Home UncategorizedSBI కొత్త సైబర్ స్కామ్.. అప్రమత్తంగా ఉండకపోతే ఖాతా ఖాళీ.. –

SBI కొత్త సైబర్ స్కామ్.. అప్రమత్తంగా ఉండకపోతే ఖాతా ఖాళీ.. –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

SBI సైబర్ స్కామ్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త సైబర్ నేరగాళ్లు మరో తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే రివార్డ్ పాయింట్లు, KYC అప్డేట్, బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో […]

SBI సైబర్ స్కామ్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త సైబర్ నేరగాళ్లు మరో తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే రివార్డ్ పాయింట్లు, KYC అప్డేట్, బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని SBI అధికారికంగా హెచ్చరించింది. ఈ మోసం ఎలా ఉంటుందంటే?

సైబర్ నేరగాళ్లు SMSలు, వాట్సాప్ సందేశాలు లేదా ఈ-మెయిల్ ద్వారా ‘YONO యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి’ అంటూ ఓ లింక్ పంపుతున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అధికారిక యాప్ కాకుండా ఫేక్ APK ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. దానిని మొబైల్‌లో స్టాల్ చేసిన వెంటనే ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, OTPలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అనంతరం బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును దోచేస్తున్నారు.

ఈ తరహా మోసాలపై స్పందించిన SBI.. YONO యాప్‌ను ఎప్పుడూ అధికారికంగా Google Play Store లేదా Apple App Store నుంచే అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. SMSలు, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయకూడదని, తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించింది. బ్యాంకు ఎప్పుడూ ఈ విధంగా APK ఫైల్స్ పంపినట్లు కూడా ఉంది.

ఖాతాదారులు తమ బ్యాంకింగ్ వివరాలు, OTP, CVV, PIN, పాస్‌వర్డ్ వంటి గోప్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని SBI సూచిస్తోంది. అనుమానాస్పద సందేశాలు, కాల్స్ లేదా లింకులు ఎదురైతే వెంటనే వాటిని విస్మరించి, బ్యాంకును సంప్రదించాలని కోరింది.

ఒకవేళ అలాంటి సైబర్ మోసానికి గురైనట్లయితే లేదా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయడం, అలాగే సమీపంలోని SBI శాఖను సంప్రదించాలని సూచించింది. అదనంగా, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. కొద్దిపాటి అప్రమత్తతతోనే ఇటువంటి సైబర్ మోసాల నుంచి తమ డబ్బును, వ్యక్తిగతంగా రక్షించుకోవడానికి నిపుణులు సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

2 days ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

2 days ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

2 days ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

3 days ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

3 days ago