికార్డులను. ఆ సినిమాకు సంబంధించి పి ఆర్ వో గా పనిచేసిన ఒక వ్యక్తి భారీగానే తీసుకున్నాడు. ఆ సినిమాకు పబ్లిసిటీ చేయడంలో విఫలమయ్యాడు. కొన్ని డమ్మీ సైట్లకు ప్రకటనలు ఇచ్చినట్టు చూపించాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బులను తన జేబులో వేసుకున్నాడు. ఈ సినిమా మౌత్ టాక్ ద్వారా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాత బతికిపోయాడు. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

సరిగా కొద్ది నెలల క్రితం భారీ అంచనాల మధ్య క్రీడల నేపథ్యంతో ఒక సినిమా విడుదలైంది. గుర్తింపు నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా అదరగొట్టింది. కానీ ఈ సినిమాకు పబ్లిసిటీ చేయడంలో పిఆర్వోలు విఫలమయ్యారు. పైగా ప్రకటనలు కూడా తమకు అనుకూలమైన సైట్‌కే ఇచ్చుకున్నారు. ఆ సైట్లు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టాయి. ఫలితంగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విడుదల కాలేదు. నేటి కాలంలో సినిమా ఎంత గొప్పగా కనిపిస్తుంది.. నటినటులు.. కథ అద్భుతమైన స్థాయిలో.. దానిని ప్రజలకు చేరవేయడంలో పిఆర్వోలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కానీ వారు తమ పనిని పక్కనపెట్టి.. నిర్మాతలను ముంచుతూ.. దర్శకులను ఆగం చేస్తూ.. నటినటులను మాయ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రలో ఐదు అక్షరాల పేరు ఉన్న ఓ పిఆర్ఓ ద్వయం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. దారుణంగా దండుకుంటున్నది. కనీసం సినిమాకి సంబంధించిన ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చిన ఊరు పేరు లేని సైట్లకు ఇస్తున్నారు. ఆ సైట్లు వీరివే కావడం విశేషం . డబ్బులు మొత్తం వీరి ఖాతాలో పడుతున్నాయి. దీనికి తోడు ఆ సినిమాలకు ఆశించిన స్థాయిలో ప్రచారం కనిపించింది చివరికి పాజిటివ్ టాక్ రావడం లేదు. దీనితో ఎన్నో పాజిటివ్ రకాల ఎలిమెంట్స్ కనిపించే సినిమా ప్రేక్షకుల దగ్గరికి చేరడం లేదు. నిజానికి తెలుగు సినిమాలు చంపేస్తోంది మిగిలిన కారణాలు కాదు. కేవలం వ్యవస్థీకృత ముఠా లాంటివి పిఆర్వో వ్యవస్థ.. బాలీవుడ్లో పిఆర్ఓ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. సినిమాకు అద్భుతమైన ప్రచారాన్ని కల్పిస్తుంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ, తెలుగులో మాత్రం చెదపురుగులాంటి వ్యవస్థ ఉంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

20 hours ago
Good Morning

Good Morning

22 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago