Home జాతీయఅలహాబాద్ హైకోర్టు : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు! – RMK NEWS

అలహాబాద్ హైకోర్టు : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

అలహాబాద్ హైకోర్టు : ఇటీవలి కాలంలో స్కూల్‌ యూనిఫాం ధరించడం మతపరంగా సమస్యలకు దారితీస్తోంది. మత స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని పాఠశాలలకు తమ మతానికి సంబంధించిన డ్రెస్ వేసుకుంటామని చెబుతున్నారు. కోర్టులకూ వెళ్తున్నారు. తాజాగా అలహాబాద్‌ హైకోర్టు కూడా స్కూల్‌ యూనిఫాం విషయంలో సంచలన తీర్పు చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఒక పబ్లిక్‌ స్కూల్‌లోని విద్యార్థిని సకైనా బేగం యూనిఫాంతోపాటు హిజాబ్‌ ధరించాలని పట్టుబట్టి అలహాబాద్‌లో హైకోర్టును ఆశ్రయించిన సంఘటన, విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, సమానత్వం, మత స్వేచ్ఛ మధ్య గురించి మళ్లీ చర్చలు రేకెత్తించాయి. కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తూ స్పష్టమైన సూచనలు ఇచ్చింది.

కేసు నేపథ్యం..
సకైనా బేగం ఠాగూర్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు యూనిఫాంతోనే హాజరయ్యారు. 11వ తరగతికి వచ్చాక యూనిఫాంతోపాటు హిజాబ్‌ అనుమతి కోరింది. మతం ఆదేశిస్తోందని, రాజ్యాంగంలో సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ హక్కులు తనకు అనుకూలమని వాదించింది. తల్లితో కలిసి పిటిషన్ దాఖలు చేసింది. స్కూల్ యాజమాన్యం మాత్రం అందరూ సమానం, యూనిఫాం ద్వారా ఐడెంటిటీ, డిసిప్లిన్‌ కాపాడాలని స్పష్టం చేసింది.

కోర్టు ప్రధాన పరిశీలనలు..
జస్టిస్‌ మునీర్, న్యాయమూర్తి ఇంద్రజీత్‌ శుక్లా ఉన్న ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం ఇస్లామిక్ గ్రంథాల్లో తప్పనిసరి కాదని. ఖురాన్‌లో అలా ఉందని నిరూపించడంలో న్యాయవాదులు విఫలమయ్యారు. స్కూల్‌ యూనిఫాం క్రమశిక్షణ, అందరిలో సమానత్వం, సంస్థ ఐడెంటిటీ కోసం ఉంది. దీన్ని నిర్ణయించిన తర్వాత అందరూ పాటించాలి. మినహాయింపులు కోరడం చెల్లదు.
వ్యక్తిగత మార్పులు అడిగే అధికారం విద్యార్థికి లేదు. స్కూల్ నిర్ణయమే చివరి మాట అని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తి కేసుకు పరిమితం కాదు. విద్యాసంస్థల్లో ఏకరూపతను ప్రాధాన్యత ఇస్తుంది.

గత తీర్పులతో సారూప్యత
ఇలాంటి వివాదాలు కొత్తవి కావు. కర్ణాటకలో 2022లో హిజాబ్‌ వివాదం తీవ్రమైంది. అక్కడ కూడా యూనిఫాం తప్పనిసరని హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో హైకోర్టు తీర్పు అమలులో ఉంది. కేరళ హైకోర్టు కూడా సారూప్య స్థానం తీసుకుంది. పోలీసు విధుల్లో అయ్యప్ప మాల ధరించి యూనిఫాం నుంచి మినహాయింపు కోరడం, లేదా స్కూల్‌లో మతపరమైన దుస్తులు ప్రత్యేకంగా అడగడం వంటి వాటిని కోర్టులు తిరస్కరించాయి. యూనిఫాం అంటే అందరిలో సమానత్వం అనే సూత్రాన్ని విద్యా చట్టాలు, న్యాయస్థానాలు తప్పనిసరిగా చెబుతున్నాయి.

ఫలితాలు సాధ్యమేనా?
ఈ తీర్పు రాజ్యాంగపరమైన మత స్వేచ్ఛను గుర్తిస్తూనే, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో సామూహిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. స్కూల్ అనేది కేవలం చదువు చెప్పే చోటు కాదు. సమానత్వ భావనను పెంపొందించే స్థలం కూడా. ఒక విద్యార్థి మినహాయింపు పొందితే, ఇతరులు కూడా తమ మత గుర్తింపుల కోసం అదే అడగవచ్చు. అప్పుడు యూనిఫాం ఉద్దేశమే దెబ్బతింటుంది. అదే సమయంలో, విద్యార్థుల మత విశ్వాసాలను పూర్తిగా విస్మరించకూడదు. కానీ అవి సంస్థ నియమాలను అధిగమించకూడదు అనేది కోర్టు స్పష్టత సందేశం. హిజాబ్‌ను మతపరంగా తప్పనిసరి అని నిరూపించలేకపోవడం ఈ కేసులో కీలకమైంది.

మొత్తంగా, అలహాబాద్‌ హైకోర్టు తీర్పు గత కర్ణాటక, కేరళ తీర్పుల శ్రేణిలో మరో లింక్‌. విద్యాసంస్థలు యూనిఫాం గురించి స్పష్టంగా తెలియజేసేందుకు, సరిగ్గా అమలు చేయడానికి, విద్యార్థులకు నియమాలకు కట్టుబడి ఉండాలి. ఇలాంటి వివాదాలు తగ్గాలంటే స్కూల్స్, తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య సంభాషణ, స్పష్టత నియమాలు అవసరం.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

5 minutes ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

27 minutes ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

31 minutes ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

31 minutes ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

31 minutes ago