KA Paul: కిలారి ఆనంద పాల్.. అలియాస్ కేఏ పాల్.. ఈ పేరు తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేఏ పాల్ ఇప్పుడు అంటే జోకర్ అయ్యాడు కానీ.. ఒకప్పుడు ఆయన ప్రసంగిస్తే వేలాది మంది వచ్చేవారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండేవారు. సువార్త స్వస్థత మహాసభలను.. శాంతి మహాసభలను ఆయన నిర్వహిస్తుంటే ప్రపంచ దేశాల అధినేతలు వచ్చేవారు. అప్పట్లో అమెరికా అధ్యక్షులు కూడా ఆయన ప్రసంగిస్తే వినడానికి ఆసక్తిని చూపించే […]
KA Paul: కిలారి ఆనంద పాల్.. అలియాస్ కేఏ పాల్.. ఈ పేరు తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేఏ పాల్ ఇప్పుడు అంటే జోకర్ అయ్యాడు కానీ.. ఒకప్పుడు ఆయన ప్రసంగిస్తే వేలాది మంది వచ్చేవారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండేవారు. సువార్త స్వస్థత మహాసభలను.. శాంతి మహాసభలను ఆయన నిర్వహిస్తుంటే ప్రపంచ దేశాల అధినేతలు వచ్చేవారు. అప్పట్లో అమెరికా అధ్యక్షులు కూడా ఆయన ప్రసంగిస్తే వినడానికి ఆసక్తిని చూపించే వారంటే మామూలు విషయం కాదు.
పాల్ ప్రభ వెలిగినప్పుడు ఆయన స్థాయి ఒక రేంజ్ లో ఉండేది. ఒక దశలో ఆయన అపాయింట్మెంట్ కోసం చాలామంది ఎదురు చూసేవారు. అటువంటి వ్యక్తి కొన్ని కుట్రల వల్ల తన స్థాయిని కోల్పోయారు. చివరికి ఒక జోకర్ లాగా మిగిలిపోయారు. తెలుగు మీడియా అయితే కేఏ పాల్ ను దారుణంగా చూపించడం మొదలుపెట్టింది. కేఏ పాల్ కు విషయ పరిజ్ఞానం బాగుంటుంది. కాకపోతే దాన్ని బయట పెట్టే విషయంలోనే ఆయన ఇబ్బంది పడుతుంటారు. సరిగా ఇదే పరిశీలన తెలుగు మీడియా విపరీతంగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అందులో ఉన్న పాజిటివిటీని పక్కనపెట్టి.. నెగిటివిటీ ని మాత్రమే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అందువల్లే కేఏ పాల్ అభాసు పాలవుతుంటారు.
ఇక కేఏ పాల్ అమెరికాలో ఉన్నారు. ఆయన ఒక సెల్ఫీ వీడియో ద్వారా కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. సరిగ్గా కొద్ది గంటల క్రితమే ఆయన అమెరికా వెళ్లారు.. ఆయన అమెరికాకు రావడానికి ముందే క్రిస్టియన్ సంస్థలు.. ముస్లింలు.. సిక్కులు అమెరికా ప్రభుత్వానికి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫిర్యాదు చేశారు. భగవంతుడు వీసా క్యాన్ మోహన్ చేయడమైనది. దీనికంటే ముందే కేఏ పాల్ కు ఒక వ్యక్తి ఫోన్ చేశారు. ఆయన అభిప్రాయం అడిగారు. చివరికి న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని మోహన్ భగవత్ వీసా క్యాన్సల్ చేయడానికి అమెరికా అధ్యక్షుడిని కోరినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో కేఏ పాల్ ఒక సంచలన సెల్ఫీ వీడియో ద్వారా కీలక విషయాలు బయటపెట్టారు. “డెమొక్రాటిక్ కంట్రీలో మోహన్ భగవత్ టూర్ క్యాన్సల్ చేయడం సరికాదు. ఆయన దేశంలో టూర్ క్యాన్సల్ చేస్తే ఇతర మతాలకు సంబంధించిన వారికి కూడా క్యాన్సల్ చేయవలసి ఉంటుంది. అందరినీ ఆదుకుంటామని చెప్పాలని” కేఏ పాల్ ఆ వీడియోలో ప్రస్తావించారు. పాల్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ కు అతడు అండగా నిలిచిన విధానం పట్ల బిజెపి నాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేఏ పాల్ జోకర్ కాదని.. సీరియస్ పొలిటిషన్ అని చెబుతున్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ అమెరికా పర్యటనపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొద్ది గంటల క్రితమే అమెరికా వొచ్చారు. ఆయన రాకముందు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, ముస్లీంలు, సిక్కులు అమెరికా ప్రభుత్వం, ట్రంప్‌కు మోహన్ భగవత్ వీసా క్యాన్సల్ ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/07mYhNzYhE
— RTV (@RTVnewsnetwork) ఆగస్టు 26, 2026