AP DSC 2026: టీచర్ జాబ్ ల కోసం యువతీయువకులకు డీఎస్సీ 2026 ప్రకటన వరం లాగా మారింది. మతం 2721 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ప్రభుత్వం త్వరలో ఇవ్వనుంది. కొద్ది రోజులకే మళ్ళీ ఇన్పోస్ట్లతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగంలో ఆనందానికి అలాచేస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్కు సంబంధించిన తాజా వివరాలపై అత్యంత ఆసక్తిగా ఉన్నారు.. ఉపాధ్యాయ నియామకాలు విద్యావ్యవస్థ బలోపేతానికి కీలకంగా ఉంటాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాలు తీర్చడంతో పాటు.. ఉద్యోగుల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కల్పించడంలో డీఎస్సీ నియామకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో డీఎస్సీ 2026లో 2721 పోస్టుల భర్తీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన జిల్లాల వారీ ఖాళీలు.. సబ్జెక్టుల వారి విభజన.. అర్హతలు.. దరఖాస్తుల స్వీకరణ తేదీలు.. పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం విడుదల చేయనుంది.
స్పెషల్ ఎడ్యుకేషన్లో 350 పోస్టులు
ఈ స్పెషల్ నియామకాలలో 350 ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేస్తున్నామని నారా లోకేష్ ప్రకటించారు. ఒకరకంగా డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. ప్రత్యేక విద్య అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించడానికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం అత్యంత అవసరం. ఈ పోస్టుల భర్తీ ద్వారా ప్రత్యేక విద్యారంగంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తే ప్రత్యేక విద్యా అర్హతలు.. సంబంధిత శిక్షణ.. సర్టిఫికెట్లు.. ఇతర నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.
డీఎస్సీ కి సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటినుంచే తమ ప్రిపరేషన్ కొనసాగించడం మంచిదని ప్రభుత్వ ఉపాధ్యాయులు చెబుతున్నారు. సంబంధిత సిలబస్.. గత ప్రశ్నపత్రాలు.. సబ్జెక్టు ప్రాధాన్యతలు.. వంటి వాటి మీద దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో అధికారిక నోటిఫికేషన్లో అర్హతలు.. వయోపరిమితి.. రిజర్వేషన్లు.. దరఖాస్తు గడువును తప్పనిసరిగా పరిశీలిస్తున్నారు. మొత్తం గా డీఎస్సీ 2026లో 2721 పోస్టులు.. వాటిలో 350 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ అంశం ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అభ్యర్థుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే నియామకాలకు సంబంధించిన తుది తేదీలు.. అర్హతలు.. పోస్టుల విభజనపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది.