Home ఆంధ్రప్రదేశ్Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ – RMK NEWS

Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, వ్యూహప్రతివ్యూహాలలో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో అధికార కూటమి గ్రాఫ్ ఎలా ఉంది? గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

ఇందులో భాగంగా.. రైజ్ సర్వే సంస్థ అధినేత, పొలిటికల్ అనలిస్ట్ ప్రవీణ్ పుల్లట తాజా సర్వే వివరాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉమ్మడి తూర్పు గోదావరి మూడు జిల్లాల పరిధిలో కూటమి పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తే… ఇక్కడ సర్వే ప్రకారం కూటమికి కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ లేదా ముప్పు పొంచి చూపుతోంది.

కోనసీమ జిల్లాలో కూటమికి రిస్క్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలుగా
రాజోలు
పి. గన్నవరం
రామచంద్రాపురం
ఈ మూడు నియోజకవర్గాలను సర్వే. ఇందులో రాజోలు, పి. గన్నవరం స్థానాలు జనసేన చేతిలో ఉండగా రామచంద్రాపురం టీడీపీ చేతిలో ఉంది.

ఇకపై స్పష్టమైన ఆధిపత్యం ఉంటూ కూటమి సేఫ్ జోన్‌లో ఉన్న స్థానాలు
ముమ్మిడివరం
కొత్తపేట
ఈ రెండు టీడీపీ స్థానాలు.

ఇక టఫ్ ఫైట్ అమలాపురం నియోజకవర్గంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోందని ప్రవీణ్ పుల్లట తన సర్వేలో ఉంది.

ఇక విభజన తర్వాత ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే… ఇక్కడ కూడా కూటమికి కీలక నియోజకవర్గాల్లో సవాళ్లు ఎదురవుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది.

ఇక్కడకి రిస్క్ జోన్ లో ఉన్న కూటమి సీట్లు

రాజానగరం
కొవ్వూరు
నిడదవోలు
గమనించాల్సిన విషయమేమిటంటే.. రాజానగరం, నిడదవోలు స్థానాలు జనసేన అధికారంలో ఉండగా, కొవ్వూరు టీడీపీ ఖాతాలో ఉంది.

కూటమికి పూర్తి అనుకూలంగా, సేఫ్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలు
గోపాలపురం
రాజమండ్రి రూరల్
ఈ రెండు టీడీపీ స్థానాలు.

ఇక ఫలితం ఎటువైపు అయినామొగ్గే అవకాశం ఉన్న మిశ్రమ స్పందన కలిగిన సీట్లు

అనపర్తి (బీజేపీ సీటు)
రాజమండ్రి సిటీ (టీడీపీ సీటు)

చివరిగా కాకినాడ జిల్లా విషయానికి వస్తే… సర్వే వివరాల ప్రకారం ఇక్కడ కూటమికి అత్యంత ఎక్కువ సంఖ్యలో ‘రిస్క్ జోన్’ ఉంది.

కాకినాడ జిల్లాలో ఏకంగా 4 నియోజకవర్గాలు కూటమికి రిస్క్ జోన్‌లో ఉన్నట్లు సర్వే గుర్తించింది.
తుని (టీడీపీ)
ప్రత్తిపాడు (టీడీపీ)
కాకినాడ రూరల్ (జనసేన)
కాకినాడ సిటీ (టీడీపీ)
ఈ స్థానాల్లో స్థానిక సంస్థల పోరు కూటమికి అంత సులువు కాదనే సంకేతాలు వస్తున్నాయి.

ఇకకి మంచి పట్టు ఉన్న సేఫ్ కూటమి జోన్ నియోజకవర్గాలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనసేన స్థానం పిఠాపురం
జగ్గంపేట (టీడీపీ)
పెద్దాపురం (టీడీపీ)”

మొత్తంగా చూస్తే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట వెల్లడించిన ఈ కూటమి శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం, రాజమండ్రి రూరల్, కొత్తపేట వంటి స్థానాల్లో సేఫ్ జోన్ కనిపిస్తున్నప్పటికీ… కాకినాడ, రాజానగరం, రాజోలు, నిడదవోలు వంటి పలు కీలక స్థానాల్లో రిస్క్ జోన్ ఉండటంతో కూటమి నేతల ఆలోచనలో పడింది.

స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఈ పరిస్థితిని కూటమి ఎలా అధిగమిస్తుంది? విపక్ష వైఎస్సార్సీపీ ఈ వ్యూహాలు ఎలా అనుకూలంగా మలచుకుంటాయో వేచి చూడాలి!

మీ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

1 hour ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

1 hour ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

2 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

2 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

2 hours ago