Kubera Telugu vs Tamil collection: తెలుగు వెర్షన్ వసూళ్లు అద్భుతం, కానీ తమిళ వెర్షన్ వసూళ్లు మాత్రం దారుణం. ధనుష్(ధనుష్) గత చిత్రం తమిళనాడులో రెండు రోజుల్లో రాబట్టిన వసూళ్లను ‘కుబేర’ చిత్రం మొదటి వారం పూర్తి చేసినా రాబట్టలేదు. దీనిని బట్టీ అక్కడి ఆడియన్స్ ఈ సినిమాని ఏ రేంజ్ లో రిజెక్ట్ చేసారో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా…
Kubera Telugu vs Tamil collection: నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న కుబేర(Kubera Movie) చిత్రం అప్పుడే బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకొని వారం రోజులైంది. టాలీవుడ్ కి బిజినెస్ లేక డీలా పడిన సమయంలో విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, భారీ వసూళ్లను రాబడుతూ, చాలా కాలం తర్వాత హౌస్ ఫుల్ బోర్డ్స్ కి పని చెప్పింది ఈ చిత్రం. తెలుగు వెర్షన్ వసూళ్లు అద్భుతం, కానీ తమిళ వెర్షన్ వసూళ్లు మాత్రం దారుణం. ధనుష్(ధనుష్) గత చిత్రం తమిళనాడులో రెండు రోజుల్లో రాబట్టిన వసూళ్లను ‘కుబేర’ చిత్రం మొదటి వారం పూర్తి చేసినా రాబట్టలేదు. దీనిని బట్టీ అక్కడి ఆడియన్స్ ఈ సినిమాని ఏ రేంజ్ లో రిజెక్ట్ చేసారో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది.
ఇది కూడా చదవండి: Kuberaa box office collection : 6 రోజుల్లో 103 కోట్లు.. కానీ ఆ ప్రాంతంలో మాత్రం డిజాస్టర్ గా నిలిచిన ‘కుబేర’
తెలుగు రాష్ట్రాల నుండి మొదటి వారం ఈ చిత్రం 30 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ వసూళ్లు, 51 కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కి మరో మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అదే విధంగా తమిళనాడులో 18 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 7 కోట్ల 80 లక్షలు, కేరళ నుండి కోటి 15 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 40 లక్షలు, ఓవర్సీస్ నుండి 26 కోట్ల 80 లక్షలు, మొత్తం మీద ఈ చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా 108 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, 54 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 11 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: కుబేర థియేటర్ లో ప్రమాదం: కుబేర థియేటర్ లో ఘోర ప్రమాదం.. పరుగులు తీసిన ఆడియన్స్..వీడియో వైరల్!
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా వచ్చిన వసూళ్లను చూస్తే నైజాం కనిపించగానే మొదటి వారంలో ఈ చిత్రం 13 కోట్ల 19 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో 3 కోట్ల 90 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 4 కోట్ల 84 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో కోటి 39 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 93 లక్షలు, కృష్ణ జిల్లాలో రెండు కోట్లు, నెల్లూరు జిల్లాలో కోటి రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. సెకండ్ వీకెండ్ ఈ చిత్రం అత్యంత కీలకం. చూడాలి మరి ఏ రేంజ్ వరకు వెళ్తుంది అనేది.
#కుబేరుడు 1వ వారం గ్రాస్ – 102 కోట్లు
కోసం అత్యధిక గ్రాసర్ #నాగార్జున
కోసం అత్యధిక గ్రాసర్ #శేఖర్ కమ్ముల
4వ 100 కోట్ల గ్రాసర్ కోసం #ధనుష్
1వ వారంలో అతిపెద్దది #ధనుష్ pic.twitter.com/M8wwbg6yEN— TrackTollywood (@TrackTwood) జూన్ 27, 2025