గుజరాత్ బావి నీరు : చింత చెట్టుకు వేపకాయలు కాస్తాయి. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. నంది పరుగులు తీస్తుంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయి. ఇదంతా చదువుతుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వాక్యాలు గుర్తు వస్తున్నాయి కదా. ఇది నిజమో.. అబద్ధమో తెలియదు గానీ.. ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందేమో అనిపిస్తుంది. నిజానికి వ్యవసాయ బావిలో నీరు సమృద్ధిగా కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు అందులో కదలికలు […]
గుజరాత్ బావి నీరు : చింత చెట్టుకు వేపకాయలు కాస్తాయి. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. నంది పరుగులు తీస్తుంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయి. ఇదంతా చదువుతుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వాక్యాలు గుర్తు వస్తున్నాయి కదా.
ఇది నిజమో.. అబద్ధమో తెలియదు గానీ.. ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందేమో అనిపిస్తుంది. నిజానికి వ్యవసాయ బావిలో నీరు సమృద్ధిగా కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు అందులో కదలికలు ఉండవు. ఎందుకంటే బావి అనేది ఒక పరిమిత స్థాయిలో ఉండే నిర్మాణం. అందులో నీరు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లే వరకు రైతులకు పంటలకు సమృద్ధిగా నీరు అందాలంటే బావిని లోతుగా తవ్వుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలు అయితే భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి చోట రైతులు స్వల్ప లోతులోనే బావులను తవ్వుతూ ఉంటారు.
గుజరాత్ రాష్ట్రంలో మాత్రం భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయి.. ముఖ్యంగా అక్కడ మోర్బి జిల్లాలో భూగర్భ జలాల మట్టం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్మాణం వీర్పర్ధ అనే గ్రామంలో సరిగా మూడు నెలల క్రితం ఒక రైతు బావి తవ్వాడు. చుట్టూ సిమెంట్ ఓడలు కూడా పోశాడు. ఇంతవరకు బాగానే ఇటీవల కాలంలో ఆ రైతు తవ్విన బావిలో నీరు సమృద్ధిగా చేరింది. ఇటీవల కాలంలో అక్కడ వర్షాలు విపరీతంగా కురిశాయి. అందువల్లే బావిలో నీరు సమృద్ధిగా చేరింది. గడిచిన ఆదివారం ఆ బావిలో ఉన్న నీరు ఒకసారిగా మసకబారింది. గడిచిన 8 నుంచి పది రోజుల్లో ఈ జిల్లాలో ఎటువంటి భూకంపం నమోదు కాలేదు. భూమిలో ప్రకంపనలు కూడా చోటు చేసుకోలేదు. అయితే ఇలా నీరు సముద్రపు అలల మాదిరిగా పోవడానికి ప్రధాన కారణం భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువు మీద వర్షపు నీటి ఒత్తిడి పెరగడమే. దీనిని పరిశీలించిన భూగర్భ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించడానికి ఈ భూగర్భ జిల్లా పరిశోధన సంస్థ నిపుణులు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రావడానికి సిద్ధమయ్యారు.
మనదేశంలో విపత్తులు చోటు చేసుకునే రాష్ట్రాలలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలో గతంలో కచ్ ప్రాంతంలో అతిపెద్ద భూకంపం సంభవించింది. నాడు భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. అయితే ఇప్పుడు ఈ బావిలో ఉన్న నీరు ఒక్కసారిగా పైకి రావడం ఇక్కడి ప్రజల ఆందోళనకు గురిచేస్తుంది. పైగా ఆ నీరు ఊగిపోతోంది. అక్కడి ప్రజల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఈ బయటి ప్రపంచానికి తెలియడంతో చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానం అవుతోంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
మోర్బి గ్రామంలో బావి నీరు డోలనం కొనసాగుతుంది; కలెక్టర్ ఆదేశాలు విచారణhttps://t.co/pff81MqDLb pic.twitter.com/YmeMLJAMfO
— దేశ్ గుజరాత్ (@DeshGujarat) ఆగస్టు 6, 2026